iDreamPost
android-app
ios-app

Prabhas: నాన్ రాజమౌళి కాదు.. ఇకపై నాన్ ప్రభాస్! కల్కితో లెక్కలు మారుతున్నాయి!

  • Published Jun 26, 2024 | 2:38 PM Updated Updated Jun 26, 2024 | 2:38 PM

టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఏ రికార్డులను అంచనా వేయాలి అన్నా.. నాన్ రాజమౌళి, రాజమౌళి చిత్రాలు అనే చెప్పేవారు. కానీ ఇక నుంచి నాన్ రాజమౌళి కాదు.. నాన్ ప్రభాస్ గా అవి మారబోతున్నాయి. కల్కి మూవీతో యంగ్ రెబల్ స్టార్ సరికొత్త చరిత్ర సృష్టించబోతున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే..

టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఏ రికార్డులను అంచనా వేయాలి అన్నా.. నాన్ రాజమౌళి, రాజమౌళి చిత్రాలు అనే చెప్పేవారు. కానీ ఇక నుంచి నాన్ రాజమౌళి కాదు.. నాన్ ప్రభాస్ గా అవి మారబోతున్నాయి. కల్కి మూవీతో యంగ్ రెబల్ స్టార్ సరికొత్త చరిత్ర సృష్టించబోతున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే..

  • Published Jun 26, 2024 | 2:38 PMUpdated Jun 26, 2024 | 2:38 PM
Prabhas: నాన్ రాజమౌళి కాదు.. ఇకపై నాన్ ప్రభాస్! కల్కితో లెక్కలు మారుతున్నాయి!

SS రాజమౌళి.. టాలీవుడ్ ఖ్యాతిని హాలీవుడ్ రేంజ్ కు తీసుకెళ్లిన ఘనుడు. ఇండస్ట్రీలో అపజయం అంటూ ఎరగని డైరెక్టర్ గా కొనసాగుతూ.. బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తున్నాడు. రికార్డుల విషయంలో ఒక్క మాట చెప్పాలంటే.. నాన్ రాజమౌళి మూవీస్ వర్సెస్ రాజమౌళి మూవీస్ అనే రేంజ్ కి ఆయన ఎదిగిపోయారు. ఇప్పటి వరకు ఏ రికార్డులను అంచనా వేయాలి అన్నా.. నాన్ రాజమౌళి, రాజమౌళి చిత్రాలు అనే చెప్పేవారు. కానీ ఆ లెక్కలన్నీ ఇప్పుడు మారిపోనున్నాయి. ‘కల్కి’ మూవీతో  యంగ్ రెబల్ స్టార్ ఆ లెక్కలన్నీ మార్చివేస్తున్నాడు. ‘నాన్ రాజమౌళి కాదు.. ఇక నుంచి నాన్ ప్రభాస్’.

ఏ రంగంలో అయినా రికార్డులకు కొన్ని కొలమానాలు ఉంటాయి. వాటికి ఓ బెంచ్ మార్క్ ను క్రియేట్ చేసిన క్రియేటర్ ఒకరు ఉంటారు. అలా టాలీవుడ్ రికార్డులకు ఓ బెంచ్ మార్క్ ను సెట్ చేసి పెట్టిన వ్యక్తి ఎస్ఎస్ రాజమౌళి. ‘బాహుబలి, బహుబలి 2’ మూవీతో ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులను బద్దలు కొడుతూ.. సరికొత్త రికార్డులను క్రియేట్ చేశాడు రాజమౌళి. తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలు రాజమౌళి తీసినవే కావడం విశేషం. బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ చిత్రాలు వసూళ్ చేసిన రికార్డులు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. కానీ ఆ లెక్కలకు ఇప్పుడు బీటలు వారేలా ఉన్నాయి. కల్కి మూవీతో ఇప్పటికే ఓవర్సీస్ లో ఆర్ఆర్ఆర్ మూవీ రికార్డులను బద్దలు కొడుతున్నాడు డార్లింగ్ ప్రభాస్.

‘కల్కి 2898 ఏడీ’ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ. జూన్ 27 ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతోంది. అయితే ఒక్కరోజు ముందుగానే జూన్ 26న ఓవర్సీస్ లో రిలీజ్ కాబోతోంది. అయితే ఇండస్ట్రీలో రాజమౌళి సెట్ చేసిన రికార్డులన్నింటినీ బద్దలు కొట్టడానికి సిద్ధమైయ్యాడు ప్రభాస్. రిలీజ్ కు ముందే ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ లో ఆర్ఆర్ఆర్ సెట్ చేసిన రికార్డులను బద్దలు కొట్టాడు. అతి తక్కువ టైమ్ లోనే 1 మిలియన్ డాలర్లు క్రాస్ చేసిన మూవీగా కల్కి విడుదలకు ముందే ఘనత వహించింది.

కాగా.. అమెరికాలో అయితే కల్కికి ఊహించని డిమాండ్ వస్తోంది. ఇప్పటికే లక్షా యాబైవేల టికెట్స్ అమ్ముడుపోగా.. 4 మిలియన్ డాలర్ల ప్రీ బుకింగ్స్ కూడా జరిగాయి. దాంతో ఈ రికార్డు సాధించిన తొలి చిత్రంగా నిలిచింది. కల్కికి హిట్ టాక్ వస్తే మాత్రం.. అక్కడ బాహుబలి, ఆర్ఆర్ఆర్ రికార్డులు తుడిచిపెట్టుకుపోవడం ఖాయం. దీంతో పాటుగా ఆర్ఆర్ఆర్ సాధించిన తొలి రోజు రూ.233 కోట్ల వసూళ్లను కచ్చితంగా బ్రేక్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ లెక్కలన్నీ చూసుకుంటే.. ఇక నుంచి నాన్ రాజమౌళి రికార్డులు అని కాకుండా.. నాన్ ప్రభాస్ రికార్డులని పిలుస్తారని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. మరి కల్కి విడుదల అయ్యాక ఏ రేంజ్ లో కలెక్షన్లను కొల్లగొడుతుందో చూడాలి మరి.

 

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet