iDreamPost
android-app
ios-app

అతడ్ని తలుచుకుని లైవ్‌లో ఏడ్చేసిన జీవీ ప్రకాష్ మాజీ భార్య సైంథవి

  • Published Jun 26, 2024 | 3:00 PM Updated Updated Jun 26, 2024 | 3:07 PM

G. V. Prakash Kumar and Saindhavi ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్.. సింగర్ సైంథవీ.. తమ 11 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలికిన సంగతి విదితమే. ఇటీవల విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు సైంథవి అతడ్ని తలచుకుని కన్నీటి పర్యంతం అయ్యింది.

G. V. Prakash Kumar and Saindhavi ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్.. సింగర్ సైంథవీ.. తమ 11 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలికిన సంగతి విదితమే. ఇటీవల విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు సైంథవి అతడ్ని తలచుకుని కన్నీటి పర్యంతం అయ్యింది.

  • Published Jun 26, 2024 | 3:00 PMUpdated Jun 26, 2024 | 3:07 PM
అతడ్ని తలుచుకుని లైవ్‌లో ఏడ్చేసిన జీవీ ప్రకాష్ మాజీ భార్య సైంథవి

ఇటీవల ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీ జంటలు వరుసగా విడాకులు ప్రకటించిన సంగతి విదితమే. సమంత- నాగ చైతన్య విడిపోతున్నట్లు ప్రకటించగా.. చాలా మంది ఫ్యాన్స్ విపరీతంగా బాధపడ్డారు. అలాగే కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్.. రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య కూడా తాము వేర్వేరుగా కొత్త జీవితాలను ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. అదేవిధంగా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్- సింగర్ సైంథవి సైతం 11 ఏళ్ల తమ వైవాహిక జీవితానికి స్వస్థి పలుకుతున్నామని ప్రకటించారు. అలాగే ఇప్పుడు మరో స్టార్ అండ్ క్యూట్ కపుల్ జయం రవి, ఆర్తి కూడా డివోర్స్ తీసుకోబోతున్నారంటూ ఓరూమర్ కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. ఇదిలా ఉంటే.. జీవీ ప్రకాష్‌తో విడిపోయిన తర్వాత సైంథవి.. ఇప్పుడిప్పుడే కెరీర్‌పై ఫోకస్ పెడుతోంది.

అలాగే బుల్లితెరపై సందడి చేస్తుంది సైంథవి. తమిళంలో ప్రసారం అవుతున్న ఓ షోకు హోస్టుగా వ్యవహరిస్తుంది. అయితే లైవ్ జరుగుతుండగా.. అతడ్ని తలుచుకుని కన్నీరు పెట్టుకుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. జీ తమిళ్‌లో ప్రసారమౌతుంది సరిగమప సీనియర్. ఇప్పుడు సీజన్ 4 నడుస్తోంది. ఈ కార్యక్రమానికి సైంథవి, నటి అభిరామి, సింగర్ విజయ్ ప్రకాష్ హోస్టులుగా వ్యవహరిస్తుండగా.. అర్చన యాంకర్. ప్రతి వారం డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ షో నిర్వహిస్తున్నారు. గత వారం డెడికేషన్ రౌండ్ నిర్వహించారు. ఈ సందర్భంగా చాలా మంది సింగర్స్ పాడుతుంటే.. తల్లిదండ్రులు వచ్చి భావోద్వేగానికి లోనయ్యారు. ఈ క్రమంలో సైంథవి కూడా కన్నీరు పెట్టుకుంది.

ఈ సమయంలో యాంకర్ అర్చన.. సింగర్ సైంథవిని ఓ ప్రశ్న అడిగింది. మీ నాన్న అంటే మీకు ఎంతో ఇష్టం అన్న ప్రశ్నకు.. ఆమె సమాధానం ఇచ్చింది. తాను ఈ స్థాయికి ఎదగడానికి తన తండ్రి కారణమని, తాను చేసే ప్రతి పనిలో తప్పు, ఒప్పులున్నా తనను మార్గ నిర్దేశకం చేశాడని తెలిపింది. అంతలో షోలో ఎంట్రీ ఇచ్చారు సైంథవి తండ్రి. అతడ్ని చూడగానే.. కౌగిలించుకుని లైవ్‌లోనే కన్నీటి పర్యంతం అయ్యింది ఈ స్టార్ సింగర్. ఇదిలా ఉంటే.. 2013లో జీవీ ప్రకాష్, సైంథవి వివాహం చేసుకున్నారు. వీరికి 2020లో ఓ పాప పుట్టింది. పాప పుట్టిన నాలుగేళ్లకు.. 11 ఏళ్ల తమ వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఇందులో ఇంకో విశేషం ఏంటంటే.. పెళ్లికి ముందు వీరిద్దరూ 11 సంవత్సరాలు పాటు ప్రేమించుకోవడం గమనార్హం. భర్త నుండి విడిపోయిన తర్వాత సైంథవి ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. సినిమాల్లో పాడే అవకాశాలను పొందుతుంది. ప్రముఖ సంగీత స్వరకర్త ఇమాన్‌తో కలిసి ఓ పాట పాడినట్లు తెలుస్తుంది.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş