iDreamPost
android-app
ios-app

సంచలన నిర్ణయం.. మహిళతో వివాహేతర బంధం.. DSP నుంచి కానిస్టేబుల్‌గా డీమోషన్‌

  • Published Jun 23, 2024 | 1:51 PM Updated Updated Jun 23, 2024 | 1:51 PM

భార్య ఉండగా.. మరో మహిళతో వివాహేతర బంధం పెట్టుకుని.. పట్టుబడ్డ ఓ డీఎస్పీని.. కానిస్టేబుల్‌గా డీమోట్‌ చేస్తూ.. సంచలన నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఆ వివరాలు..

భార్య ఉండగా.. మరో మహిళతో వివాహేతర బంధం పెట్టుకుని.. పట్టుబడ్డ ఓ డీఎస్పీని.. కానిస్టేబుల్‌గా డీమోట్‌ చేస్తూ.. సంచలన నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఆ వివరాలు..

  • Published Jun 23, 2024 | 1:51 PMUpdated Jun 23, 2024 | 1:51 PM
సంచలన నిర్ణయం.. మహిళతో వివాహేతర బంధం.. DSP నుంచి కానిస్టేబుల్‌గా డీమోషన్‌

సమాజంలో వివాహేతర సంబంధాలు విచ్చలవిడిగా పెరుగుతున్నాయి. ఓ దశాబ్దం వరకు కూడా ఇలాంటి రిలేషన్‌ పెట్టుకునేవారు.. నలుగురికి జడిసి.. రహస్యంగా కొనసాగించేవారు. కానీ కాలం మారుతున్న కొద్ది.. ఇలాంటి పనులకు పాల్పడే వారికి ధైర్యం పెరుగుతోంది. ఎంతలా అంటే.. వివాహేతర బంధాల కోసం కట్టుకున్న జీవిత భాగస్వామిని, కడుపున పుట్టిన బిడ్డలను కూడా కడతేర్చుతున్నారు. క్షణకాల సుఖం కోసం.. తమ జీవితాలతో పాటు.. వేరే వాళ్ల కుటుంబాలను కూడా నాశనం చేస్తున్నారు. ఇలాంటి వివాహేతర బంధాలు పెట్టుకునే వారిలో సామాన్యుల మాత్రమే కాక మంచి మంచి ఉద్యోగాలు చేసేవారు.. ఆఖరికి ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉంటున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న డీఎస్పీకి సంచలన శిక్ష విధించింది ఓ ప్రభుత్వం. ఆయనను కానిస్టేబుల్‌గా డీమోట్‌ చేస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.

ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న డీఎస్పీకి ఉత్తరప్రదేశ్‌ పోలీస్‌ విభాగం తగిన బుద్ధి చెప్పింది. భార్యను మోసం చేసి.. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న నేరానికి పాల్పడినందుకు గాను.. సదరు డీఎస్పీని కానిస్టేబుల్‌ స్థాయికి డిమోట్‌ చేస్తూ అక్కడి పోలీసు శాఖ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఇది సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే.. క్రిపా శంకర్‌ కనౌజియా అనే వ్యక్తి యూపీ పోలీసు శాఖలో పని చేస్తున్నాడు. కానిస్టేబుల్‌ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ డీఎస్పీ స్థాయికి చేరుకున్నాడు.

కానీ, మూడేళ్ల క్రితం ఓ మహిళతో వివాహేతర సంబంధం విషయంలో రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఈ ఘటన జరిగిన సమయంలో ఆయన ఉన్నావ్‌లో సర్కిల్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. వ్యక్తిగత కారణాలు చెప్పి.. ఎస్పీ అనుమతితో సెలవు తీసుకున్న కనౌజియా.. ఇంటికి వెళ్లడానికి బదులు ఓ మహిళా కానిస్టేబుల్‌తో కలిసి కాన్పుర్‌లోని హోటల్‌కు వెళ్లాడు. ఆ తర్వాత అధికారిక, వ్యక్తిగత ఫోన్లను స్విచ్ఛాఫ్‌ చేశాడు.

కనౌజియా ఫోన్‌ కలవకపోవటంతో అతడి భార్య.. ఉన్నావ్‌ ఎస్పీని సంప్రదించారు. దీనిపై వెంటనే దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు కాన్పుర్‌లోని హోటల్‌లో చివరిసారి అతడి ఫోన్‌ లొకేషన్‌ను గుర్తించారు. వెంటనే అక్కడికి చేరుకుని కనౌజియాను, అతడితో ఉన్న మహిళా కానిస్టేబుల్‌ని ఇద్దరినీ పట్టుకున్నారు. దీన్ని చాలా తీవ్రంగా పరిగణించిన అప్పటి లఖ్‌నవూ రేంజ్‌ ఐజీపీ విచారణకు ఆదేశించారు. క్రమశిక్షణారాహిత్యం కింద కఠిన చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేశారు. ఈ క్రమంలో ఈ ఘటనపై ఇటీవల విచారణ పూర్తి చేసిన పోలీసులు.. కనౌజియాను గోరఖ్‌పూర్‌ బెటాలియన్‌లోని ‘ప్రావిన్షియల్‌ ఆర్మ్‌డ్‌ కానిస్టేబులరీ’లో కానిస్టేబుల్‌గా డిమోట్‌ చేశారు. యూపీ పోలీసు ఉన్నతాధికారులు తీసుకున్న ఈ తీర్పు సంచలనంగా మారింది.