Krishna Kowshik
భార్యా భర్తల మధ్య గొడవలు రావడానికి ప్రత్యేకమైన పరిస్థితులు ఉండాల్సిన అవసరం లేదు. కల్పించుకోవాల్సిన ఆవశ్యకత అంతకన్నా లేదు. వాటంతట అవే సృష్టించబడి, తోసుకుంటూ వస్తాయి. అటువంటిదే ఈ ఘటన.
భార్యా భర్తల మధ్య గొడవలు రావడానికి ప్రత్యేకమైన పరిస్థితులు ఉండాల్సిన అవసరం లేదు. కల్పించుకోవాల్సిన ఆవశ్యకత అంతకన్నా లేదు. వాటంతట అవే సృష్టించబడి, తోసుకుంటూ వస్తాయి. అటువంటిదే ఈ ఘటన.
Krishna Kowshik
కర్ణుడు చావుకు కారణాలు అనేకం అంటుంటారు. కానీ భార్యతో తిట్లుతినడానికి భర్తకు కారణాలు అవసరం లేదనుకుంటా. ఎందుకంటే.. ఏ విషయంలో భార్య కోప్పడుతుందో భర్త కూడా ఊహించడం కష్టం. భార్య మూడ్ స్వింగ్ ఎలా ఉంటుందో ఆమెను పుట్టించిన దేవుడికి కూడా తెలియదు. షాపింగ్‌కు తీసుకెళ్లకపోయినా.. తన పుట్టిన రోజున గుర్తు లేకపోయినా, పెళ్లి రోజు అడిగిన గిఫ్ట్ ఇవ్వకపోయినా, వీకెండ్ సినిమాలు, షికార్లు తిప్పకపోయినా, అడిగినప్పుడల్లా పుట్టింటికి పంపకపోయినా అలిగి కూర్చోవడమే కాదు.. అపర కాళికలా మారిపోతుంది. ఇది మగాళ్లలో ఎక్కువగా వినిపించే వర్షన్. కానీ ఫోన్ లిఫ్టు చేయకపోయినా కూడా తన్నొచ్చు అని నిరూపించింది మరో మహిళ. వినడానికి వింతగా ఉన్న ఫోను ఎత్తలేదన్న కారణంతో కట్టుకున్నోడి తల పగులగొట్టింది.
‘నేను ఫోన్ చేస్తే నువ్వు లిఫ్ట్ చేయకపోవడమేంటీ.. నేనంటే భయం లేదా, నా మాటంటే ఖాతరు లేదా. నేనంటే అంత నిర్లక్ష్యం ఏంటీ’ అని భర్త ఫోన్ తీయకపోవడంతో కోపంతో ఊగిపోయిందో ఇల్లాలు. ఇంటికి వచ్చాక చివరకు అతడిని చితకేసింది. ఇటుకతో తాళికట్టిన మొగుడి తలపై ఒక్క దెబ్బ వేసింది. దీంతో అతడికి తీవ్ర రక్తస్రావం జరిగింది. ఈ ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాంపూర్‌లోని షహాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కరేతి గ్రామానికి చెందిన మనోజ్, బబిత భార్యా భర్తలు. మనోజ్ హెయిర్ కటింగ్ చేయించుకునేందుకు సెలూన్ షాపుకు వెళ్లాడు. కటింగ్ చేయించుకుంటున్న సమయంలో ఫోన్ పక్కన పెట్టాడు. ఆ సమయంలో భార్య బబిత అతనికి ఫోన్ చేసింది. పలుమార్లు ఫోన్ చేసినా అతను లిఫ్ట్ చేయలేదు.
కటింగ్ చేయించుకున్న తరువాత ఫోన్ చూడలేదు. తిరిగి భార్యకు ఫోన్ చేయలేదు. మనోజ్ తన ఇంటికి వెళ్లాడు. అయితే, ఫోన్ లిఫ్ట్ చేయలేదనే కారణంగా భద్రకాళిలా మారిపోయింది బబిత.. మనోజ్ రావడం రావడంతోనే చిరుత పులిలా గొడవకు దిగింది. మాట మాట పెరిగింది. కోపంతో బబిత పక్కనే ఉన్న ఇటుక తీసుకుని మనోజ్ తలపై బలంగా కొట్టింది. దీంతో అతనికి తీవ్ర గాయమైంది. వెంటనే ఆస్పత్రికి పరిగెత్తాడు మనోజ్. వైద్యులు అతనికి ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం మనోజ్ నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు.. ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చి దంపతులను కలిపారు. ఏకాభిప్రాయానికి వచ్చాక ఇంటికి పంపారు. అలా మళ్లీ కలిసిపోయారు భార్యా భర్తలు. కానీ ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.