iDreamPost
android-app
ios-app

వరల్డ్ కప్ ఇండియాదే! వారు వందకు వంద శాతం దానికి అర్హులు: పాక్ దిగ్గజం

  • Published Jun 26, 2024 | 3:10 PM Updated Updated Jun 26, 2024 | 3:10 PM

T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్ గెలవడానికి భారత్ కు వందకు వంద శాతం అర్హత ఉందని, టైటిల్ గెలవాలని తాను కోరుకుంటున్నట్లు పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్ గెలవడానికి భారత్ కు వందకు వంద శాతం అర్హత ఉందని, టైటిల్ గెలవాలని తాను కోరుకుంటున్నట్లు పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

వరల్డ్ కప్ ఇండియాదే! వారు వందకు వంద శాతం దానికి అర్హులు: పాక్ దిగ్గజం

టీ20 వరల్డ్ కప్ లో దుమ్మురేపే ఆటతీరుతో అదరగొడుతోంది టీమిండియా. టోర్నీలోకి టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన భారత్.. స్థాయి తగ్గ ప్రదర్శనతో సెమీస్ కు దూసుకొచ్చింది. అయితే సెమీస్ లో ఇంగ్లండ్ తో గండాన్ని దాటితే కప్ కొట్టడం పెద్ద కష్టమేమీ కాదు. ఇక ఎంతో మంది దిగ్గజ క్రికెటర్లు టీమిండియా కప్ కొడుతుందని, కొట్టాలని కోరుకుంటున్నారు. అందులో పాక్ దిగ్గజం కూడా ఉండటం విశేషం. టీ20 వరల్డ్ కప్ గెలవడానికి భారత్ కు వందకు వంద శాతం అర్హత ఉందని, టైటిల్ గెలవాలని తాను కోరుకుంటున్నట్లు పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్ వ్యాఖ్యానించాడు. టీమిండియా కప్ గెలవాలని కోరుకుంటున్న ఆ పాక్ ప్లేయర్ ఎవరు? తెలుసుకుందాం పదండి.

పాకిస్తాన్ క్రికెటర్లకు భారత్ ను, భారత క్రికెటర్లను విమర్శించడమే పెద్ద పని. సమయం చిక్కినప్పుడల్లా ఆ పనిని చేస్తుంటారు. చౌకబారు మాటలతో టీమిండియా ప్లేయర్లను విమర్శిస్తున్నామనుకుంటారు కానీ.. ఆ క్రమంలో వారి పరువుపోతుందని గ్రహించరు. అయితే తొలిసారి టీమిండియా టీ20 వరల్డ్ కప్ కొట్టాలని కోరుకున్నాడు పాకిస్తాన్ దిగ్గజ పేసర్ షోయబ్ అక్తర్. ఆస్ట్రేలియాపై అద్భుత విజయం సాధించిన తర్వాత తన టీమిండియా గురించి మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశాడు.

షోయబ్ అక్తర్ మాట్లాడుతూ..”వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్లో టీమిండియా గెలవాల్సింది. కానీ ఓడిపోయింది. ఇప్పుడు ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. ఆస్ట్రేలియాను చిత్తు చేసి.. సెమీస్ కు దూసుకొచ్చింది.ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ మీదే. దాన్ని గెలిచేందుకు మీరు వంద శాతం అర్హులు. టీమిండియాకే నా మద్ధతు. కచ్చితంగా మీరు కప్ గెలుస్తారు. ఇక ఈ టోర్నీలో రోహిత్ కెప్టెన్సీ అమోఘం. వరల్డ్ కప్ ను అందుకోవడానికి అతడికి అన్ని అర్హతలు ఉన్నాయి” అని అక్తర్ టీమిండియాకు మద్ధతు ఇస్తూ.. పొగడ్తల వర్షం కురిపించాడు. ఎక్కువగా భారత ప్లేయర్లను విమర్శించే పాక్ క్రికెటర్లు.. కొత్తగా ప్రశంసలు కుపించడం, కప్ కొట్టాలని కోరుకోవడంతో.. వారిలో మార్పు వచ్చిందా? అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. మరి టీమిండియా కప్ కొట్టాలని అక్తర్ కోరుకోవడం మీకేవిధంగా అనిపించింది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: Gulbadin Naib: చీటింగ్ చేయడంపై స్పందించిన నైబ్! ఏమన్నాడంటే?