Arjun Suravaram
ఓ యువకుడి విషయంలో చిత్రమైన ఘటన జరిగింది. అతడి ముక్కులోకి జలగ వెళ్లింది. దాదాపు 14 రోజుల పాటు లోపల ఉన్న కూడా అతడు కనిపెట్టలేదు. చివరకు..
ఓ యువకుడి విషయంలో చిత్రమైన ఘటన జరిగింది. అతడి ముక్కులోకి జలగ వెళ్లింది. దాదాపు 14 రోజుల పాటు లోపల ఉన్న కూడా అతడు కనిపెట్టలేదు. చివరకు..
Arjun Suravaram
చాలా మందికి విహార యాత్రలు అంటే చాలా ఇష్టం. కొత్త ప్రదేశాలు చూడటం, సముద్రాలు, జలపాతాలను సందర్శించడం వంటివి చేస్తుంటారు. ముఖ్యంగా వానకాలం సమయంలో నదులు, చెరువులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఇలాంటి సమయంలో సరదాగా గడిపేందుకు చాలా మంది ఆ ప్రాంతాలకు వెళ్తుంటారు. ఈ క్రమంలోనే కొన్ని సార్లు విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. తాజాగా ఓ యువకుడి విషయంలో చిత్రమైన ఘటన జరిగింది. అతడి ముక్కులోకి జలగ వెళ్లింది. దాదాపు 14 రోజుల పాటు లోపల ఉన్న కూడా అతడు కనిపెట్టలేదు. 14 రోజుల పాటు రక్తం పీల్చడంతో చివరకు ఏమైందో ఇప్పుడు చూద్దాం..
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్‌రాజ్‌లో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. శిశిల్ మావార్ అనే యువకుడు తన కుటుంబంతో కలిసి ప్రయాగ్ రాజ్ పట్టణంలో నివాసం ఉంటున్నాడు. అయితే కొన్ని రోజుల క్రితం శిశిల్ తన స్నేహితులతో కలిసి టూర్ వెళ్లాడు. ఉత్తరాఖండ్ లోని ఓ జనపాతం వద్దకు వీరందరూ సరదాగా గడిపేందుకు వెళ్లారు. ఇక స్నానం చేసేందుకు జలపాతంలోకి శిశిల్ మావార్ దిగాడు. స్నానం చేస్తుండగా పొరపాటున అతని నోట్లో జలగ వెళ్లింది. అయితే జలగ తన నోట్లోకి వెళ్లిన విషయం కూడా అతడికి తెలియదు. అలానే జలగా తనలోకి వెళ్లిన విషయం తెలియకుండానే శిశిల్ మావార్ జలపాతంలో సరదాగా గడుపుతున్నాడు.
తనకేమీ తెలియనప్పటికీ, ఇంటికి వచ్చేసరికి తన ముక్కు ఏదో ఇబ్బందిగా ఉన్నట్లు గుర్తించాడు. అంతేకాక అకస్మాత్తుగా అతడి ముక్కు నుంచి రక్తం కారడం ప్రారంభమైంది. ఇది ఇదంతా జరిగి దాదాపు 14 రోజులు అవుతుంది. ఇక శిశివాల్ తన సమస్య ఎక్కువగా కావడంతో వైద్యుడి దగ్గరు వెళ్లాడు. ఇక ఆయనను పరీక్షించిన వైద్యులు..షాక్ గురయ్యారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు యువకుడి ముక్కులో జలగ ఉందని గుర్తించారు. అది పూర్తిగా ముక్కులోప ఇరుక్కుని ఉందని గమనించారు. వైద్యులు పూర్తిగా పరిక్షీంచగా..జలగ అతని ముక్కులోని లోతైన టర్బినేట్ వెనుక దాక్కుందని గుర్తించారు. నెమ్మదిగా అక్కడ నుండి దాదాపు 14 రోజుల పాటు రక్తాన్ని పీల్చుకుంది. ముక్కులో ఉన్న జలగ బతికే ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.
ముక్కులోని ఏ భాగానికి నష్టం జరగకుండా టెలిస్కోపిక్ పద్ధతిలో జలగను విజయవంతంగా తొలగించారు. దీంతో ఆ యువకుడు ఊపిరి పీల్చుకున్నాడు. ఇక ఈ విషయం డాక్టర్ సుభాష్ చంద్ర శర్మ స్పందించారు. రెండు వారాల క్రితం ఉత్తరాఖండ్‌లోని ఓ జలపాతంలో నిల్వ ఉన్న నీటిలో రోగి స్నానం చేశాడని తెలిపాడు. శరీరాన్ని జలగలు అంటుకోవడం సహజం, కానీ ముక్కు లోపల జలగలు కనిపించడం చాలా అరుదుగా జరుగుతుందని తెలిపారు. మొత్తంగా అదృష్టవశాత్తూ ఈ జలగ ముక్కు ద్వారా మెదడు, కళ్లలోకి రాలేదని, లేకుంటే చాలా ఇబ్బందిగా ఉండేదని ఆయన తెలిపారు. మొత్తానికి ఆ యువకుడి ప్రాణం పాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.