iDreamPost
android-app
ios-app

SS Rajamouli Oscars: రాజమౌళి దంపతులకు మరో అరుదైన గౌరవం!

రాజమౌళి.. ఈ పేరు తెలియని  సినీ అభిమాని ఉండరు. అంతేకాక ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన టాలీవుడ్ డైరెక్టర్. ఇప్పటికే తన దర్శకత్వంతో  ఆయన ఎన్నో అవార్డులు, గౌరవాలు పొందారు. తాజాగా మరో అరుదైన గౌరవం పొందారు.

రాజమౌళి.. ఈ పేరు తెలియని  సినీ అభిమాని ఉండరు. అంతేకాక ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన టాలీవుడ్ డైరెక్టర్. ఇప్పటికే తన దర్శకత్వంతో  ఆయన ఎన్నో అవార్డులు, గౌరవాలు పొందారు. తాజాగా మరో అరుదైన గౌరవం పొందారు.

SS Rajamouli Oscars: రాజమౌళి దంపతులకు మరో అరుదైన గౌరవం!

టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచం స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి, దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి. అస్కార్ అవార్డు రావడమే ఇండియన్ సినిమాలకు గగనంగా మారిన సమయంలో ఏకంగా టాలీవుడ్ కే ఆస్కార్ వచ్చేలే చేసిన ఘనుడు. ఇక ఆయన గురించి ఎంత చెప్పిన కూడా తక్కువే. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో టాలీవుడ్​కు గ్లోబల్ వేదికగా పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చారు. ఇక రాజమౌళి సాధించిన విజయాల్లో ఆయన సతీమణి రమ రాజమౌళిది ప్రత్యేక స్థానం. వీరికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక అవార్డులు వరించాయి. తాజాగా ఈ  దంపతులకు మరో అరుదైన గౌరవం లభించింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

రాజమౌళి.. ఈ పేరు తెలియని  సినీ అభిమాని ఉండరు. అంతేకాక ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన టాలీవుడ్ డైరెక్టర్. ఇక ఆయన వంద శాతం స్ట్రైక్ రేటుతో తన సినిమాలను తెరకెక్కిస్తుంటారు. ఆయన తీసిన బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలు ప్రపంచ పటంలో టాలీవుడ్ ను ప్రత్యేకంగా నిలబెట్టాయి. అందరి చూపు తెలుగు చిత్ర పరిశ్రమవైపు చూసేలా చేశాయి. ఇప్పటికే తన దర్శకత్వంతో  ఆయన ఎన్నో అవార్డులు, గౌరవాలు పొందారు.

తాజాగా జక్కన్న మరో ఘనతను కూడా అందుకున్నారు. ఆస్కార్స్ అకాడమీ రాజమౌళికి అరుదైన గౌరవం అందించింది. ఆస్కార్స్ అకాడమీలో సభ్యుడిగా ఉండేందుకు రాజమౌళికి ఆహ్వనం దక్కింది. ప్రపంచవ్యాప్తంగా 487 మందికి ఈ ఆహ్వానం దక్కింది. ఆ సభ్యులో జకన్న దంపతులు కూడా ఉన్నారు. రాజమౌళితో పాటు ఆయన సతీమణి రమా రాజమౌళికి కూడా అకాడమీ నుంచి ఆహ్వానం అందింది.  దీంతో 2025 రానున్న ఆస్కార్ నామినేషన్లో వచ్చిన సినిమాల ఎంపిక విషయంలో ఓటు వేసేందుకు ఈ దంపతులు అర్హత పొందారు.

దర్శకుల కేటగిరీలో రాజమౌళికి, కాస్టూమ్ డిజైనర్స్ కేటగిరీలో రమా రాజమౌళికి ఈ అరుదైన గౌరవం దక్కనుంది. ఈ ఏడాది మొత్తం 57 దేశాల నుంచి 487 మంది సభ్యులను ఆహ్వానించగా.. అందులో ఇండియా నుంచి ఈ రాజమౌళి దంపతులతో పాటు మరికొందరు కూడా ఉన్నారు. ఈ ఏడాదికి ఎంపికైన సభ్యులను అకాడమీ తమ అధికారిక వెబ్ సైట్లో పెట్టింది. అందులో దర్శకుల జాబితాలో రాజమౌళిని ఆహ్వానిస్తూ.. ఆర్ఆర్ఆర్, ఈగ సినిమాలను అతడు దర్శకత్వం చేసినట్లు చెప్పా. ఇక రమా రాజమౌళి గురించి ప్రస్తావిస్తూ…ఆమె ఆర్ఆర్ఆర్, బాహుబలి ది బిగినింగ్ మూవీకి పని చేసినట్లుగా పేర్కొన్నారు.

ఆస్కార్ అవార్డును తీసుకురావడమే కాదు.. ఏకంగా ఆస్కార్ ను నిర్ణయించే స్థితిలోకి మన టాలీవుడ్  వారు వెళ్లడంతో అందరహు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  ఇక రాజమౌళి దంపతులకు ఈ అరుదైన గౌరవం దక్కడంపై తెలుగు వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ దంపతులకు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా విషేష్ తెలుపుతున్నారు. ఇక ఈ దంపతులతో పాటు ఈ ఇద్దరితోపాటు ఇండియా నుంచి షబానా అజ్మి, రితేష్ సిద్వానీ, రవి వర్మన్, రీమా దాస్, షీతల్ వర్మ, ఆనంద్ కుమార్ టక్కర్, నిషా పహూజా, హేమల్ త్రివేది, గితేష్ పాండ్యాలాంటి వాళ్లు ఆస్కార్ లో సభ్యులుగా చేరనున్నారు.