iDreamPost

OTT Release: ఈ వారం మూవీ లవర్స్‌కి పండగే.. ఓటీటీలోకి ఏకంగా 21 సినిమాలు

  • Published Jun 24, 2024 | 11:24 AMUpdated Jun 24, 2024 | 11:24 AM

మరో వారం ప్రారంభం అయ్యింది. మరి ఈ వీక్‌ ఓటీటీల్లోకి ఏమేం సినిమాలు రాబోతున్నాయి.. వీటిల్లో ఏవి ఆసక్తికరంగా ఉన్నాయి అనే వివరాలు మీ కోసం..

మరో వారం ప్రారంభం అయ్యింది. మరి ఈ వీక్‌ ఓటీటీల్లోకి ఏమేం సినిమాలు రాబోతున్నాయి.. వీటిల్లో ఏవి ఆసక్తికరంగా ఉన్నాయి అనే వివరాలు మీ కోసం..

  • Published Jun 24, 2024 | 11:24 AMUpdated Jun 24, 2024 | 11:24 AM
OTT Release: ఈ వారం మూవీ లవర్స్‌కి పండగే.. ఓటీటీలోకి ఏకంగా 21 సినిమాలు

ఇంతకు ముందు కొత్త వారం ప్రారంభం అయ్యిందంటే చాలు.. సినీ లవర్స్‌ ఆ వీక్‌ రిలీజ్‌ కాబోయే సినిమాల కోసం ఆత్రుతగా ఎదురు చేసేవారు. శుక్రవారం నాడు థియేటర్‌కి ఏ కొత్త సినిమా వస్తుంది.. టికెట్ల కోసం ఎన్ని గంటలకు థియేటర్‌కు వెళ్లాలి.. కటౌట్‌లు, బాణసంచా వంటి హడావుడి ఉండేది. కానీ కరోనా తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. థియేటర్‌కు వెళ్లి సినిమా చూసే ప్రేక్షకులు సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. సార్ట్‌ హీరో ఉండి.. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన సినిమా అయినా సరే.. మౌత్‌ టాక్‌ బాగుంటేనే వెళ్తున్నాడు. లేదంటే ఓటీటీలోకి వచ్చేంతవరకు వెయిట్‌ చేస్తున్నాడు. ప్రస్తుతం థియేటర్‌కు వెళ్లి సినిమాలు చూసే వారి కన్నా.. ఓటీటీల్లో మూవీలు చూసేవారి సంఖ్య భారీగా పెరిగింది. అందుకు తగ్గట్టుగానే ఆయా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు వినియోగదారులను ఆకట్టుకోవడం కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసి.. ప్రతి వారం కొత్త సినిమాలను తీసుకువస్తున్నాయి.

దీనిలో భాగంగా ఈ వారం కూడా ఓటీటీల్లోకి భారీ ఎత్తున సినిమాలు రాబోతున్నాయి. ఏకంగా 21 సినిమాలు రిలీజ్‌ కాబోతున్నాయి. దాంతో మూవీ లవర్స్‌ పండగ చేసుకోబోతున్నారు. ఇక థియేటర్లలో విడుదలయ్యే సినిమాల విషయానికి వస్తే.. ఈ వారం కల్కి వారం అని చెప్పవచ్చు. డార్లింగ్‌ ప్రభాస్‌ నటిస్తోన్న కల్కి మూవీ.. ఈ వారం అనగా జూన్‌ 27న విడుదల కానుంది. దాంతో మూవీ లవర్స్‌ దృష్టంతా కల్కి చిత్రం మీదనే ఉంది.

అదలా ఉంచితే ఈ వారం ఓటీటీలోకి 21 సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు విడుదల కాబోతున్నాయి. అయితే వీటిల్లో కేవలం 2, 3 సినిమాల మీదనే ప్రేక్షకులకు ఆసక్తి ఉంది. తెలుగులో అయితే నవదీప్‌ నటించిన లవ్‌ మౌళి.. దీంతో పాటు ఫహద్‌ ఫాజిల్‌ ఆవేశం హిందీ వర్షన్‌, శర్మజీ కీ బేటీ అనే మరో హిందీ మూవీపై ప్రేక్షకుల్లో కాస్తో, కూస్తో ఆసక్తి నెలకొని ఉంది. మరి ఈ వారం ఏ ఓటీటీలో ఏ సినిమాలు స్ట్రీమింగ్‌కు రెడీ అవుతున్నాయో మీరు ఓ లుక్కేయండి.

జూన్‌ 24-30 వరకు ఓటీటీల్లో వచ్చే సినిమాల జాబితా..

అమెజాన్ ప్రైమ్

  • ఐ యామ్: సెలీన్ డయాన్ (ఇం‍గ్లీష్ సినిమా) – జూన్ 25
  • సివిల్ వార్ (ఇంగ్లీష్ మూవీ) – జూన్ 28
  • శర్మజీ కీ బేటీ (హిందీ సినిమా) – జూన్ 28

నెట్‌ఫ్లిక్స్

  • కౌలిట్జ్ & కౌలిట్జ్ (జర్మన్ సిరీస్) – జూన్ 25
  • వరస్ట్ రూమ్ మేట్ ఎవర్: సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 26
  • డ్రాయింగ్ క్లోజర్ (జపనీస్ మూవీ) – జూన్ 27
  • సుపాసెల్ (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 27
  • ద 90’స్ షో పార్ట్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 27
  • ద కార్ప్స్ వాషర్ (ఇండోనేసియన్ మూవీ) – జూన్ 27
  • ఏ ఫ్యామిలీ ఎఫైర్ (ఇంగ్లీష్ సినిమా) – జూన్ 28
  • ఓనింగ్ మ్యాన్ హట్టన్ (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 28
  • ద విర్ల్ విండ్ (కొరియన్ సిరీస్) – జూన్ 28

ఆహా

  • ఉయిర్ తమిళుక్కు (తమిళ మూవీ) – జూన్ 25
  • లవ్ మౌళి (తెలుగు సినిమా) – జూన్ 27

జీ5

  • రౌతు కీ రాజ్ (హిందీ మూవీ) – జూన్ 28

హాట్‌స్టార్

  • ద బేర్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 27
  • ఆవేశం (హిందీ డబ్బింగ్ మూవీ) – జూన్ 28

ఆపిల్ ప్లస్ టీవీ

  • ల్యాండ్ ఆఫ్ ఉమెన్ (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 26
  • ఫ్యాన్సీ డ్యాన్స్ (ఇంగ్లీష్ సినిమా) – జూన్ 28
  • వండ్ల (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 28

సైనా ప్లే

  • హిగ్యుటా (మలయాళ సినిమా) – జూన్ 28

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి