iDreamPost

Video: వేసవిలోబయటి నిమ్మకాయ నీళ్లు తాగుతున్నారా..? ఈ వీడియో చూస్తే జన్మలో ముట్టరు..

ఈ సంవత్సరం ఎండలు అదరగొడుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనాలు వణికిపోతున్నారు. ఇది ఇలా ఉంటే.. వేసవిలో వివిధ ప్రాంతాలకు ప్రయాణం చేసే వారు బయట విక్రయించే నిమ్మకాయ రసం వంటి ఇతర జ్యూస్ లు తాగుతుంటారు. అయితే ఓ వీడియో చూస్తే.. అసలు జన్మలో బయట అమ్మే జ్యూస్ లను ముట్టరు.

ఈ సంవత్సరం ఎండలు అదరగొడుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనాలు వణికిపోతున్నారు. ఇది ఇలా ఉంటే.. వేసవిలో వివిధ ప్రాంతాలకు ప్రయాణం చేసే వారు బయట విక్రయించే నిమ్మకాయ రసం వంటి ఇతర జ్యూస్ లు తాగుతుంటారు. అయితే ఓ వీడియో చూస్తే.. అసలు జన్మలో బయట అమ్మే జ్యూస్ లను ముట్టరు.

Video: వేసవిలోబయటి నిమ్మకాయ నీళ్లు తాగుతున్నారా..? ఈ వీడియో చూస్తే జన్మలో ముట్టరు..

ఈ ఏడాది ఎండలు దంచికొడుతున్నాయి. ఏటికి ఏడు..ఉష్ణోగ్రతలు మించి పోతున్నాయి. ఈసారి కూడా భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. అధిక ఉష్ణోగ్రతలు, వేడి గాలుల కారణంగా జనాలు తీవ్ర  ఇబ్బందులు పడుతున్నరు. బయటకు వచ్చేందుకు భయంతో వణికిపోతున్నారు. ఇక వేసవిలో బయటకు వెళ్లిన సమయంలో డ్రింక్స్ తాగేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా బయట అమ్ముతున్న నిమ్మకాయ నీళ్లను తాగుతుంటారు. అయితే కొందరు అపరిశుభ్రంగా ఉంటూ, అలానే నిమ్మకాయనీళ్లను విక్రయిస్తుంటారు. అయితే తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది మీరు చూసినట్లు అయితే జన్మలో బయట నిమ్మకాయ నీళ్లు తాగరు. మరి… ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

ఈసారి ఎండలు తీవ్ర  స్థాయిలో విజృభిస్తున్నాయి. ఇక సూర్యుడు అయితే తనకు ఎవరు అడ్డు లేరు అన్నట్లు ప్రవర్తిస్తూ..జనాలపై పగ తీర్చుకుంటున్నాడు. నిప్పుల కొలిమిలా వాతావరణం మారిపోయింది. దీంతో పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరు అయితే ఏసీలు, కూలర్లు, ఫ్యాన్ల కింద సేద తీరుతున్నారు. ఇది ఇలా ఉంటే.. వేసవి అనగానే గుర్తుకు వచ్చేది డ్రింక్స్. అనేక రకాల శీతలపానీయాలకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఇక బయట రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ ల సమీపంలో కూల్ డ్రింక్స్ , జ్యూస్ లు, నిమ్మకాయ సోడా వంటివి విక్రయిస్తుంటారు.

చాలా మంది జనం కూడా వివిధ పనుల నిమిత్తం బయటకు వచ్చి.. ఇలా విక్రయిస్తున్న జ్యూస్ , నిమ్మకాయ రసాలను తాగుతుంటారు. అయితే వేసవి వేడికి దాహం తీర్చుకునే దానిపై ధ్యాస ఉంటుంది. కానీ అలాంటి బయటి ప్రదేశాల్లో జ్యూస్‌ ల తయారీలో ఎంత వరకు పరిశుభ్రత పాటిస్తున్నారో చాలా మంది గమనించారు, దాని గురించి ఆలోచించారు. చాలా  తక్కువ మంది మాత్రమే బయట అమ్మే వాటిలో శుభ్రత గురించి ఆలోచిస్తారు?. తాజాగా వైరల్ అవుతున్న ఓ  ఈ వీడియోని చూస్తే.. అసలు బయట డ్రింక్స్ తాగడానికే భయపడతారు. ఇక ఆ వీడియోలో ముంబైలోని రైల్వే స్టేషన్ వెలుపల నిమ్మకాయ రసం తయారు చేసిన ఓ వ్యక్తి చేసిన పని చూస్తే అసహ్యం వేస్తుంది. అంతేకాక ఇకపై మీరు మీ జీవితంలో బయట నిమ్మకాయ నీళ్లు తాగే సాహసం చేయరు.

వైరల్ అవుతోన్న వీడియోలో ముంబై నగరంలోని ఖార్ఘర్ రైల్వే స్టేషన్ బయట నిమ్మకాయ స్టాల్‌ కనిపిస్తుంది. అక్కడ ఒక వ్యక్తి నిమ్మకాయ నీళ్లు తయారుచేసి అమ్ముతున్నాడు. జ్యూస్‌ తయారుచేస్తున్న వ్యక్తి అదే చేతులతో శరీరంలోని ప్రైవేటు పార్టు  ప్రాంతంలో గోక్కుంటూ కనిపిస్తున్నాడు.  ఆ చేతులు క్లీన్ చేసుకోకుండా అదే చేత్తో జ్యూస్‌ను తయారు చేస్తున్నాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులు ఎలాంటి ప్రామాణాలు పాటించకుండానే ఆహార ఉత్పత్తులు తయారు చేస్తుంటారని పలువురు ఆరోపిస్తున్నారు. అపరిశుభ్రంగా జ్యూస్ తయారు చేసే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి