iDreamPost
android-app
ios-app

ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయో పరిమితి.. రేవంత్ సర్కార్ కీలక ప్రకటన

  • Published Apr 13, 2024 | 9:46 AMUpdated Apr 13, 2024 | 9:46 AM

Retirement Age Limit News: ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయో పరిమితిపై గత కొన్ని రోజులుగా జరుగుతోన్న ప్రచారంపై స్పందిస్తూ రేవంత్ సర్కార్ కీలక ప్రకటన చేసింది. ఆ వివరాలు..

Retirement Age Limit News: ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయో పరిమితిపై గత కొన్ని రోజులుగా జరుగుతోన్న ప్రచారంపై స్పందిస్తూ రేవంత్ సర్కార్ కీలక ప్రకటన చేసింది. ఆ వివరాలు..

  • Published Apr 13, 2024 | 9:46 AMUpdated Apr 13, 2024 | 9:46 AM
ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయో పరిమితి.. రేవంత్ సర్కార్ కీలక ప్రకటన

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. పాలనాపరంగా సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే రైతుబంధుకు పరిమితి విధిస్తామని తెలిపిన సంగతి తెలిసిందే. ఉద్యోగ నియామకాల కోసం కూడా కసరత్తు చేస్తోంది. ఇలా ఉండగా.. గత కొన్ని రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా కొన్ని వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. అది దేని గురించి అంటే.. ప్రభుత్వ ఉద్యోగుల వయో పరిమితికి సంబంధించి. దీనిపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుందంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వం దీనిపై కీలక ప్రకటన చేసింది. ఈ అంశంపై స్పష్టతనిచ్చింది. ఆ వివరాలు..

తెలంగాణలో గత కొన్ని రోజులుగా ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణకు సంబంధించి.. కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఉద్యోగులకు 33 ఏళ్ల సర్వీస్ లేదా 61 సంవత్సరాల వయో పరిమితిలో.. ఏది ముందైతే అది తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. మీడియా, సోషల్ మీడియాల్లో వార్తలు వచ్చాయి. దాంతో.. ప్రభుత్వ ఉద్యోగులు అయోమయానికి గురవుతున్నారు.

అయితే ఈ వార్తలపై తాజాగా తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు శుక్రవారం సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమీషనర్ ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వయో పరిమితిని 61 ఏళ్లుగా లేదా 33 సంవత్సరాల సర్వీసు ఇలా ఏది ముందు పూర్తయితే దాని దృష్ట్యా పదవీ విరమణ.. అంటూ వివిధ వార్తా పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేశారు.

Retirement age

అంతేకాక ఈ అంశంపై ప్రభుత్వ స్థాయిలో ఏ విధమైన ప్రతిపాదన కానీ.. ఫైల్ నిర్వహణ రాలేదని తెలిపారు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అనడం పూర్తిగా అవాస్తవం అన్నారు. ఈ విధమైన ఊహాజనిత వార్తలు రాయడం, దీనిని సామాజిక మాధ్యమాల్లో ప్రసారం చేయడం సరైంది కాదని పేర్కొన్నారు. ఇలాంటి అవాస్తవ వార్తలు ప్రచురించే, ప్రచారం చేసే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకునే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని ఘాటుగా హెచ్చరించారు.

గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 2021లో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 58 నుంచి 61 ఏళ్లకు పెంచింది. ప్రస్తుతం ఆ వయో పరిమితి గడువు ముగియడంతో పదవీ విరమణలు కొనసాగుతున్నాయి. మార్చి 31 నుంచి రాష్ట్రంలో భారీగా పదవీ విరమణలు మొదలయ్యాయి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగుల రిటైర్మెంట్ వయో పరిమితిని పెంచదని భావిస్తున్నారు. దీని వల్ల నిరుద్యోగులకు నష్టం చేకూరే అవకాశం ఉన్నందున రేవంత్ సర్కార్ అలాంటి చర్యలు తీసుకోదని అంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి