iDreamPost

నేడు హైదరాబాద్‌లో పార్కులు బంద్, ట్రాఫిక్‌ ఆంక్షలు.. కారణం ఇదే

  • Published Nov 07, 2023 | 10:28 AMUpdated Nov 07, 2023 | 10:28 AM

నేడు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. అలానే పార్క్‌లు మూసి వేయనున్నారు. అందుకు గల కారణం ఏంటి అంటే..

నేడు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. అలానే పార్క్‌లు మూసి వేయనున్నారు. అందుకు గల కారణం ఏంటి అంటే..

  • Published Nov 07, 2023 | 10:28 AMUpdated Nov 07, 2023 | 10:28 AM
నేడు హైదరాబాద్‌లో పార్కులు బంద్, ట్రాఫిక్‌ ఆంక్షలు.. కారణం ఇదే

తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో.. పార్టీలన్ని జోరు పెంచాయి. ప్రచార కార్యక్రమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నాయి పార్టీలన్ని. ఈ క్రమంలో బీజేపీ తరఫున ప్రచారం చేయడం కోసం.. నరేంద్ర మోదీ నేడు హైదరాబాద్‌కు రానున్నారు. ఎల్బీ స్డేడియంలో బీజేపీ తలపెట్టిన బీసీ ఆత్మగౌరవ సభకు ఆయన హాజరు కానున్నారు. మోదీ పర్యటన నేథ్యంలో.. పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అంతేకాక సభ నేథ్యంలో నగరంలో పలు మార్గాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించడమే కాక పార్కులని మూసివేయాలని ఆదేశించారు. మరి నేడు ఏ మార్గాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.. ఏ ప్రాంతాల్లో పార్కులు మూసి వేశారు అంటే..

ఎల్‌బీ స్టేడియంలో మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ సభ ఉంది. దీనిలో పాల్గొనడం కోసం ప్రధాని.. రాజ్‌ భవన్‌ రోడ్‌ నుంచి ‍ఖైరతాబాద్‌ జంక్షన్‌, ఎన్టీఆర్‌ మార్గ్‌, లిబర్టీ మీదుగా ప్రయాణం చేసి ఎల్‌బీ స్టేడియానికి చేరుకోనున్నారు. ఈ క్రమంలో మోదీ పర్యటన నేథ్యంలో భద్రతా ఏర్పట్లలో భాగంగా పార్కులు మూసి వేయాలని పోలీస్‌ ఉన్నతాధికారులు సూచించారు. అందుకే ఆ మార్గంలో ఉన్న ఎన్టీఆర్‌ గార్డెన్‌, లుంబినీ పార్కులను మూసివేయనున్నట్లు హెచ్‌ఎండీఏ ప్రకటించింది.

ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో.. ఎల్‌బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు పోలీసులు. ఆ సమయంలో ఎల్బీ స్టేడియం చుట్టుపక్కన ప్రాంతాల్లో రహదారుల మూసివేత, దారిమళ్లింపులు ఉంటాయని నగర ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించారు.

ఈ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..

  • ఏఆర్‌ పెట్రోల్‌ పంప్‌ జంక్షన్‌ నుంచి బీజేఆర్‌ విగ్రహం వైపు ట్రాఫిక్‌కు అనుమతి ఉండదు. అటు వైపు నుంచే వచ్చే వాహనాలను నాంపల్లి, రవీంద్రభారతి వైపు మళ్లీస్తున్నారు.
  • ట్యాంక్‌బండ్‌ నుంచి బషీర్‌బాగ్‌ జంక్షన్‌ వైపు వెళ్లే వాహనాలను లిబర్టీ జంక్షన్‌ వద్ద హిమాయత్‌నగర్‌ వైపుగా డైవర్ట్ చేస్తారు.
  • అబిడ్స్‌, గన్‌ఫౌండ్రి నుంచి బీజేఆర్‌ విగ్రహం వైపు ట్రాఫిక్‌ను అనుమతించరు. ఈ వాహనాలను ఎస్‌బీఐ గన్‌ఫౌండ్రి నుంచి చాపల్‌ రోడ్డులోకి మళ్లిస్తారు.

మోదీ టూర్‌ షెడ్యూల్‌ ఇది..

మంగళవారం సాయంత్రం 5.05 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌ బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. ఆ తర్వాత సాయంత్రం 5.25 గంటలకు సభ జరగనున్న ఎల్బీ స్టేడియానికి చేరుకుంటారు. 5.30 నుంచి 6.10 గంటల వరకు అనగా 40 నిమిషాల పాటు.. మోదీ ఇక్కడే ఉంటారు. ఆ తర్వాత సభ ముగిసిన తర్వాత 6.15 గంటలకు బయలుదేరి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి నేరుగా ఢిల్లీకి పయనమవుతారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి