iDreamPost
android-app
ios-app

HYDలో మళ్లీ మొదలైన ముసురు వర్షం.. మరో మూడు రోజుల పాటు

  • Published Jul 24, 2024 | 5:31 PMUpdated Jul 24, 2024 | 5:31 PM

తెలంగాణలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తూ గ్యాప్ తీసుకున్న తర్వాత మళ్లీ నేటి మధ్యహ్నం నుంచి నగరంలో ముసురు వాన పడుతుంది. అయితే ఈ వర్షాలు అనేవి మరో మూడు రోజులు పాటు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని తాజాగా  హైదరాబాద్ వాతవరణ శాఖ హెచ్చరించింది.

తెలంగాణలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తూ గ్యాప్ తీసుకున్న తర్వాత మళ్లీ నేటి మధ్యహ్నం నుంచి నగరంలో ముసురు వాన పడుతుంది. అయితే ఈ వర్షాలు అనేవి మరో మూడు రోజులు పాటు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని తాజాగా  హైదరాబాద్ వాతవరణ శాఖ హెచ్చరించింది.

  • Published Jul 24, 2024 | 5:31 PMUpdated Jul 24, 2024 | 5:31 PM
HYDలో మళ్లీ మొదలైన ముసురు వర్షం.. మరో మూడు రోజుల పాటు

ప్రస్తుతం వర్షకాలం కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఈ క్రమంలోనే.. అటు ఏపీతో పాటు తెలంగాణలో కూడా గత కొన్ని రోజులుగా ఎక్కడ చూసిన విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పైగా పలు ప్రాంతాల్లో అయితే  మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం మొన్న మొన్నటి వరకు ఎడతెరిపి లేకుండా ఈదురు గాలులతో వాన కురిసిన విషయం తెలిసిందే. కానీ గత రెండు రోజులుగా అక్కడ అక్కడ చిన్నపాటి జల్లులు తప్ప పెద్దగా వాన కురిసే దాఖలు లేవు. కానీ, తాజాగా నగరంలోని మళ్లీ  ముసురు వాన మొదలైంది. కాగా, నేటి మధ్యహ్నం నుంచి నగరంలో ఏకదాటిగా చిరు జల్లులు పడుతున్నాయి.

ఇకపోతే తెలంగాణలో మరో మూడు రోజులు పాటు ఈ వర్షాలు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని తాజాగా  హైదరాబాద్ వాతవరణ శాఖ హెచ్చరించింది. ఎందుకంటే.. ఉత్తర ఛత్తీస్‌గఢ్‌ వద్ద అల్పపీడనం కేంద్రీకృతమైందని.. ప్రస్తుతం ఇది తూర్పు మధ్యప్రదేశ్‌ మీదుగా కొనసాగుతుందని తెలిపింది. ఇక ఈ అల్పపీడనం కారణంగానే రాష్ట్రంలోని వర్షాలు కురుస్తున్నాయని వాతవరణ శాఖ తెలిపింది.  ఈ క్రమంలోనే.. నేటి తెల్లవారుజాము నుంచే నగరంలో పలు ప్రాంతాల్లో  చిరు జల్లులతో ముసురు మొదలవ్వగా, మరి కొన్ని ప్రాంతాల్లో మధ్యహ్నం నుంచి ముసురు వాన పడుతుంది.

ఇక నేడు రాష్ట్రంలో ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, హన్మకొండ, ములుగు, కామారెడ్డి, సంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలపడమే కాక ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మరోవైపు రంగారెడ్డి, నల్గొండ, వికారాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. ఇకపోతే బుధవారం ఉత్తర, మధ్య తెలంగాణలో మోస్తరు – భారీ వర్షాలు, దక్షిణ దక్షిణ తెలంగాణలో మధ్యాహ్నం – తేలికపాటి – మోస్తరు వర్షాలు కురిశాయి. హైదరాబాద్ నగరంలో ఈ రోజు సాయంత్రం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మరి, రాష్ట్రంలో మరో మూడు రోజులు వర్షాలు ఇలానే కొనసాగడంపై మీ అభిప్రాయలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి