Dharani
Railway Minister-Hyderabad Ring Rail Project: హైదరాబాద్ నగర వాసులకు కేంద్ర రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. ఆ వివరాలు..
Railway Minister-Hyderabad Ring Rail Project: హైదరాబాద్ నగర వాసులకు కేంద్ర రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. ఆ వివరాలు..
Dharani
హైదరాబాద్ నగరం వేగంగా అభివృద్ధి చెందుతూ.. విశ్వనగరంగా రూపు మార్చుకుంటుంది. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన కంపెనీలు.. హైదరాబాద్‌లో తమ శాఖలను ప్రారంభించాయి. ఇక దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలు విద్య, ఉపాధి కోసం.. భాగ్యనగరానికి తరలి వస్తుంటారు. ప్రతి ఒక్కరిని అక్కున చేర్చుకుని.. ఆదరిస్తుంటుంది భాగ్యనగరం. రానున్న కాలంలో నగరానికి వలస వచ్చే జనాలతో పాటు కంపెనీలు కూడా భారీగానే ఉండనున్నాయి అని భావిస్తోన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భాగ్యనగరం అభివృద్ధిపై దృష్టి సారించారు. హైదరాబాద్ నగరం అభివృద్ధి కొరకు బడ్జెట్‌లో కేటాయింపులు, కొత్త కొత్త ప్రాజెక్ట్‌లు అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర రైల్వే శాఖ.. హైదరాబాద్‌కు భారీ శుభవార్త చెప్పింది. నగరం రూపు రేఖలు మార్చి.. మరింత అభివృద్ధి చేందేలా.. సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. ఆ వివరాలు..
తాజాగా తెలంగాణకు కేంద్ర రైల్వే శాఖ భారీ శుభవార్త చెప్పింది. రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్ చుట్టూ రింగ్ రైలు ప్రాజెక్ట్ నిర్మించేందుకు కసరత్తు జరగుతుందని తెలిపింది. ప్రస్తుతం హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్న ఔటర్ రింగు రోడ్డుకు 40 కిమీల దూరం నుంచి రీజనల్ రింగు రోడ్డు నిర్మిస్తుండగా.. దానికి సమాంతరంగా రింగ్ రైలు ప్రాజెక్ట్‌ను నిర్మించేందుకు కేంద్ర రైల్వే శాఖ ప్రణాళికలు రచిస్తోంది. ఇక తాజాగా ఈ ప్రాజెక్ట్‌పై కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ముఖ్యమైన ప్రకటన చేశారు. రింగురైలు ప్రాజెక్ట్‌పై ప్రస్తుతం కసరత్తు చేస్తున్నామని.. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని అన్నారు.
రెండు రోజుల క్రితం అనగా జూలై 23న కేంద్రం బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా.. రైల్వే బడ్జెట్ కేటాయింపుల వివరాలను.. ఆ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఆయన వెల్లడించిన దాని ప్రకారం కేంద్ర ప్రభుత్వం.. రైల్వే బడ్జెట్‌లో భాగంగా తెలంగాణకు మొత్తంగా రూ.5,336 కోట్లు కేటాయించినట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తెలంగాణలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రూ.32,946 కోట్ల పనులు జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు రైల్ నెట్‌వర్క్ విద్యుదీకరణ 100 శాతం పూర్తయిందని చెప్పుఒకచ్చారు.
అలానే హైదరాబాద్ నగరంలో నడుస్తోన్న ఎంఎంటీఎస్ ప్రాజెక్ట్.. ఇప్పుడు లాభదాయకంగా నడుస్తోందని.. దీన్ని విస్తరించాల్సిన అవసరం ఉందని అశ్వినీ వైష్ణవ్ చెప్పుకొచ్చారు. అయితే వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంచుకునే విషయంలో కొంత సమస్య ఉందని.. త్వరలోనే దీనిపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని తెలిపారు. అలానే కాజీపేట వ్యాగన్ ఫ్యాక్టరీ పనులు వేగంగా కొనసాగుతున్నట్లు మంత్రి చెప్పుకొచ్చారు. అంతేకాక డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ నిర్మాణంపై అధ్యాయనం చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇక హైదరాబాద్‌కు రింగ్ రైల్ ప్రాజెక్ట్ కార్యరూపం దాలిస్తే.. ఊహించనంత అభివృద్ధి జరుగుతుందని.. భూముల ధరలు మరింత పెరుగతాయని అంటున్నారు.