iDreamPost

ట్రాక్టర్ పై విన్యాసాలు! ఏకంగా ఆనంద్ మహీంద్ర ట్వీట్!

దేశంలో ప్రముఖ వ్యాపార దిగ్గజాల్లో ఒకరైన ఆనంద్ మహేంద్ర గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బిజినెస్ పరంగానే కాకుండా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ.. పలు అంశాలపై స్పందిస్తూ ఉంటారు. తాజాగా..

దేశంలో ప్రముఖ వ్యాపార దిగ్గజాల్లో ఒకరైన ఆనంద్ మహేంద్ర గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బిజినెస్ పరంగానే కాకుండా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ.. పలు అంశాలపై స్పందిస్తూ ఉంటారు. తాజాగా..

ట్రాక్టర్ పై విన్యాసాలు! ఏకంగా ఆనంద్ మహీంద్ర ట్వీట్!

ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. భారతదేశంలో టాప్ బిలియనీర్లలో ఆయన ఒకరు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఉండే ప్రతి ఒక్కరికి ఈయన పేరు సుపరిచితమే. కేవలం మహీంద్ర గ్రూప్ ఛైర్మన్ గానే కాకుండా.. సామాజిక మాధ్యమాల్లో ఆయనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇక ఆనంద్ మహీంద్ర వృత్తి పరంగా ఎంత బిజిగా ఉన్నా సరే.. సోషల్ మీడియాలో నిత్యం చాలా యాక్టివ్ గా ఉంటారు. తరుచుగా ఆయన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను సోషల్ మీడియాలో తన ఫాలోయర్లతో పంచుకుంటారు. ఈయన సామాజిక మాధ్యమాల్లో వింత విషయాలే కాదు, సామాజిక స్పృ‌‌హ పెంపొదించే విషయాలను, ప్రజలలో చైతన్యం కలిగించే సంఘటనలను కూడా షేర్ చేస్తుంటారు.

ఆయనకు ఆసక్తి కలిగించే ఏ విషయాలైనా తన x(ట్విట్టర్) ఖాతా వేదికగా పంచుకోవడంలో ఆనంద్ మహీంద్ర ఎప్పుడు ముందు వరుసలో ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఆనంద్ మహీంద్ర ఓ ఇంట్రస్టింగ్ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో ట్వీట్ చేశారు. ఆ వీడియోతో పాటు ఆసక్తి కరమైన క్యాప్షన్ ను కూడా జోడించారు. ఓ వ్యక్తి ట్రాక్టర్ నడుపుతున్నట్లు ఆ వీడియోలో ఉంది. అందులో విచిత్రం ఏమిటంటే.. ట్రాక్టర్ లో సీటు సాధారణ సీటులా కాకుండా చాలా ఎత్తులో ఉంది. అయితే ట్రాక్టర్ నడిపే డ్రైవర్.. ట్రాక్టర్ నుంచి సూమారు 7 అడుగుల ఎత్తులో కూర్చొని డ్రైవింగ్ చేస్తున్నాడు. ఆ ట్రాక్టర్ లో సీటు అడ్జెస్ట్ చేసుకునే విధంగా ఉంది. దీనికి సంబంధించిన వీడియోను ఒకరు ఇన్ స్ట్రాగ్రామ్ ఖాతాలో ఫోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

ఈ వీడియో కాస్త ఆనంద్ మహీంద్ర కంటపడింది. ఇంకేముంది వెంటనే ఆయన ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోతో పాటు.. ఇలా స్పందించారు. “నాకు చాలా ఆసక్తి కరంగా ఉంది. కానీ నాకున్న ఒక సందేహం ఏమిటి అంటే.. ఇలా ఎందుకు..?” అంటూ రాసుకొచ్చారు. అసలు సీటును అంత ఎత్తులో ఎందుకు ఏర్పాటు చేశారన్న అర్థం వచ్చేలా ఆనంద్ ట్వీట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాల ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. మరి.. అతను ఆ ట్రాక్టర్ సీటుని అంత ఎత్తుకి ఎందుకు పెంచినట్టు? ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి