iDreamPost
android-app
ios-app

వీడియో: ఇనయా ప్రియుడి మంచి మనసు.. ఓ ప్రాణం కాపాడాడు!

  • Published Jul 20, 2024 | 3:55 PM Updated Updated Jul 20, 2024 | 3:55 PM

Inaya Sultana And Her Boyfriend Gautham Saved A Life: బిగ్ బాస్ ఫేమ్ ఇనయా సుల్తాన్- ఆమె ప్రియుడు ఇద్దరూ కలిసి ఒక నిండు ప్రాణాన్ని కాపాడారు. అందుకు సంబంధించిన వీడియో షేర్ చేసి వివరాలు వెల్లడించారు.

Inaya Sultana And Her Boyfriend Gautham Saved A Life: బిగ్ బాస్ ఫేమ్ ఇనయా సుల్తాన్- ఆమె ప్రియుడు ఇద్దరూ కలిసి ఒక నిండు ప్రాణాన్ని కాపాడారు. అందుకు సంబంధించిన వీడియో షేర్ చేసి వివరాలు వెల్లడించారు.

  • Published Jul 20, 2024 | 3:55 PMUpdated Jul 20, 2024 | 3:55 PM
వీడియో: ఇనయా ప్రియుడి మంచి మనసు.. ఓ ప్రాణం కాపాడాడు!

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో అయితే రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. అవసరమైతేనే బయటకి రావాలి అంటూ పోలీసులు, వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అయితే వర్షాకాలం రాగానే తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో వాహనాలు నెమ్మదిగా నడపడం కూడా ఒకటి. ఏమాత్రం అశ్రద్ధ చేసినా ప్రాణాలు పోయే పరిస్థితి రావచ్చు. ఇదే విషయంపై బిగ్ బాస్ ఫేమ్ ఇనయా సుల్తానా- ఆమె ప్రియుడు ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ని ఉదాహరణగా చెప్పి జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఆమె ప్రియుడు గౌతమ్ కొప్పిశెట్టి ఒక నిండు ప్రాణాన్ని నిలబెట్టాడు.

ఇనయా సుల్తానా- ఆమె ప్రియుడు గౌతమ్ కొప్పిశెట్టి ఇటీవలే వారి రిలేషన్ ను సోషల్ మీడియా వేదికగా రివీల్ చేశారు. అప్పటి నుంచి వాళ్లు కలిసుండే పిక్స్, వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. అయితే తాజాగా ఇనయా ఒక స్టోరీ పోస్ట్ చేసింది. గౌతమ్ నువ్వు ఒక ప్రాణాన్ని కాపాడావు అంటూ క్యాప్షన్ పెట్టింది. అయితే ఏం జరిగిందో తెలియక్ వారి ఫ్యాన్స్ కామెంట్స్ పెట్టడం చేస్తున్నారు. అందుకని అసలు ఏం జరిగిందో ఈ ఇద్దరు వివరిస్తూ ఒక వీడియో చేశారు. ఆ వీడియోలో అసలు ఏం జరిగిందో చెప్పుకొచ్చారు. వాళ్లు రోడ్డు మీద వెళ్తుండగా ఒక యాక్సిడెంట్ చూశారు. ఒక వ్యక్తి రోడ్డు మీద పడిపోయాడు. చాలా రక్తం కూడా పోయింది అంట. అది గమనించిన గౌతమ్ కొప్పిశెట్టి వెంటనే తన తల్లి చున్నీ తీసుకుని అతని బ్లడ్ ఆగిపోయేలా చేశాడు.

అక్కడే ఉన్న ఇనయా సుల్తానా అంబులెన్స్ కి కాల్ చేయడం.. ట్రాఫిక్ క్లియర్ చేయడం చేసింది. అతడిని కంటిన్యూగా మాట్లాడిస్తూ.. అతను స్పృహ కోల్పోకుండా చూసుకున్నారు. అతని ఫోన్ పాస్ వర్డ్ తెలుసుకుని వాళ్ల వాళ్లకి కూడా ఇన్ఫామ్ చేశారు. ఆ తర్వాత అతడిని ఆస్పత్రిలో చేర్పించారు. వాళ్ల వాళ్లతో టచ్ లో ఉంటూ అతని పరిస్థితి గురించి తెలుసుకుంటున్నాం అని వెల్లడించారు. అయితే అతని పరిస్థితి కాస్త సీరియస్ గా ఉందని తెలిపారు. ఈ విషయం చెబుతూనే అందరికీ రిక్వెస్ట్ చేశారు. ఎవరూ వర్షంలో స్పీడుగా వెళ్లకండి.. కాస్త నిధానంగా వెళ్లండి అంటూ చెప్పుకొచ్చారు. మన తప్పు లేకపోయినా టైర్స్ స్లిప్ అయ్యి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా, నిధానంగా వెళ్లాలని సూచించారు. ఆ వ్యక్తి ప్రాణాలతో తిరిగిరావాలని తాము ప్రార్థిస్తామని.. అందరూ అతని కోసం ప్రే చేయాలి అంటూ కోరారు. మరి.. ఇనయా సుల్తానా- ఆమె ప్రియుడు గౌతమ్ కొప్పిశెట్టి చేసిన ఈ మంచిపనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Doulath sulthana (@inayasulthanaofficial)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss