iDreamPost

విజయ్ దేవరకొండ మంచి మనసు! బాడీ గార్డ్ పెళ్లికి స్వీట్ సర్ప్రైజ్!

  • Published Apr 23, 2024 | 7:34 PMUpdated Apr 23, 2024 | 7:41 PM

టాలీవుడ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం వ‌రుస ఫ్లాప్‌ల‌తో స‌త‌మ‌వుతున్న విష‌యం తెలిసిందే. ఇటీవలే ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అది ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇదిలా ఉంటే.. తాజాగా విజయ్ దేవరకొండ తన చేసిన ఓ పని పై మరోసారి నెట్టింట ఆయనపై చర్చ జరుగుతుంది. ఇంతకి ఏం జరిగిదంటే..

టాలీవుడ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం వ‌రుస ఫ్లాప్‌ల‌తో స‌త‌మ‌వుతున్న విష‌యం తెలిసిందే. ఇటీవలే ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అది ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇదిలా ఉంటే.. తాజాగా విజయ్ దేవరకొండ తన చేసిన ఓ పని పై మరోసారి నెట్టింట ఆయనపై చర్చ జరుగుతుంది. ఇంతకి ఏం జరిగిదంటే..

  • Published Apr 23, 2024 | 7:34 PMUpdated Apr 23, 2024 | 7:41 PM
విజయ్ దేవరకొండ మంచి మనసు! బాడీ గార్డ్ పెళ్లికి  స్వీట్ సర్ప్రైజ్!

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ.. యూత్ లో ఈ పేరుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవలే ఈ హీరో ఫ్యామిలీ స్టార్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కాగా, ఈ సినిమాను గీత గోవిందం డైరెక్టర్ పరుశురామ్‌ తెరకెక్కించారు. ఇందులో హీరోయిన్ గా మృణాల్ ఠాకుర్ నటించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ ఈ సినిమను ఈనెల అనగా ఏప్రిల్ 5వ తేదీన థియేటర్లలో విడుదల చేశారు. కానీ, ఆశించిన స్థాయిలో ఫ్యామిలీ స్టార్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.దీంతో ఫ్యామీలీ స్టార్ సినిమా విజయకు నిరాశనే మిగిల్చింది అని చెప్పవచ్చు. ఇక సినిమాల ఏ రకంగా ఉన్న..వ్యక్తిగతంగా మాత్రం ఈ హరోకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. విజయ్ కూడా తన సినిమా ప్రమోషన్స్, ఈవెంట్ లోనైనా తన అభిమానులకు నిరుత్సాహ పరచకుండా వారికి దగ్గరగా ఉంటూ.. వారితో మాట్లాడుతూ, ఫోటోస్ దిగుతూ ఉంటాడు. ఈ క్రమంలోనే తాజాగా విజయ్ చేసిన పనికి మరోసారి ఆయనపై నెట్టింట చర్చ జరుగుతుంది. ఇంతకి  ఏం జరిగిదంటే..

ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి విజయ్ చేసే మంచి పనులు గురించి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా.. కరోనా సమయంలో మిడిల్ క్లాస్ ఫండ్ ఇవ్వడం మొదలు ప్రతిఏటా పుట్టినరోజుకు కొన్ని ప్రత్యేకమైన గిఫ్టులను పంచుతూ తన గొప్ప మనసును చాటుతుంటాడు. ఈ క్రమంలోనే తాజాగా ఈ రౌడి హీరో త‌న ప‌ర్స‌న‌ల్ బాడీ గార్డ్ ర‌వి పెళ్లికి హాజరై  అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అంతేకాకుండా. నూతన వధువరులను ఆశీర్వదించాడు. అంతేకాకుండా..  హైదరాబాద్‌లో జరిగిన ఈ పెళ్లికి బ్లూ కుర్తాలో సంప్రదాయ లుక్‌లో వ‌చ్చిన విజ‌య్ అందరి దృష్టిని ఆకర్షించాడు.  ఇక ఈ పెళ్లికి విజ‌య్‌తో పాటు అతని ఫ్యామిలీ కూడా వ‌చ్చి సందడి చేసింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోను చూసిన ఆయన అభిమానులు మరోసారి విజయ్ పై ప్రశంసలతో ముంచేత్తున్నారు.

ఇక వరుస ఫ్లాప్ లతో సతమవుతున్న ఈ హీరోకు సరైన హిట్ పడి చాలా కాలమే అయింది. ఇటీవలే వచ్చిన ఖుషి, అలాగే తాజాగా విడుదలైన ఫ్యామిలీ స్టార్ చిత్రాలు కూడా ప్రేక్షకుల అంచనాల‌ను అందుకోలేకపోయాయి. కాగా, ప్రస్తుతం విజయ్ ఆశలన్నీ గౌత‌మ్ తిన్న‌నూరి సినిమాపైనే ఉన్నాయి. ఈ చిత్రం త్వ‌ర‌లో సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. ఇదిలా ఉంటే.. వర్క్ లైఫ్ పరంగా ఫుల్ బిజీగా ఉండే ఈ హరో ఇలా తన పర్సనల్ బాడీగార్డ్ పెళ్లికి ఫ్యామీలితో వెళ్లి హాజరవ్వడం పై నెట్టింట అందరూ ఈయనని ప్రశంసిస్తున్నారు. మరి, పర్సనల్ బాడీగార్డ్ పెళ్లికి వెళ్లి అందర్నీ ఆశ్చర్యపరిచిన విజయ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి