iDreamPost

ఫొటో స్టిల్స్ కోసం వెళ్లి… ప్రాణాలు పొగొట్టుకున్న యువకుడు!

ఫొటో స్టిల్స్ కోసం వెళ్లి… ప్రాణాలు పొగొట్టుకున్న యువకుడు!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వినియోగం బాగా పెరిగిపోయింది. ప్రతి ఒక్కరు  వివిధ సామాజిక మాధ్యమాల్లో ఫుల్ బిజి బిజిగా గడిపేస్తున్నారు. ముఖ్యంగా యువత వీడియోలు, ఫోటోలు తీసి.. సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటుంది. అలానే కొందరు యువత లైక్స్, కామెంట్స్ కోసం సాహసాలు చేస్తున్నారు. మరికొందరు ప్రత్యేక గుర్తింపు కోసం వెరైటీ వీడియోలు చేయలనే ప్రయత్నంలో  ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల కాలంలో చాలా మంది యువకులు అలానే మృత్యు ఒడికి చేరారు. తాజాగా ఫోటో స్టిల్స్ కోసం ప్రయత్నించి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన తిరుతి జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే…

కర్ణాటక రాష్ట్రం మంగళూరుకు చెందిన సుమంత్ స్నేహితులతో కలిసి తిరుపతి వచ్చారు. అక్కడ పలు ప్రాంతాలు సందర్శించిన అనంతరం తలకోన వాటర్ ఫాల్స్ వద్దకు వెళ్లారు. సుమంత్ కి ఫోటోలు తిగడం అంటే చాలా సరద. ముఖ్యంగా కొత్తప్రదేశాలకు వెళ్తే.. ఫోటోలు తప్పకుండా దిగుతాడు. అలానే తనకోనకు వెళ్లిన సుమంత్ ఫొటో స్టిల్స్ చేస్తూ మడుగులోకి దూకాడు. అయితే మడుగులోని రాళ్ల మధ్య సుమంత్ ఇరుక్కు పోయాడు. అతడు బయటకి వస్తాడేమోనని స్నేహితులు చాలా సమయం పాటు ఎదురు చూశారు. ఎంతకీ బయటకు రాలేదు. ఆ నీటి మడుగులో ఊపిరాడక సుమంత్ ప్రాణాలు వదిలాడు. తమ కళ్ల ముందే స్నేహితుడి ప్రాణం పోయిందని మృతుడి ఫ్రెండ్స్ కన్నీరుమున్నీరు అయ్యారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు..గజ ఈతగాళ్ల సాయంతో శవాన్ని బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తిరుపతిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఫోటో స్టిల్స్ కోసం, వీడియోల కోసం ఇలాంటి  ప్రయత్నాలు ఎవరూ కూడా చేయవద్దని పోలీసులు తెలిపారు. మడుగులో స్నానం చేసేటప్పుడు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఇక సుమంత్ మృతితో అతడి  కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరి.. ఇలా వీడియోలు, ఫోటోలు దిగాలనే ఆసక్తితో సాహసాలు చేసి ప్రాణాలు కోల్పోతున్న యువత విషయంలో మీ సలహాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి