iDreamPost
android-app
ios-app

వీడియో: వంతెనపై భారీగా మంటలు.. ఆయిల్ ట్యాంకర్ బోల్తాపడి..!

Fire Accident: ఇటీవల రోడ్డు ప్రమాదాల కారణంగా అగ్నిప్రమాదాలు జరుగుతున్న ఘటనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇటీవలే ఆయిల్ ట్యాంకర్ బోల్తాపడిన ఘటనలో 40 మంది సజీవ దహనం అయ్యారు. తాజాగా వంతెనపై మరో పెట్రోల్ ట్యాంకర్ భారీ అగ్నిప్రమాదానికి గురైంది.

Fire Accident: ఇటీవల రోడ్డు ప్రమాదాల కారణంగా అగ్నిప్రమాదాలు జరుగుతున్న ఘటనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇటీవలే ఆయిల్ ట్యాంకర్ బోల్తాపడిన ఘటనలో 40 మంది సజీవ దహనం అయ్యారు. తాజాగా వంతెనపై మరో పెట్రోల్ ట్యాంకర్ భారీ అగ్నిప్రమాదానికి గురైంది.

వీడియో: వంతెనపై భారీగా మంటలు.. ఆయిల్ ట్యాంకర్ బోల్తాపడి..!

నిత్యం ఏదో ఒక ప్రాంతంలో అగ్నిప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా షార్ట్ సర్క్యూట్, రసాయానాల పేలుడు, ఇంధనాల ట్యాంకర్ల పేలుడు వంటి కారణాలతో ఈ ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. అగ్నిప్రమాదాల కారణంగా ఎందరో అమాయకులు సజీవ దహనం అవుతుంటారు. అంతేకాక మరెందరో కాలిన గాయలతో జీవితాన్ని నరకంగా అనుభవిస్తారు. మూడు రోజుల క్రితమే ఓ ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడి పేలిపోయిన ఘటనలో 40 మంది చనిపోయారు. తాజాగా పంజాబ్ లో అదే తరహా ఘటన చోటుచేసుకుంది. వంతెనపై ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడి.. అగ్నిప్రమాదానికి గురైంది. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం..

పంజాబ్ రాష్ట్రంలోని లుథియానా జిల్లాలో ఓ భారీ  అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం మధ్యాహ్నం సమయంలో ఖన్న అనే ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. లుథియానలోని ఖన్నా ప్రాంతంలోని వంతెనపై  ఓ ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడింది. బ్రిడ్జిపై వెళ్తుండగా.. డివైడర్ ను ఢీ కొట్టిన ఆయిల్ ట్యాంకర్ అనంతరం బోల్తా పడిపోయింది. దీంతో అందులోని పెట్రోల్ లీక్ కావడం క్షణాల్లోనే భారీ మంటలు ఏర్పడ్డాయి. దీంతో అందరు చూస్తుండగానే వంతెనపై భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. పెట్రోల్ ట్యాంకర్ కావడంతో బ్రిడ్జిపై పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతమంత దట్టమైన పొగ కమ్ముకున్ని భయంకరమైన వాతావరణం ఏర్పడింది.

పెద్ద బాంబు బ్లాస్ట్ జరిగితే ఏ విధంగా ఉంటుందో అదే తరహా పరిస్థితి ఆ వంతెన వద్ద కనిపించింది. ఇక స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఐదు అగ్నిమాపక శకటాలు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. భారీ ఎత్తున ఎగసి పడుతున్న మంటలను అదుపు చేసేందుకు  తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అందేకాక పోలీసులు కూడా ఘటన స్థలానికి చేరుకుని పరిసరాల్లో ఉన్న వాహనానాలు, దుకాణాలను ఖాళీ చేయించారు. ఇక వంతెనపై ట్యాంకర్ పేలిపోవడంతో ఆ ప్రాంతలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

అయితే ప్రమాదానికి గురైన ట్యాంకర్ లోని డ్రైవర్, క్లీనర్ లకి సంబంధించిన సమాచారం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  ఇటీవలే తెలంగాణ రాష్ట్రంలో కూడా నాంపల్లి ప్రాంతంలో ఓ అగ్నిప్రమాదం జరిగి..9 మంది మరణించారు. అలానే ఇలా ఆయిల్ ట్యాంకర్లు పేలిపోయి.. భారీగా ప్రాణ నష్టం సంభవిస్తుంది.  మరి.. ఇలాంటి రోడ్డు ప్రమాదాలు, అగ్నిప్రమాదాల ఘటనల తగ్గించేందుకు పరిష్కారం ఏమిటి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి