iDreamPost

బిడ్డను చూసుకోవడం చేతకాదా అంటూ ట్రోల్స్.. ఆ తల్లి ఆత్మహత్య!

  • Published May 20, 2024 | 12:28 PMUpdated May 20, 2024 | 12:59 PM

Chennai Crime News: ఈ మద్య కాలంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలపై నెటిజన్లు చేస్తున్న కామెంట్స్ కొన్ని పాజిటీవ్ గా ఉంటే.. కొన్ని దారుణంగా ఉంటున్నాయి. నెటిజన్లు చేసిన కామెంట్స్ ఓ నిండు ప్రాణాలు బలితీసుకుంది.

Chennai Crime News: ఈ మద్య కాలంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలపై నెటిజన్లు చేస్తున్న కామెంట్స్ కొన్ని పాజిటీవ్ గా ఉంటే.. కొన్ని దారుణంగా ఉంటున్నాయి. నెటిజన్లు చేసిన కామెంట్స్ ఓ నిండు ప్రాణాలు బలితీసుకుంది.

  • Published May 20, 2024 | 12:28 PMUpdated May 20, 2024 | 12:59 PM
బిడ్డను చూసుకోవడం చేతకాదా అంటూ ట్రోల్స్.. ఆ తల్లి ఆత్మహత్య!

సోషల్ మీడియాలో వస్తున్న వీడియోలో క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. అలా ఓ వీడియో నిండు జీవితాన్ని ఛిదిమేసింది. మూడు వారాల క్రితం ప్రమాదవశాత్తు తల్లి చేతుల్లో నుంచి జారిపడిన చిన్నారి పాపకు సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అయ్యింది. బాబుని క్షేమంగానే కాపాడినప్పటికీ.. కొంతమంది చేసిన కామెంట్స్, ట్రోల్స్ దారుణంగా ఉన్నాయి. బిడ్డను కాపాడుకోలేని తల్లి ఎందుకు పిల్లలు కనాలి అంటూ ఎన్నో కామెంట్స్ రావడంతో ఆ తల్లి భరించలేకపోయింది. నవమాసాలు మోసి కనీ పెంచిన బిడ్డను ప్రేమతోనే చూసుకుంటాను.. నాపై ఇలాంటి నిందలు ఎలా వేస్తున్నారు అంటూ తీవ్ర మనస్థాపానికి గురై తీవ్ర నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే..

చెన్నైలో ఏప్రిల్ 28 న అవడిలోని ఓ అపార్ట్ మెంట్ సన్ షేడ్ పై ఎనిమిది నెలల పసిబిడ్డ వేలాడుతుండగా.. స్థానికులు స్పందించి బెడ్ షీట్లు వేసి..అక్కడ కిటికీ లో నుంచి బయకు వచ్చి చిన్నారిని కాపాడారు. ఆ సమయంలో ఎంతో ఉత్కంఠ కొనసాగింది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ వీడియో చూసిన వీక్షకులు కూడా బాబుని కాపాడే వరకు టెన్షన్ పడ్డారు. ఈ వీడియో అందరి హృదయాలను కదిలించింది. ఈ వీడియో పై నెటిజన్లు బీభత్సంగా కామెంట్స్ చేశారు. చిన్నారి తల్లిపై విపరీతమైన ట్రోలింగ్స్ చేశారు. అంతేకాదు ఈ వీడియో వైరల్ కావడంతో చుట్టుపక్కల వాళ్లు, బంధువులు సైతం బాబు తల్లిపై కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు.

ఆ బిడ్డ తల్లి.. రమ్య(33), సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా జాబ్ చేస్తుంది. ఎప్పుడైతే సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ అయ్యిందో ఆ తల్లిపై ప్రతి ఒక్కరూ దారుణంగా కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు. ‘బిడ్డ విషయంలో ఇంత నిర్లక్ష్యంగా ఉన్నదానివి ఎందుకు జన్మనివ్వాలి’, ‘ నువ్వు అసలు కన్న తల్లివేనా? బిడ్డను చూసుకోవడం కూడా చేతకాదా?’ అంటూ ఎన్నో రకాలుగా ట్రోల్స్ చేశారు. దీంతో ఆ తల్లి తీవ్రమైన డిప్రషన్‌లోకి వెళ్లింది.. ఈ క్రమంలోనే ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ ఘటన అనంతరం తన బిడ్డతో కలిసి కారమడైలోని తల్లిదండ్రుల ఇంటికి చేరుకుంది. ఆదివారం ఇంట్లో ఆపస్మారక స్థితిలో రమ్యను చూసిన తల్లిదండ్రులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారుర. కాగా, పాప తల్లి మృతి పట్ల నటుడు ప్రశాంత్ రంగస్వామి, సింగర్ చిన్మయి శ్రీపాద తీవ్రంగా విమర్శించారు. ఏ తల్లి తన బిడ్డను నిర్లక్ష్యంగా చూడదు.. మీ ట్రోల్స్ వల్ల ఓ తల్లి ప్రాణాలు పోయాయి అంటూ విమర్శించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి