iDreamPost
android-app
ios-app

అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకున్న జవాన్! పాపం ఆ తల్లికి నరకం!

కష్టపడి ఆర్మీ ఉద్యోగాన్ని సంపాదించాడు. బెంగళూరులో శిక్షణ కూడా తీసుకున్నాడు. ఉద్యోగానికి సంబంధించిన పోస్టింగ్ ఆర్డర్ కూడా వచ్చింది. హుర్రె అనుకున్న సమయంలో ఊరికి వచ్చాడు. తాను గాఢంగా ప్రేమించిన అమ్మాయిని చూసి..

కష్టపడి ఆర్మీ ఉద్యోగాన్ని సంపాదించాడు. బెంగళూరులో శిక్షణ కూడా తీసుకున్నాడు. ఉద్యోగానికి సంబంధించిన పోస్టింగ్ ఆర్డర్ కూడా వచ్చింది. హుర్రె అనుకున్న సమయంలో ఊరికి వచ్చాడు. తాను గాఢంగా ప్రేమించిన అమ్మాయిని చూసి..

అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకున్న జవాన్! పాపం ఆ తల్లికి నరకం!

ఆర్మీ ఉద్యోగం అంత సులువుగా రాదు. దేశానికి సేవ చేయాలన్న తపనతో పాటు ఎంతో కష్టపడితే తప్ప. మానసికంగా, శారీరకంగా కూడా దృఢంగా ఉండాల్సిందే. అలాంటి వారినే వరిస్తుంటోంది జవాన్ కొలువు. పుట్టి పెరిగిన ఊరికి..కుటుంబానికి, ముఖ్యంగా తల్లిదండ్రులకు దూరంగా ఉండాల్సి వస్తుందని తెలిసినా కూడా సైన్యంలో చేరి.. దేశానికి సేవ చేయాలనుకుంటూ ఉంటారు. ఈ ఉద్యోగంలో ఎప్పుడు చస్తామో తెలియదు.. అయినప్పటికీ కూడా యుద్దం చేస్తూ జవాన్‌గా మరణిస్తే.. ఆ గౌరవమే వేరని భావిస్తుంటారు. చింటూ కూడా ఆర్మీ జవాన్ కావాలని కలులు కన్నాడు. ఆ కలలను సాకారం చేసుకున్నాడు. మరికొన్ని రోజుల్లో ఉద్యోగంలో జాయిన్ కావాల్సి ఉంది. అంతలో ప్రేమ కాటుకు బలయ్యాడు.

ప్రేమించిన యువతి కాదందని, తల్లిదండ్రులకు పుత్రశోకాన్ని మిగిల్చాడో జవాన్. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. దోమ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన చింటూ అనే యువకుడు.. 2023లో ఇండియన్ ఆర్మీకి సెలక్ట్ అయ్యాడు. ఇటీవలె బెంగళూరులో శిక్షణ పూర్తి చేసుకున్నాడు. అతడికి గుజరాత్‌లో పోస్టింగ్ ఇచ్చారు. మరికొన్ని రోజుల్లో ఉద్యోగంలో చేరాల్సి ఉండగా.. సెలవులపై సొంతూరికి వచ్చాడు. అక్కడ తాను ఎప్పటి నుండో ప్రేమిస్తున్న అమ్మాయి ముందు తన లవ్ ప్రపోజల్ ఉంచాడు. ఉద్యోగానికి వెళితే.. తిరిగి ఎప్పటి వస్తానో అన్న ఉద్దేశంతో తన ప్రేమను వ్యక్త పరిచాడు. అయితే ఆ అమ్మాయి అతడి లవ్ యాక్సెప్ట్ చేయలేదు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు.

తన వ్యవసాయం పొలంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు చూసి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులకు సమాచారం చేరవేశారు. చేతికొచ్చిన కొడుకు బలవన్మరణానికి పాల్పడటంపై కన్నీరు మున్నీరు అయ్యారు పేరెంట్స్. ఓ అమ్మాయి కోసం తల్లిదండ్రులకు వేదన మిగిల్చాడు కొడుకు చింటు. జవాన్‌గా తిరిగి వచ్చాడని అనుకుంటే.. ఇప్పుడు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడని తెలిసి తట్టుకోలేకపోతున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆర్మీకి ఎంపికైనప్పుడు ఎంతో సంతోషించిన స్నేహితులు సైతం.. అతడ్ని ఇలా చూసి కంటతడి పెట్టుకుంటున్నారు. ప్రియురాలు ప్రేమను తిరస్కరించిందని జవాన్ ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా విషాదం నెలకొంది.