iDreamPost
android-app
ios-app

హోటల్‌లో ఫుడ్ బాగాలేదా.. ఈ నంబర్‌కు డయల్ చేసి కంప్లైంట్ ఇవ్వొచ్చు!

హైదరాబాద్ నగరంలో వరుసగా హోటల్స్ అండ్ రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. హోటల్స్, రెస్టారెంట్లలో నిర్వాకం వచ్చింది. ఎప్పుడైనా మీరు వెళ్లిన హోటల్స్ లో ఫుడ్ బాగోలేదు అంటే చేస్తారు...

హైదరాబాద్ నగరంలో వరుసగా హోటల్స్ అండ్ రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. హోటల్స్, రెస్టారెంట్లలో నిర్వాకం వచ్చింది. ఎప్పుడైనా మీరు వెళ్లిన హోటల్స్ లో ఫుడ్ బాగోలేదు అంటే చేస్తారు...

హోటల్‌లో ఫుడ్ బాగాలేదా.. ఈ నంబర్‌కు డయల్ చేసి కంప్లైంట్ ఇవ్వొచ్చు!

హైదరాబాద్ మహా నగరంలో ఎక్కడ చూసినా హోటల్స్, రెస్టారెంట్లు దర్శనమిస్తూనే ఉంటాయి. ఆ మూల నుండి ఈ మూల వరకు ఫుడ్ సెంటర్స్ లేని ప్రాంతం లేదంటే అతిశయోక్తి కాదు. దీంతో జనాలు సైతం ఇంట్లో వండుకోవడం మానేసి..ఇక్కడ వెళ్లి తినడమో లేక.. ఆర్డర్స్ పెట్టుకోవడమో చేస్తున్నారు. ఫుడ్ టేస్టీగా ఉంటే చాలు.. ఎలా తయారు చేస్తున్నారు.. నాణ్యమైన వస్తువులు వినియోగిస్తున్నారా లేదా పట్టించుకోవడం లేదు. కానీ ఇటీవల భాగ్యనగరిలో ఫుడ్ కార్పొరేషన్ సేఫ్టీ అధికారులు వరుస తనిఖీలు చేస్తుండగా.. పేరు మోసిన రెస్టారెంట్ల నిర్వాకం బయటకు వచ్చింది. కల్తీ సరుకులు, నాణ్యత లేని వస్తువులు, పురుగులు పట్టేసిన పదార్ధాలు, కుళ్లిపోయిన మాంసం, డేట్ అయిపోయిన పాలు, పెరుగు ప్యాకెట్స్ లభించాయి.

మరీ హోటల్స్‌కు వెళితే.. ఫుడ్ బాగోలేదు అనుకుంటే.. ఎవరికీ కంప్లయింట్ చేస్తాం. మహా అయితే హోటల్ మేనేజర్‌ను సంప్రదిస్తూ ఉంటారు. వాళ్లు కూడా పట్టించుకోకపోతే ఎవరినీ సంప్రదించాలో తెలుసా.. జీహెచ్ఎంసీ అధికారుల్ని. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఏదైనా హోటల్స్, రెస్టారెంట్ కు వెళ్లి అక్కడ ఫుడ్ బాగోలేకపోతే GHMC నెంబర్ 040 21111111 నెంబర్ కు కాల్ చేసి కంప్లయింట్ చేయొచ్చు. అంతే కాకుండా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) టోల్ ఫ్రీ నెంబర్ 1800112100 కు కాల్ చేసి కంప్లయింట్ చేయొచ్చు. 24 గంటల్లో చర్యలు తీసుకుంటారు అధికారులు. ఈ నెంబర్లు 24/7  పని చేస్తాయి.

మరి పార్శిల్స్ తీసుకెళ్లిన వాళ్లు.. ఆర్డర్ చేసుకున్న వాళ్ల పరిస్థితి ఏంటీ అనుకుంటున్నారా..?  వాళ్లు కూడా ఎలాంటి అనుమానం వచ్చినా కంప్లయింట్ చేయొచ్చు. ఇప్పటికే హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు.. తనిఖీలు చేస్తున్నారు.  రాయలసీమ రుచులు, షా గౌస్ రెస్టారెంట్ల నుండి బాహుబలి తాలి, రామేశ్వరం కేఫ్ వరకు వాటి డొల్లతనం బయట పడింది. క్రీమ్ స్టోన్ ఐస్ క్రీం నిర్వాకం కూడా వెలుగులోకి వచ్చింది. లెబనాల్ ఫైన్ బేకింగ్, మనం చాక్లెట్ ఖర్జానా, బస్కిన్ రాబిన్స్, కృతింగ, కెఎఫ్సీ, మాస్టర్ చెఫ్ రెస్టారెంట్స్, హోటల్ సాయి బృందావన్ ప్యూర్ వెజ్ ఇలాంటి హోటల్లో కల్తీ ఆహార పదార్ధాలు లేదా కుళ్లిన మాంసం వంటి వాటితో వంటలు చేసి కస్టమర్ల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.  మంచి రేటింగ్, రివ్యూస్ ఉన్న హోటల్లో సైతం ఇదే డొల్లతనం బయట పడింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి