iDreamPost
android-app
ios-app

హీరోయిన్ తో స్టార్ సింగర్ డేటింగ్! వైరలవుతున్న ఫొటోలు..

  • Author Soma Sekhar Published - 08:24 AM, Tue - 22 August 23
  • Author Soma Sekhar Published - 08:24 AM, Tue - 22 August 23
హీరోయిన్ తో స్టార్ సింగర్ డేటింగ్! వైరలవుతున్న ఫొటోలు..

ఇండస్ట్రీలో లవ్ స్టోరీస్ కు కొదవుండదు.. లవ్ స్టోరీస్ అంటే సినిమా కథలు కాదండి బాబు. రియల్ లైఫ్ ప్రేమ కథలు. ఫస్ట్ డేటింగ్ తో మెుదలైన ప్రేమాయణాలు.. చివరికి పెళ్లి వరకు వెళ్తుంటాయి. అయితే అన్ని లవ్ స్టోరీలు పెళ్లి వరకు వెళ్లవు అనుకోండి అది వేరే విషయం. ఇక వారి డేటింగ్ విషయాలను ఒప్పుకోరు సదరు నటీ, నటులు. కొంత మంది మాత్రం బాహటంగానే మేం ప్రేమలో ఉన్నాం.. డేటింగ్ లో ఉన్నాం అంటూ కుండబద్దలు కొట్టినట్లు చెప్పుకొస్తారు. తాజాగా ఓ స్టార్ సింగర్ తో హీరోయిన్ డేటింగ్ లో ఉందన్న రూమర్స్ బీటౌన్ లో వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ వార్తలకు బలం చేకూరుస్తూ.. ఆ భామ తన ఇన్ స్టాలో ఇద్దరు సన్నిహితంగా ఉన్న ఫోటోలను షేర్ చేసింది.

బాలీవుడ్ హీరోయిన్ బనితా సంధు తన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. గత కొంతకాలంగా ఆమె పంజాబీ సింగర్ ఏపీ థిల్లాన్ తో డేటింగ్ లో ఉన్నట్లు బీటౌన్ లో రూమర్స్ వినిపిస్తున్నాయి. తాజాగా ఆ రూమర్స్ ను నిజం చేస్తూ.. అతడితో హోటల్ రూమ్ లో సన్నిహితంగా ఉన్న ఫొటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. దాంతో ఈ వార్తలకు కాస్త చెక్ పెట్టిందని అంటున్నారు నెటిజన్లు. కాగా.. ఇటీవల రిలీజైన డాక్యూ-సిరీస్ ఫంక్షన్ ముంబై లో జరగ్గా.. దానికి బనితా సంధు కూడా హాజరైంది. అదీకాక ముంబై హోటల్లో అతడితో సన్నిహితంగా ఉన్న పిక్స్ ను సోషల్ మీడియాలో పంచుకుంది. ఆ పిక్స్ కు విత్ మీ అంటూ రెడ్ కలర్ హాట్ సింబల్ ను కూడా పెట్టుకొచ్చింది ఈ అమ్మడు.

దీంతో ఈ జంట డేటింగ్ లో ఉన్నారంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఏపీ థిల్లాన్ పంజాబీ సంగీతంలో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇండో-కెనడియన్ రాపర్ గా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. ఇక ఇటీవలే విడుదలైన డాక్యుమెంటరీ సిరీస్, ఏపీ థిల్లాన్: ఫస్ట్ ఆఫ్ ఏ కైండ్ తో మరింత ఫేమస్ అయ్యాడు ఈ పంజాబీ పాటగాడు. ఇక బనితా సంధు వరుణ్ ధావన్ నటించిన అక్టోబర్ చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత పలు సినిమాల్లో మెరిసింది. తమిళంలోనూ చిత్రాలు చేసింది బనితా సంధు. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన పిక్స్ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి.

 

View this post on Instagram

 

A post shared by Banita Sandhu (@banitasandhu)


ఇదికూడా చదవండి: విద్యార్థిని షాకింగ్ డెసిషన్.. మార్కులు తక్కువగా వచ్చాయని!