iDreamPost

విద్యార్థిని షాకింగ్ డెసిషన్.. మార్కులు తక్కువగా వచ్చాయని!

విద్యార్థిని షాకింగ్ డెసిషన్.. మార్కులు తక్కువగా వచ్చాయని!

పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు భూమిక, వయసు 19 ఏళ్లు. బాగా చదువుకుని తల్లిదండ్రులకు మంచి పేరును తీసుకురావాలని అనుకుంది. ఇందులో భాగంగానే కామన్ మేనేజ్ మెంట్ అకౌంట్ పరీక్షలు కూడా రాసింది. అయితే ఇటీవల వెలువడిన ఫలితాల్లో తక్కువ మార్కులు వచ్చాయని ఈ విద్యార్థిని షాకింగ్ డెసిషన్ తీసుకుంది. దీంతో ఆ అమ్మాయి తల్లిదండ్రులు, స్నేహితులు షాక్ గురవుతున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. అనంతపురం జిల్లా రొద్దం పరిధిలోని బొమ్మిరెడ్డిపల్లి గ్రామంలో భూమిక (19) అనే యువతి నివాసం ఉంటుంది. ఈ అమ్మాయి ఇంటర్ పూర్తి చేసి హైదరాబాద్ లో కామన్ మేనేజ్ మెంట్ అకౌంట్ (CMA)కోర్సు చదువుతూ వచ్చింది. అయితే ఇటీవల వెలువడిన ఫలితాల్లో భూమికకు ఆశించినన్ని మార్కులు రాలేదు. దీంతో ఆ యువతి తీవ్ర మనస్థాపానికి గురైంది. ఇక అమ్మాయికి ఏం చేయాలో తెలియక శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలసుకున్న ఆ యువతి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. అనంతం మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ యువతి మరణంతో ఆమె స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇది కూడా చదవండి: ప్రాణ స్నేహితుడి కూతురిని గర్భవతిని చేసిన ప్రభుత్వ అధికారి!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి