వన్డే వరల్డ్ కప్-2023కి టైమ్ దగ్గర పడుతోంది. మరో వారం రోజుల్లో ఈ మెగా టోర్నీ ఆరంభం కానుంది. భారత్ వేదికగా జరగనున్న ఈ టోర్నీలో పాల్గొనే టీమ్స్ ఒక్కొక్కటిగా ఇండియాకు వస్తున్నాయి. ఇప్పటికే పాకిస్థాన్ జట్టు భారత గడ్డ మీదకు అడుగుపెట్టింది. ఏడేళ్ల తర్వాత ఇక్కడికి వచ్చింది దాయాది టీమ్. అయితే హైదరాబాద్‌లో విమానం దిగిన పాకిస్థాన్ క్రికెటర్లకు భారత్‌లో ఘనస్వాగతం లభించింది. శత్రుదేశంగా భావించే పాక్‌కు చెందిన ప్లేయర్లకు ఇక్కడ అద్భుతమైన అతిథి మర్యాదలు అందుతున్నాయి. వరల్డ్ కోసం విచ్చేసిన పాక్ క్రికెట్ టీమ్‌కు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో వందలాది మంది అభిమానులు స్వాగతం పలికారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి బస్సులో హోటల్‌కు చేరుకుంది పాక్ జట్టు. అయితే అక్కడ హోటల్ స్టాఫ్ వారికి చప్పట్లతో స్వాగతం పలికారు. ఆ టీమ్ కెప్టెన్ బాబర్ ఆజంతో పాటు మరికొందరు ఆటగాళ్లకు కాషాయ రంగులోని శాలువాలు కప్పి వెల్కమ్ చెప్పారు. అటు ఎయిర్‌పోర్ట్‌లో ఫ్యాన్స్ ప్రేమకు పులకరించిపోయిన దాయాది క్రికెటర్లు.. ఇటు హోటల్ సిబ్బంది స్వాగతానికి ఫిదా అయిపోయారు. ఇక పాక్ అభిమానుల సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. తమ క్రికెటర్లకు హైదరాబాద్‌లో సాదర స్వాగతం లభించిందని చెబుతూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ట్విట్టర్లో ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఇది వైరల్‌గా మారడంతో థ్యాంక్యూ ఇండియా అంటూ పాకిస్థానీలు స్పందిస్తున్నారు.
ఒక పర్యాటక జట్టుకు ఇంత గొప్ప ఆతిథ్యం లభించడం ఎప్పుడూ చూడలేదని పాక్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ కోసం తమ దేశానికి వస్తే భారత్‌కు కూడా ఇదే తరహాలో, ఇంతే ఎనర్జీతో వెల్కమ్ చెబుతామని పాక్ అభిమానులు అంటున్నారు. ఇండియాకు తాము బాకీ పడ్డామని.. మీ రాక కోసం ఎదురు చూస్తున్నామంటూ ఒక పాకిస్థానీ ట్వీట్ చేశాడు. అనేక మంది పాక్ ఫ్యాన్స్ భారత్‌కు థ్యాంక్స్ చెబుతూ ట్వీట్లు చేస్తుండటంతో.. ట్విట్టర్లో ఇప్పుడు ‘థ్యాంక్స్ ఇండియా’ అనే ట్యాగ్ ట్రెండింగ్ అవుతోంది. మరి.. పాక్ క్రికెటర్లకు హైదరాబాద్‌లో దక్కిన ఘనస్వాగతంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ఆసీస్‌పై సిరీస్ గెలిచినా.. కప్పు ముట్టుకోని రోహిత్!
Instagram story by Captain Babar Azam.
– He has enjoyed the support from cricket fans in India. pic.twitter.com/nb39mOXhV1
— Johns. (@CricCrazyJohns) September 28, 2023
Our Kings have been welcomed like Kings ❤️🔥 Thanks India 🙌
– Team Pakistan has landed in #Hyderabad.#BabarAzam𓃵 #ICCWorldCup #PakistanCricketTeam pic.twitter.com/ajlE7RHnWp
— 𝚃𝚑𝚘𝚛 𝚋𝚑𝚊𝚒 🎗 (@THORthayaar) September 27, 2023
Mohammed Rizwan’s Instagram story.
The hospitality of India is top class and Pakistani players have loved it! pic.twitter.com/fGbDH6uZOo
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 28, 2023