Dharani
మాజీ ఎంపీ యార్లగడ్డ ఏపీ రాజకీయాలపై మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..
మాజీ ఎంపీ యార్లగడ్డ ఏపీ రాజకీయాలపై మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..
Dharani
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న అనగా జనవరి 18, గురువారం నాడు ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా ఎంత రచ్చ జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రవర్తించిన తీరు అందరిని విస్మయానికి గురి చేసింది. ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడాన్ని తట్టుకోలేకపోయిన బాలకృష్ణ వెంటనే వాటిని తొలగించాలని ఆర్డర్ వేశాడు. ఇది రాజకీయ వివాదానికి దారి తీసింది. బాలయ్య చర్యలపై ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత అన్న కొడుకుపై బాలయ్యకు ఎందుకీ కోపం అని ప్రశ్నించారు. అలానే బాలకృష్ణ తీరుపై కొడాలి నాని ఘాటు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో తాజాగా ఏపీలో చోటు చేసుకున్న సంఘటనలపై మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ విషయంలో టీడీపీ నేతలు ఓవర్ చేస్తున్నారని విమర్శించారు. అంతేకాక లోకేష్ పెళ్లి మీద కూడా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈక్రమంలో తాజాగా శుక్రవారం నాడు యార్లగడ్డ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘జూనియర్ ఎన్టీఆర్ విషయంలో టీడీపీ నేతలు ఓవరాక్షన్ చేస్తున్నారు. తారక్ ఇప్పుడు ఆకాశమంత ఎత్తు ఎదిగారు. ఆకాశం మీద ఉమ్ము వేయాలని చూస్తే వారి ముఖం మీదనే పడుతుంది. తారక్ ప్లెక్సీలు తొలగిస్తే ఆయనకు నష్టమేం లేదు. జూనియర్ ఎన్టీఆర్‌పై విమర్శలు చేస్తే అది వారికే నష్టం’’ అని చెప్పుకొచ్చారు.
ఈ క్రమంలో లోకేష్ పెళ్లిపై యార్లగడ్డ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘గతంలో బాలకృష్ణ కూతురును లోకేష్‌కు ఇచ్చి పెళ్లి చేస్తున్నారా.. అని నేను చంద్రబాబును అడిగాను. అప్పుడు ఆయన నాన్సెన్స్ అంటూ నాపై కోపడ్డారు.. తిట్టారు. మేనరికం సంబంధాలు మంచివి కాదని చెప్పారు. తర్వాత లోకేష్‌కు బాలకృష్ణ కుమార్తె బ్రాహ్మణిని ఇచ్చి చంద్రబాబు వివాహం చేశారు’’ అని చెప్పుకొచ్చారు. అలానే అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ మంచి నిర్ణయం అన్నారు యార్లగడ్డ.
‘‘అంబేడ్కర్ దేశానికి ఒక ఐకాన్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అంటే వ్యక్తిగతంగా నాకు ఎంతో అభిమానం. ఆయనపై కావాలనే పిచ్చి కేసులు పెట్టారు. లక్ష కోట్ల అవినీతిని అని తప్పుడు ప్రచారం చేశారు. సీఎం జగన్ ఒక హీరో. నేను మంచి చేస్తేనే ఓటు వేయండని ధైర్యంగా చెప్పిన నేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రమే. అలాంటి నేత దేశంలో మరొకరు లేరు’ అంటూ సీఎం జగన్‌పై ప్రశంసలు కురిపించారు యార్లగడ్డ.