iDreamPost
android-app
ios-app

Naga Chaithanya – Sobhitha Marriage: చైతూ – శోభిత పెళ్లి వీడియో.. ఎన్ని కోట్లో తెలిస్తే మతిపోవాల్సిందే!

  • Published Nov 26, 2024 | 4:36 PM Updated Updated Nov 26, 2024 | 4:36 PM

Naga Chaithanya - Sobhitha Marriage: నాగ చైతన్య , శోభిత పెళ్లి ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతుంది. ప్రస్తుతం వీరి పెళ్ళికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి.

Naga Chaithanya - Sobhitha Marriage: నాగ చైతన్య , శోభిత పెళ్లి ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతుంది. ప్రస్తుతం వీరి పెళ్ళికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి.

Naga Chaithanya – Sobhitha Marriage: చైతూ – శోభిత పెళ్లి వీడియో.. ఎన్ని కోట్లో తెలిస్తే మతిపోవాల్సిందే!

యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య మళ్లీ పెళ్లి కొడుకు కాబోతున్న సంగతి తెలిసిందే. విడాకుల తరువాత కొన్నేళ్లు సింగిల్‌గా ఉన్న చైతూ ట్రెండింగ్ లో ఉన్న తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాళ్ళతో ప్రేమలో పడడం.. ఇరు కుటుంబాల అంగీకారంతో ఆగస్టులో ఈ జంట నిశ్చితార్థం చేసుకోవడం అందరికీ తెలిసిందే. డిసెంబరు 4న వీరి పెళ్లి జరగబోతోంది. అక్కినేని వారి అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే ఘనంగా వీరి పెళ్లి జరగబోతుంది. ప్రస్తుతం వీరి పెళ్ళికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈ పెళ్లిని డాక్యుమెంటరీగా తీసి నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ చేయబోతున్నారని ఇటీవల వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే.ఇప్పుడా వార్తలు నిజమేనని తెలుస్తుంది.

చైతూ-శోభితల పెళ్లి డాక్యుమెంటరీ కోసం నెట్ ఫ్లిక్స్ సంస్థ ఏకంగా రూ.50 కోట్ల చెల్లించబోతోందని తెలుస్తుంది. ఈ భారీ రేటు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీని గురించి తెలిసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అయితే చైతూ-శోభిత పెళ్లి చాలా గ్రాండ్ గా జరుగుతున్నా కూడా వీరి పెళ్లికి మీడియాకు ఎంట్రీ లేదు. కేవలం చాలా కొద్దిమంది సెలబ్రెటీలను మాత్రమే పెళ్ళికి పిలుస్తున్నారు. అయితే సినీ సెలబ్రెటీలు తమ పెళ్లి వీడియోలను స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్ లకు అమ్ముకోవడం ఇది ఫస్ట్ టైమ్ కాదు. బాలీవుడ్లో స్టార్ట్ అయిన ఈ ట్రెండ్ ఇప్పుడు సౌత్‌కూ స్ప్రెడ్ అయ్యింది. రీసెంట్ గానే నయనతార-విఘ్నేష్ శివన్‌ల పెళ్లి డాక్యుమెంటరీని నెట్ ఫ్లిక్స్ స్ట్రీమ్ చేయడం తెలిసిందే. దానికి రూ.25 కోట్ల ధర పలికినట్లు వార్తలు వచ్చాయి. అయితే నయన్ – విజ్ఞేష్ ల డాక్యుమెంటరీకి సూపర్ రెస్పాన్స్ రావడంతో చైతూ-శోభిత మ్యారేజ్ వీడియోకు కూడా సూపర్ రెస్పాన్స్ వస్తుందని నెట్ ఫ్లిక్స్ భావిస్తుందట. అందుకే డబుల్ రేటు ఇస్తోందట నెట్ ఫ్లిక్స్.

అక్కినేని కుటుంబంలో పెళ్లి, పైగా శోభితకు బాలీవుడ్లో కూడా సూపర్ క్రేజ్ ఉంది. అందువల్ల కచ్చితంగా హిందీ ఆడియన్స్ కూడా వీరి పెళ్ళిని చూస్తారు. అందుకే ఇంత భారీ రేటుకి కొన్నారని తెలుస్తుంది. ఇక ఈ డాక్యుమెంటరీ కోసం అక్కినేని ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. తమ యువ సామ్రాట్ పెళ్లి చూసేందుకు ఎంతగానో ఆరాటపడుతున్నారు. ఇక చైతూ- శోభిత పెళ్లి డాక్యుమెంటరీ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibombetine girişjojobet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetstarzbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Girişmarsbahis