Dharani
చంద్రబాబు ప్రకటనకు పోటీగా.. పవన్ కళ్యాణ్ కూడా జనసేన పోటీ చేయబోయో రెండు స్థానాల పేర్లు ప్రకటించాడు పవన్ కళ్యాణ్. అయితే ఆయన ప్రకటనతో.. పొత్తు మాటున వీరిద్దరూ ఆడుతున్న దొంగాట ప్రజలకు స్పష్టంగా అర్థం అయ్యింది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆ వివరాలు..
చంద్రబాబు ప్రకటనకు పోటీగా.. పవన్ కళ్యాణ్ కూడా జనసేన పోటీ చేయబోయో రెండు స్థానాల పేర్లు ప్రకటించాడు పవన్ కళ్యాణ్. అయితే ఆయన ప్రకటనతో.. పొత్తు మాటున వీరిద్దరూ ఆడుతున్న దొంగాట ప్రజలకు స్పష్టంగా అర్థం అయ్యింది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆ వివరాలు..
Dharani
రానున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కోసం టీడీనీ-జనసేన కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అవినీతి కేసులో అరెస్టైన చంద్రబాబుతో ములాఖత్ అయి ఆ తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలు సాక్షిగా పొత్తు గురించి ప్రకటించారు జనసేన అధ్యక్షడు పవన్ కళ్యాణ్. అయితే ఏ నిమిషంలో ఈ పొత్తు ప్రకటన వెలువడింతో తెలియదు కానీ.. నాటి నుంచి ఇరు పార్టీల నేతల మధ్య ఏమాత్రం సఖ్యత కుదరడం లేదు. సీఎం పదవిపై లోకేష్ వ్యాఖ్యలు, నియోజకవర్గాల్లో టీడీపీ నేతల తీరు చూస్తే.. తమ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. టీడీపీ చేతిలో కీలు బొమ్మలా మారిపోయాడని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం పదవి గురించి లోకేష్ అంత డైరెక్ట్‌గా వ్యాఖ్యలు చేస్తే.. పవన్ ఏమాత్రం స్పందించకపోవడం వారి ఆవేదనను మరింత పెంచింది.
ఇక తాజాగా చంద్రబాబు జనసేనతో సంబంధం లేకుండా రెండు నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించి.. తన దృష్టిలో జనసేనకు ఉన్న విలువ ఏంటో డైరక్ట్‌గా చెప్పారంటూ జనసేన నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరు పార్టీల అధ్యక్షులు కలిసి ఉమ్మడి ప్రకనట చేయాల్సింది పోయి.. ఇలా ఏకపక్షంగా అభ్యర్థులను ఎలా ప్రకటిస్తారని వారు ప్రశ్నించారు. అంతేకాక పవన్ తీరుపై కూడా అసహనం వ్యక్తం చేశారు. ఇదేదో తనకు వ్యతిరేకం అవుతుంది అని భావించిన పవన్.. అప్పటికప్పుడు టీడీపీకి చర్యలకు కౌంటర్‌గా.. జనసేన పోటీ చేయబోయే రెండు నియోజకవర్గాలను ప్రకటించి.. కేడర్‌ను శాంతింపచేసే ప్రయత్నాలు చేశాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
ఇరు పార్టీల అధ్యక్షుల తీరు నిశితంగా గమనిస్తున్న ప్రజలు.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ల నాటకాలు చూడలేకపోతున్నాం.. పొత్తు మాటున వీరిద్దరూ దొంగాట ఆడుతున్నారు.. కానీ ప్రజలను మోసం చేయడంలో ఇద్దరూ ఇద్దరే అని విమర్శిస్తున్నారు. పైగా చంద్రబాబు డైరెక్షన్‌లోనే పవన్ జనసేన పోటీ చేయబోయే రెండు నియోజకవర్గాలను ప్రకటించాడు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
నిజంగానే చంద్రబాబు చర్యలపై పవన్‌కు కోపం వస్తే.. ఆయన కూడా నియోజకవర్గాల పేర్లు మాత్రమే చెప్పకుండా.. అభ్యర్థులను ప్రకటించేవారని.. కానీ అలా జరగలేదంటే.. ఇదంతా వీరిద్దరూ కలిసి ఆడుతున్న డ్రామా అని స్పష్టంగా అర్థం అవుతుంది అంటున్నారు. జనసేన పోటీ చేయబోయే నియోజకవర్గాల్లో ఎవరికి సీటు కేటాయించాలో ఇంకా చంద్రబాబు డిసైడ్ కాలేదు కాబట్టే పవన్ కేవలం నియోజకవర్గాల పేర్లు మాత్రమే ప్రకటించి.. క్యాడర్‌ని శాంతింప చేసే ప్రయత్నాలు చేశారని అంటున్నారు.
పైగా చంద్రబాబే ముఖ్యమంత్రి అంటూ లోకేష్ చేసిన ప్రకటనపై స్పందిస్తూ.. అప్పుడు కూడా మౌనంగానే ఉన్నాను అన్నాడు తప్పితే.. అది ఉమ్మడి నిర్ణయమనో.. తాను అంగీకరించలేదనో క్లారిటీ ఇవ్వలేదు పవన్ కళ్యాణ్. పైగా ఆయన చేసిన వ్యాఖ్యలతో ఒకవేళ గెలిస్తే.. చంద్రబాబే ఐదేళ్లు సీఎం.. అందుకు పవన్ కూడా అంగీకరించాడని దీనితో తేటతెల్లం అయ్యింది.
అంతేకాక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది.. కానీ ఇప్పటి వరకు సీట్ల కేటాయింపు ఓ కొలిక్కి రాలేదు. ఈ అంశంపై జనసేన కేడర్ తీవ్ర అసంతృప్తితో ఉంది. కానీ పవన్ మాత్రం దానిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా.. ఎప్పుడో 2, 3 ఏళ్ల తర్వాత జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన మూడో వంతు సీట్లను తీసుకుంటుందంటూ కేడర్‌ను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు.
కానీ చంద్రబాబు నైజం తెలిసిన జనసేన కేడర్ మాత్రం తమ అధ్యక్షుడు పవన్ మాటల్ని నమ్మడం లేదు. పైగా అధ్యక్షుడి తీరు చూస్తే.. ఇదంతా అసెంబ్లీ సీట్ల వ్యవహారం నుంచి పక్కదారి పట్టించేందుకు చేస్తోన్న ప్రయత్నం అని.. బాబు డైరెక్షన్‌లోనే పవన్ కళ్యాణ్ ఇలా చేస్తున్నాడని స్పష్టంగా అర్థం అవుతోంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
సీట్ల కేటాయింపు అంశాన్ని ఇలానే సాగదీసి.. చివరకు నాలుగైదు సీట్లు మాత్రమే జనసేనకు కేటాయించి.. ఆ పార్టీ ఓట్లను వాడుకునేందుకు టీడీపీ చేసిన ప్లాన్ ఇదని.. దాన్ని పవన్ అమలు చేస్తున్నారని.. వారు ఇద్దరూ కలిసే పొత్తు మాటున ఈ దొంగాట ఆడుతున్నారని రాజీకయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.