Dharani
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి ప్రతిపక్ష నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆ వివరాఉల..
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి ప్రతిపక్ష నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆ వివరాఉల..
Dharani
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రతిపక్షాలకు భారీ షాక్ తగిలింది. చంద్రబాబు, వైఎస్ షర్మిల, సునీతలకు కోర్టు షాక్ ఇచ్చింది. వివేకా హత్య కేసుపై కోర్టు వారికి కీలక ఆదేశాలు జారీ చేసింది. వివేకా హత్య జరిగి ఐదేళ్లు అవుతోంది. ప్రస్తుతం కేసు కోర్టు విచారణలో ఉంది. కానీ ప్రతిపక్షాలు మాత్రం.. పదే పదే ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ.. ఎంపీ అవినాష్ రెడ్డి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిల మీద ఆరోపణలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కోర్టు తాజాగా ఈ కేసుకు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబు, సునీత, వైఎస్ షర్మిలలు.. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయాన్ని ప్రస్తావించకూడదని.. కడప కోర్టు సంచలన ఉత్తర్వులు జారీ చేసింది.
ఎన్నికల వేళ ప్రతిపక్ష నేతలు పదే పదే వైఎస్ వివేకా హత్య కేసును ప్రస్తావిస్తూ.. వైసీపీ నేతలపై ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేత సురేష్ బాబు కడప కోర్టును ఆశ్రయించారు. ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేతలు వివేకా హత్య కేసును ప్రస్తావించడాన్ని వ్యతిరేకిస్తూ.. కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విపక్ష నేతల ఎన్నికల ప్రసంగంలో ఈ అంశాన్ని మాట్లాడకుండా.. ఆదేశాలు జారీ చేయాలని తన పిటిషన్‌లో కోరారు.
కడప కోర్టు గురువారం నాడు ఈ పిటిషన్‌ను విచారించింది. ప్రతిపక్ష నేతలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల వేళ చంద్రబాబు, షర్మిల, సునీతలు వివేకా హత్య కేసును ప్రస్తావించకూడదని.. తమ ప్రసంగాల్లో దీనిపై మాట్లాడకూడదని ఆదేశాలు జారీ చేసింది. తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి నారా లోకేష్ సహా.. వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత సైతం ఈ అంశంపై మాట్లాడకూడదని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఇక ఏపీ ఎన్నికల వేళ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై ప్రతిపక్షాలు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం మీడియాతో మాట్లాడిన వైఎస్ సోదరి విమల సైతం ఇదే విధంగా స్పందించారు. వైఎస్ షర్మిల, సునీతలు ఇద్దరు తమ కుటుంబ పరువు తీస్తున్నారని.. వివేకా హత్య కేసులో కావాలనే జగన్, అవినాష్ రెడ్డిల మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. ఇప్పటికైనా వారు తమ బుద్ధి మార్చుకోవాలని హితవు పలికారు. ఇక తాజాగా కోర్టు కూడా ఇలానే ఆదేశాలు జారీ చేయడం విశేషం.