iDreamPost
android-app
ios-app

సైలెంట్​గా OTTలోకి కిల్లర్ గేమ్ మూవీ.. ప్రతి క్షణం మునివేళ్లపై నిలబెడుతుంది!

  • Published Feb 27, 2024 | 8:24 PM Updated Updated Feb 27, 2024 | 8:24 PM

ఓటీటీ ఆడియెన్స్​ను థ్రిల్​ చేసేందుకు ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ స్ట్రీమింగ్​కు వచ్చేసింది. ఇది ప్రతి క్షణం ప్రేక్షకుల్ని మునివేళ్ల మీద నిలబెడుతుంది.

ఓటీటీ ఆడియెన్స్​ను థ్రిల్​ చేసేందుకు ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ స్ట్రీమింగ్​కు వచ్చేసింది. ఇది ప్రతి క్షణం ప్రేక్షకుల్ని మునివేళ్ల మీద నిలబెడుతుంది.

  • Published Feb 27, 2024 | 8:24 PMUpdated Feb 27, 2024 | 8:24 PM
సైలెంట్​గా OTTలోకి కిల్లర్ గేమ్ మూవీ.. ప్రతి క్షణం మునివేళ్లపై నిలబెడుతుంది!

థియేటర్​లో మంచి హిట్స్​గా నిలిచిన మూవీస్​ కోసం ఓటీటీ ఆడియెన్స్ ఎదురు చూడటం కామనే. ఎప్పుడు ఓటీటీలోకి వస్తే అప్పుడు చూసేద్దామంటూ వెయిట్ చేయడం మామూలే. అయితే బిగ్ స్క్రీన్స్​లో పెద్దగా నడవని కొన్ని మంచి సినిమాలు కూడా ఉంటాయి. అలాగే డిఫరెంట్ కాన్సెప్ట్​తో తెరకెక్కిన స్పెషల్ మూవీస్ కూడా కొన్ని ఉంటాయి. అలాంటి ఫిల్మ్స్​ ఓటీటీలో వచ్చినప్పుడు పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ మౌత్ టాక్ వల్ల ఇవి ఓటీటీల్లో రికార్డు వ్యూస్​తో రచ్చ చేసిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. ఈ కోవలోనే ఇప్పుడో మూవీ సత్తా చాటేందుకు ఓటీటీలోకి వచ్చేసింది. సైకలాజికల్ థ్రిల్లర్ స్టోరీతో తీసిన ఫిల్మ్ కావడంతో మూవీ లవర్స్ దీని మీద ఓ లుక్కేయాలని అనుకుంటున్నారు. ఇదే నెలలో బిగ్ స్క్రీన్స్​లోకి వచ్చిన ఈ సినిమా.. నెల తిరగకుండానే సైలెంట్​గా స్ట్రీమింగ్​కి వచ్చేసింది. ఇంతకీ ఏంటా మూవీ అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

గీతానంద్, నేహా సోలంకి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘గేమ్ ఆన్’. ఫిబ్రవరి 2వ తేదీన థియేటర్లలోకి వచ్చిన ఈ ఫిల్మ్‌.. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్​తో రూపొందింది. అప్పట్లో కిల్లర్ గేమ్ బ్లూ వేల్ ఎంత మంది ప్రాణాలు బలిగొందో తెలిసిందే. ఛాలెంజ్​లు విసురుతూ ఆత్మహత్యకు ప్రేరేపించే ఈ ఆటను చాలా దేశాల్లో బ్యాన్ చేశారు. ఈ గేమ్​కు కాస్త అటూఇటుగా ఉండే స్టోరీతోనే ‘గేమ్ ఆన్’ సినిమా తీశారు. కథ పరంగా చూస్తే ఆసక్తికరంగా ఉన్నప్పటికీ పాపులర్ యాక్టర్స్ లేకపోవడంతో ఈ చిత్రం అలా థియేటర్లలోకి వచ్చి ఇలా వెళ్లిపోయింది. ఇప్పుడు హఠాత్తుగా అమెజాన్ ప్రైమ్​లోకి ఎంట్రీ ఇచ్చింది. సినిమాలో పలు పాత్రలు ఉన్నప్పటికీ రెండు క్యారెక్టర్స్ మధ్యే స్టోరీ ఎక్కువగా నడుస్తుంది.

గౌతమ్ (గీతానంద్) ఒక గేమింగ్ కంపెనీలో వర్క్ చేస్తుంటాడు. అదే సమయంలో మోక్ష (వాసంతి) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. అయితే పనికి సంబంధించిన టార్గెట్​ను పూర్తి చేయకపోవడంతో అతడ్ని జాబ్​లో నుంచి తీసేస్తారు. దీంతో సూసైడ్ చేసుకోవాలని అనుకుంటాడు గౌతమ్. సరిగ్గా ఈ సమయంలో ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి అతడికి ఒక ఫోన్ కాల్ వస్తుంది. చిన్న చిన్న టాస్క్​లు ఇస్తూ వాటిని కంప్లీట్ చేయాలని ఆదేశిస్తాడు సదరు వ్యక్తి. అలా చేసినందుకు గానూ గౌతమ్ అకౌంట్​లో అతడు డబ్బులు జమ చేస్తుంటాడు. అయితే ఒకసారి ఓ వ్యక్తిని మర్డర్ చేయాలంటూ టాస్క్ ఇస్తాడు. దీంతో కథ మలుపు తిరుగుతుంది. అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన ఆ టాస్క్​ను గౌతమ్ పూర్తి చేశాడా? లేదా? చివరకు ఏమైంది? అనేది తెలుసుకోవాలంటే మూవీని స్ట్రీమింగ్ చేయకతప్పదు.

ఇదీ చదవండి: Pushpa-2: పుష్ప 2లో హై ఓల్టేజ్ సీక్వెన్స్.. ఏకంగా 50 కోట్లతో..!