iDreamPost

Pushpa-2: పుష్ప 2లో హై ఓల్టేజ్ సీక్వెన్స్.. ఏకంగా 50 కోట్లతో..!

  • Published Feb 27, 2024 | 7:43 PMUpdated Feb 27, 2024 | 7:43 PM

ప్రస్తుతం అల్లు అర్జున్..సుకుమార్ కాంబినేషన్ అయిన పుష్ప-2 కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే, ఇప్పుడు ఈ సినిమా సంబంధించిన ఓ లేటెస్ట్ అప్ డేట్ నెట్టింట షికార్లు చేస్తోంది.

ప్రస్తుతం అల్లు అర్జున్..సుకుమార్ కాంబినేషన్ అయిన పుష్ప-2 కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే, ఇప్పుడు ఈ సినిమా సంబంధించిన ఓ లేటెస్ట్ అప్ డేట్ నెట్టింట షికార్లు చేస్తోంది.

  • Published Feb 27, 2024 | 7:43 PMUpdated Feb 27, 2024 | 7:43 PM
Pushpa-2: పుష్ప 2లో హై ఓల్టేజ్ సీక్వెన్స్.. ఏకంగా 50 కోట్లతో..!

అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ అంటే ఆడియన్సుకు ఎక్స్పెక్టషన్స్ భారీగా ఉంటాయి. ఇక ఇప్పుడు పుష్ప సిక్వెల్ పై కూడా ఇలాంటి అంచనాలే నెలకొన్నాయి. ఇక ఈ సినిమాను అందరి అంచనాలకు మించి భారీ బడ్జెట్ తో తెరపైకి తీసుకుని వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకా షూటింగ్ కూడా పూర్తిగా ఫినిష్ కాకముందే .. మూవీ కలెక్షన్ టార్గెట్ ను కూడా ఫిక్స్ చేసుకున్నారు. ఇంకా అందుకు తగ్గట్టుగానే.. మూవీ మేకర్స్ కూడా అన్నిటిని సిద్ధం చేసుకుంటున్నారు. ఇక ఇటీవల ఈ సినిమా ఇంటర్వెల్ సీన్ గురించి వచ్చిన మాస్ అప్ డేట్ కూడా బాగా వైరల్ అయింది. దర్శకుడు కూడా ఈ సినిమా మేకింగ్ లో ఏ మాత్రం లోటు లేకుండా .. ప్రతి సీన్ పర్ఫెక్ట్ గా ఉండేలా చూసుకుంటున్నాడు. అయితే, ఈ సినిమా గురించి ఇప్పుడు మరో లేటెస్ట్ టాక్ వినిపిస్తోంది.

ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ చాలా వేగంగానే కొనసాగుతోంది. అయితే, ఈ సినిమాలు కొన్ని ఊహించని సన్నివేశాలు కూడా భారీగా ఉండబోతున్నాయనే టాక్ వినిపిస్తోంది. మరి ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్ .. ఇప్పటివరకు ఎటువంటి సినిమాలో లేనంత విధంగా చిత్రీకరిస్తున్నారట మేకర్స్. సుకుమార్ ఇప్పటివరకు తీసిన సినిమాలు అన్ని ఒక ఎత్తు అయితే.. పుష్ప-2 మరో ఎత్తు అని చెబుతున్నారు. ఇక ఈ ఇంటర్వెల్ సీన్ లోనే జాతరకు సంబంధించిన సీన్స్ ఉండబోతున్నాయని. కేవలం ఆ ఒక్క సీన్ కోసం భారీ బడ్జెట్ ను కేటాయించారని.. ఇంకా ఆ సీన్ కోసం ఎక్కువ రోజులు టైం కూడా తీసుకుంటున్నారని.. ఇలా అనేక వార్తలు ఇప్పటివరకు వింటూ వచ్చాము. దీనితో ఈ సినిమాపై రోజు రోజుకి అందరికి ఎక్స్పెక్టషన్స్ పెరిగిపోతున్నాయి.

ఇక ఈ సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే.. ఈ సినిమాలో ప్రత్యేకించి ఓ పాట, అలాగే కొన్ని యాక్షన్ సీన్స్ తో ఉన్న సన్నివేశాలు .. థియేటర్ లో మాస్ జాతర చేయించేంత రేంజ్ లో ఉంటాయట. ఆ సీన్స్ లో అల్లు అర్జున్ అర్ధ నారీశ్వరి అవతారంలో.. విలన్స్ ను చీల్చి చెండాడడమే కాకుండా ఉగ్రరూపంతో వేసిన స్టెప్పులు కూడా.. ఆడియన్సుకు రోమాలు నిక్కపొడిచే విధంగా ఉండబోతున్నాయట. ఇక ఈ సినిమా లీక్స్ కు ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వడం లేదు మేకర్స్. ఎక్కడ ఎటువంటి పొరపాటు జరగకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇక ఇప్పటికే అందరికి భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమాపై.. రానున్న రోజుల్లో ఎలాంటి అప్ డేట్స్ వస్తాయో వేచి చూడాలి. మరి, పుష్ప-2 సినిమా లేటెస్ట్ అప్ డేట్ పై.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి