iDreamPost
android-app
ios-app

చియాన్ విక్రమ్ తంగలాన్ మూవీ OTT స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

  • Published Sep 09, 2024 | 12:25 PM Updated Updated Sep 09, 2024 | 12:25 PM

Thangalaan Movie OTT Streaming Date : కోలీవుడ్ నటులకు తెలుగు ప్రేక్షకులలో కూడా మంచి క్రేజ్ ఉంటుందన్న సంగతి తెలియనిది కాదు. ఇక నటుడు చియాన్ విక్రమ్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలో విక్రమ్ నటించిన లేటెస్ట్ మూవీ తంగలాన్ ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయిపోతుంది.

Thangalaan Movie OTT Streaming Date : కోలీవుడ్ నటులకు తెలుగు ప్రేక్షకులలో కూడా మంచి క్రేజ్ ఉంటుందన్న సంగతి తెలియనిది కాదు. ఇక నటుడు చియాన్ విక్రమ్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలో విక్రమ్ నటించిన లేటెస్ట్ మూవీ తంగలాన్ ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయిపోతుంది.

  • Published Sep 09, 2024 | 12:25 PMUpdated Sep 09, 2024 | 12:25 PM
చియాన్ విక్రమ్ తంగలాన్ మూవీ OTT స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

ఓటీటీ లోకి ఎప్పుడెప్పడు కొత్త సినిమాలు వస్తాయా అని ప్రేక్షకులంతా ఎదురుచూస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఈ నెలలో ఓటీటీ ప్రేక్షకులను మెప్పించడానికి చాలానే ఇంట్రెస్టింగ్ తెలుగు సినిమాలు రెడీ గా ఉన్నాయి. ఇక మూవీ లవర్స్ ఎలాగూ లాంగ్వేజ్ , క్యాస్టింగ్ ను బట్టి కాకుండా కథను బట్టి ఆయా సినిమాలను ఆదరిస్తారు కాబట్టి.. త్వరలో ఓటీటీ లోకి రాబోయే సినిమా కూడా ప్రేక్షకులను బాగానే మెప్పిస్తుంది. ఈ సినిమా మరేదో కాదు చియాన్ విక్రమ్ లేటెస్ట్ గా నటించిన తంగలాన్ మూవీ. బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్స్ బ్రేక్ చేసిన ఈ మూవీ ఇక ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అయిపోతుంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పా రంజిత్ డైరెక్షన్ లో చియాన్ విక్రమ్ నటించిన ఈ సినిమా ఆగష్టు 15 న థియేటర్ లో రిలీజ్ అయింది. మొదటి నుంచి కూడా ఈ సినిమాకు అన్ని ప్రాంతాల్లో భారీ బజ్ క్రియేట్ అయ్యి.. బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ముఖ్యంగా తమిళ నాట ఈ సినిమాకు విపరీతమైన రెస్పాన్స్ లభించింది. దాదాపు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రూ.100 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయిపోతుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ మూవీని అన్ని సౌత్ ఇండియన్ లాంగ్వేజ్స్ లో సెప్టెంబర్ 20 నుంచి స్ట్రీమింగ్ కు తీసుకురానున్నారు. కాబట్టి ఈ మూవీని థియేటర్ లో మిస్ అయినా వారు ఎంచక్కా ఓటీటీ లో చూసేయండి. మరి ఓటీటీ లో ఈ మూవీ ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో చూడాలి.

ఇక ఈ మూవీ కథ విషయానికొస్తే.. ఇండియన్ హిస్టరీలో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కు స్పెషల్ ప్లేస్ ఉన్న సంగతి తెలియనిది కాదు. ఈ బ్యాక్డ్రాప్ లోనే ఈ సినిమాను రూపొందించారు మేకర్స్. ఆ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో .. బంగారు నిక్షేపాల కోసం. అక్కడ గిరిజనుల చేసే అన్వేషణ , ఆ సమయంలో వారి జీవన పరిస్థితులు , బ్రిటిష్ వారి పాలనలో వారు అనుభవించిన సమస్యలు.. ఇంకా ప్రతి ఒక్క దాని గురించి చాలా క్షుణ్ణంగా.. కళ్ళకు కట్టినట్లు చూపించారు మేకర్స్. ఇలా రియల్ లైఫ్ ను ఆధారంగా తీసుకుని రూపొందించే చిత్రాలు చాలా అరుదుగా వస్తూ ఉంటాయి కాబట్టి.. ఈ సినిమాను అసలు మిస్ చేయకుండా చూసేయండి. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.