Swetha
కొన్ని సినిమాలు ఓటీటీ లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా సైలెంట్ గా స్ట్రీమింగ్ అవుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే మరొక ఇంట్రెస్టింగ్ మూవీ సైలెంట్ గా ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి అది ఏ సినిమానో చూసేద్దాం.
కొన్ని సినిమాలు ఓటీటీ లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా సైలెంట్ గా స్ట్రీమింగ్ అవుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే మరొక ఇంట్రెస్టింగ్ మూవీ సైలెంట్ గా ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి అది ఏ సినిమానో చూసేద్దాం.
Swetha
ఈ వారం ఓటీటీ లో ఇంట్రెస్టింగ్ సినిమాలు , సిరీస్ లు రిలీజ్ అయ్యాయి.. వాటిలో తెలుగు సినిమాలతో పాటు.. హిందీ మూవీస్ కూడా రిలీజ్ అయ్యాయి. అయితే ఈ సినిమాలన్నీ కూడా ముందస్తు ఇన్ఫర్మేషన్ తోనే వస్తూ ఉంటాయి. కాబట్టి మూవీ లవర్స్ ముందుగానే ఏ సినిమా చూడాలి అని ఫిక్స్ అయిపోతూ ఉంటారు. ఈ క్రమంలో కొన్ని సినిమాలు మాత్రం.. సైలెంట్ గా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా స్ట్రీమింగ్ అవుతూ ఉంటాయి. ఇక ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరొక సినిమా యాడ్ అయింది. మరి ఈ వారం సైలెంట్ గా స్ట్రీమింగ్ కు వచ్చేసిన ఆ సినిమా ఏంటి.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. అనే విషయాలను చూసేద్దాం.
కన్నడ హీరోస్ .. శివరాజ్ కుమార్ , ప్రభుదేవ హీరోలుగా నటించిన సినిమా “కరటక దమనక“. ఈ సినిమాకు యోగరాజ్ భట్ దర్శకత్వం వహించారు. కాగా ఈ సినిమాలో శివరాజ్ కుమార్ , ప్రభుదేవాతో పాటు.. ప్రియా ఆనంద్ , నీవీక్షా నాయుడు హీరోయిన్లుగా నటించారు. అయితే దాదాపు పన్నెండేళ్ల తర్వాత.. కన్నడలో ప్రభుదేవా హీరోగా ఈ సినిమాతోనే ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ సినిమా మార్చి లో థియేటర్స్ లో రిలీజ్ అయింది. రిలీజ్ కు ముందు ఈ సినిమాపై అందరికి భారీ అంచనాలు నెలకొన్న కానీ.. రిలీజ్ తర్వాత మాత్రం ఈ సినిమా మిక్సడ్ టాక్ తో సరిపెట్టుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఎటువంటి ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకుండా సైలెంట్ గా ఓటీటీ లోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ప్రస్తుతానికి ఈ సినిమా కన్నడ భాషలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతుంది. త్వరలోనే కన్నడతో పాటు.. తెలుగు, తమిళం , మలయాళం , హింది భాషల్లోనూ రిలీజ్ చేయనున్నారని సమాచారం.
ఇక కరటక దమనక సినిమా కథ విషయానికొస్తే.. ఈ సినిమాలో కరటక శివరాజ్ కుమార్ పేరు. దమనక అంటే ప్రభుదేవ పేరు. ఈ కథ అంతా కూడా వీరిద్దరి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. వీరిద్దరూ ఓ నేరంలో జైలు శిక్షను అనుభవిస్తూ ఉంటారు. వీరిద్దరూ జైల్లో అందరితో మంచిగా ఉంటూ ఉంటారు. వీరి మంచి తనాన్ని జైలర్ రమేష్ గమనించి.. వారికి ఓ బాధ్యతను అప్పగిస్తాడు. జైలర్ రమేష్ తల్లి దండ్రులు పల్లెటూరిలో ఉంటూ ఉంటారు. సిటీ కి రమ్మని ఎన్ని సార్లు చెప్పినా కానీ వారు రారు. దీనితో వారిని ఎలాగైనా సిటీకి తీసుకుని వస్తే.. వారిని జైలు నుంచి విడిపిస్తానని చెప్తాడు. ఈ డీల్ కు కరటక, దమనక ఇద్దరూ ఒప్పుకుంటారు. వెంటనే జైలర్ తల్లిదండ్రులు ఉంటున్న నందికోలురు అనే ఊరికి వెళ్తారు. ఆ ఊరికి వెళ్లిన తర్వాత వీరిద్దరికి ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి ? అక్కడ ఏం జరిగింది ? హీరోయిన్స్ పాత్రలు ఏంటి ? అనేది ఈ సినిమా కథ. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.