Swetha
Purushottamudu Telugu Movie OTT Details: సినిమాలు ఇలా థియేటర్ లో రిలీజ్ అయినా వెంటనే.. ఆయా సినిమాలా ఓటీటీ స్ట్రీమింగ్ పార్ట్నర్స్ ఫిక్స్ అయిపోతున్నాయి. అలాగే నెలరోజులలోపే ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా రాజ్ తరుణ్ నటించిన మూవీ కూడా ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయినట్లు బజ్ వినిపిస్తుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Purushottamudu Telugu Movie OTT Details: సినిమాలు ఇలా థియేటర్ లో రిలీజ్ అయినా వెంటనే.. ఆయా సినిమాలా ఓటీటీ స్ట్రీమింగ్ పార్ట్నర్స్ ఫిక్స్ అయిపోతున్నాయి. అలాగే నెలరోజులలోపే ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా రాజ్ తరుణ్ నటించిన మూవీ కూడా ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయినట్లు బజ్ వినిపిస్తుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Swetha
థియేటర్ లో రిలీజ్ అయినా సినిమాలన్నీ కూడా కాస్త ఆలస్యం అయినా సరే.. ఓటీటీ లోకి రావాల్సిందే. ఇక ఈ మధ్య కాలంలో థియేటర్ లో రిలీజ్ అయినా నెల రోజులలోపే ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నాయి. దీనితో అది భారీ హైప్ ఉన్న సినిమా అయితే తప్ప.. ప్రేక్షకులు థియేటర్స్ కు వెళ్లే ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఇలా ప్రస్తుతం ఓటీటీ లకు క్రేజ్ బాగా పెరుగుతుంది. ఈ క్రమంలో తాజాగా రాజ్ తరుణ్ నటించిన “పురుషోత్తముడు” మూవీ.. థియేటర్ లో రిలీజ్ అయ్యి.. నెల కాకముందే ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయినట్లు సమాచారం. మరి ఈ మూవీ ఎప్పటినుంచి.. ఏ ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ కానుంది అనే విషయాలను చూసేద్దాం.
రాజ్ తరుణ్ కు సరైన హిట్ పడి చాలా కాలమే అయింది. ఈ క్రమంలో ఈసారైనా తన అదృష్టాన్ని పరీక్షించుకుందాం అని.. వారం వ్యవధిలోనే బ్యాక్ టు బ్యాక్ థియేట్రికల్ రిలీజెస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ అనుకోని విధంగా రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇప్పుడు వీటిలో జూలై 26న థియేటర్ లో రిలీజ్ అయినా “పురుషోత్తముడు” మూవీ… ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయినట్లు సమాచారం. రిలీజ్ కు ముందు కాస్త పాజిటివ్ బజ్ ఏర్పడినా కానీ.. మూవీ రిలీజ్ తర్వాత మాత్రం డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసినట్లు.. ఆగష్టు 23 నుంచి స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది.
ఇక సినిమా కథ విషయానికొస్తే.. రాజ్ తరుణ్ ఈ మూవీలో ఓ కోటీశ్వరుడు కొడుకు.. లండన్ లో చదువు పూర్తి చేసుకుని ఇండియాకు తిరిగి వస్తాడు. దీనితో అతని తండ్రి రాజ్ తరుణ్ కు తన కంపనీ భాద్యతలు అప్పగించాలని అనుకుంటాడు. కానీ దానికి రమ్య కృష్ణ అడ్డు చెప్తుంది. ఆ కంపెనీ రూల్ ప్రకారం.. సీఈఓ కాబోయే వ్యక్తి 100 రోజులు ఓ సామాన్యుడిలా బ్రతకాలనే కండిషన్ పెడుతుంది. దీనితో రాజ్ తరుణ్ సిటీ కి దూరంగా రాయపులంక అనే పల్లెటూరికి వెళ్తాడు. అక్కడకు వెళ్లిన తర్వాత అతనికి ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి? అతను అనుకున్నది సాదించాడా లేదా ? ఈ క్రమంలో అతనికి, హీరోయిన్ కు ఎలా పరిచయం ఏర్పడింది ? అనేది మిగిలిన కథ. మరి ఈ సినిమా ఓటీటీ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.