iDreamPost
android-app
ios-app

OTTలోకి సరికొత్త లవ్ స్టోరీ.. ఎక్కడ స్ట్రీమింగ్ అంటే?

ప్రతి వారంలానే ఈ వారం కూడా పలు సినిమాలు ఓటీటీలో సందడి చేస్తున్నాయి. క్రైమ్, హారర్, థ్రిల్లర్ కాకుండా రొమాంటిక్ చిత్రాల కోసం చూస్తున్నారా.? అయితే ఇప్పుడో మూవీ ఓటీటీలో సందడి చేస్తుంది. ఎక్కడంటే...

ప్రతి వారంలానే ఈ వారం కూడా పలు సినిమాలు ఓటీటీలో సందడి చేస్తున్నాయి. క్రైమ్, హారర్, థ్రిల్లర్ కాకుండా రొమాంటిక్ చిత్రాల కోసం చూస్తున్నారా.? అయితే ఇప్పుడో మూవీ ఓటీటీలో సందడి చేస్తుంది. ఎక్కడంటే...

OTTలోకి సరికొత్త లవ్ స్టోరీ.. ఎక్కడ స్ట్రీమింగ్ అంటే?

కల్కి 2898ఏడీ తప్ప.. థియేటర్లలో పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు కూడా ఏమీ లేవు. మరీ ఈ వీకెండ్ ఎలా గడుస్తుంది అనుకునే మూవీ లవర్స్‌కు బెస్ట్ ఛాయిస్ ఓటీటీలు. ప్రతి వారంలాగానే ఈ వీక్ కూడా ఓటీటీలో పలు సినిమాలు సందడి చేస్తున్నాయి. అయితే చాలా మంది హారర్, క్రైమ్, థ్రిల్లర్ జోనర్ల వైపు చూస్తుంటారు. సరికొత్తగా ప్రజెంట్ చేయడంతో వీటిపై ఆసక్తి చూపుతుంటారు. ఇక సిరీస్ పూర్తి చేయకుండా చూసేవాళ్లు కూడా ఉన్నారు. నాలుగు, ఐదు గంటలైనా కంప్లీట్ చేయకపోతే నిద్రపట్టదు కొందరికీ. అలాగే రొమాంటిక్ మూవీస్ కోసం ఈగర్లీ వెయిట్ చేసే వాళ్లు కూడా ఉన్నారు. ఇలాంటి చిత్రాలను పేరెంట్స్ లేదా పిల్లలతో కలిసి చూడలేం. కానీ కొన్ని ఆకట్టుకుంటూ ఉంటాయి. మరికొన్ని ఓకే అనిపిస్తుంటాయి.

ఇప్పుడు అలాంటి ఓ చిన్న సినిమాలో ఓటీటీ సందడి చేసేందుకు వచ్చేసింది. ఇది డిజిటల్ స్ట్రీమింగ్ కోసమే తీసిన చిత్రంలా కనిపిస్తుంది. అదే ప్రేమ గీమ తస్సాదియ్యా.. ఏంటీ చిరంజీవి సినిమాలో పాటనుకుంటున్నారా..? సినిమా పేరండీ బాబు..? గతంలో ఈ మూవీ ట్రైలర్ విడుదల చేశారు. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఎయిర్ టైల్ ఎక్స్ ట్రీమ్ ఫ్లాట్ ఫాంలో స్ట్రీమింగ్ అవుతుంది. సినిమా తీయాలన్న కసితో ఓ వ్యక్తి ఈ మూవీని తెరకెక్కించాడు. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, లిరిక్స్, మ్యూజిక్ అండ్ డైరెక్టర్ అండ్ హీరో కూడా కిరణ్ నైరుద్. నైరుద్ మూవీ ప్రొడక్షన్ పై ఈ మూవీ తెరకెక్కింది. గంట నలభై ఐదు నిమిసాల ఫ్లాట్‌తో తెరకెక్కించాడు.

బేస్ట్ ఆన్ ట్రూ ఈవెంట్స్ తో ఈ చిన్న సినిమాను తెరకెక్కించినట్లు ట్రైలర్‌లో చెప్పుకొచ్చాడు దర్శకుడు. ఇందులో సీనియర్ నటుడు శుభలేక సుధాకర్, జబర్థస్త్ యాక్టర్స్ నటించారు. హీరోయిన్ సౌమ్య పాండే. మిగిలిన వాళ్లంతా కొత్త యాక్టర్లే. మూవీ మీద ఫ్యాషన్‌తో తీసిన సినిమా ఇది. కాస్తంత ప్రొడక్షన్ వాల్యూస్ తక్కువగా కనిపిస్తాయి. స్టోరీని గ్రిప్పింగా అనిపించినా.. తెరకెక్కించడంలో  తడబడ్డాడు దర్శకుడు. అయితే చేసిన ఎంటప్ట్ మెచ్చుకోదగినది. ఇక స్టోరీ విషయానికి వస్తే.. కృష్ణా జిల్లాలో మొదలౌతుంది ఈ కథ. సెటిల్ కానీ ఓ కుర్రాడ్ని పేరెంట్స్ తిట్టడంతో.. శపథం చేసి ఇంట్లో నుండి వెళ్లిపోతాడు. ఇంతకు ఆ శపథం ఏంటో తెలియాలంటే.. సినిమా చూసేయండి. ఈ సినిమకు ఐడీఎంబీ రేటింగ్ ఎంతో తెలుసా..? 8.9. చూసిన చూసి ఎలా ఉందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.