Tirupathi Rao
OTT Weekend Suggestions- Best Horror Movie Sissy: ఓటీటీలో మీరు ఒక మంచి.. వణికించే హారర్ చిత్రం చూడాలి అనుకుంటే మాత్రం ఈ మూవీ మీకోసమే. అయితే ఈ మూవీ చూస్తున్నంతసేపు మీకు భయం మాత్రం పుడుతుంది.
OTT Weekend Suggestions- Best Horror Movie Sissy: ఓటీటీలో మీరు ఒక మంచి.. వణికించే హారర్ చిత్రం చూడాలి అనుకుంటే మాత్రం ఈ మూవీ మీకోసమే. అయితే ఈ మూవీ చూస్తున్నంతసేపు మీకు భయం మాత్రం పుడుతుంది.
Tirupathi Rao
హారర్ చిత్రం.. ఈ పేరు వింటనే చాలా మంది వణికిపోతారు. కానీ, వణుకుతూ కూడా హారర్ మూవీ చూడాల్సిందే అనుకుంటారు. నిజానికి అదొక బ్యాడ్ హ్యాబిట్ కానీ.. వదులుకోవడం కష్టం. కనీసం వారానికి ఒక హారర్ చిత్రం చూడకపోతే నిద్రపట్టని ప్రేక్షకులు కూడా ఉంటారు. అలాంటి వారి కోసం ఒక బెస్ట్ హారర్ చిత్రం తీసుకొచ్చాం. ఇది అలాంటి ఇలాంటి మూవీ కాదండోయ్.. స్టార్ట్ చేస్తే ఆపడం కష్టం. అలాగే కాన్సెప్ట్ కి వణకకుండా ఉండటం కూడా కష్టమే. ఇదంతా ఒక అమ్మాయి చుట్టూ తిరుగుతూ ఉండే కథ. ఆమె ఒక్కతే తన ఫ్రెండ్స్ అందరినీ ఏం చేసింది అనే పాయింట్ మీద ఎంతో హారర్ ఎలిమెంట్స్ తో సాగుతూ ఉంటుంది.
ఈ మూవీలో హీరోయిన్ ఒక టీనేజ్ గర్ల్. అలాగే తాను ఒక సోషల్ మీడియాలో ఇన్ ఫ్లుఎన్సర్ కూడా. తన మాటలతో ఎంతో మందిని సరైన మార్గంలో గైడ్ చేస్తూ ఉంటుంది. అలాగే ఆమె చాలా ఫేమస్ కూడా. అయితే ఆమెకు ఒకరోజు సడెన్ గా తన చిన్ననాటి ఫ్రెండ్ కనిపిస్తుంది. ఆమెపై ఎంతో ప్రేమ ఉన్నట్లు మాటలు కలుపుతుంది. అలాగే తన గురించి చాలా విషయాలు అడిగి తెలుసుకుంటుంది. ఆమెను తనతో పాటుగా అవుటింగ్ కి రావాలి అని ఒత్తిడి చేస్తుంది. తన ఫ్రెండ్ మాటలు నమ్మి సిస్సీ ఆ పార్టీకి వెళ్తుంది. కొందరు ఫ్రెండ్స్ అందరూ కలిసి కాస్త దూరంగా ఉండే ప్రాంతానికి పార్టీ కోసం వెళ్తారు. అక్కడికి వెళ్లిన తర్వాత ఇన్వైట్ చేసిన ఫ్రెండే సిసిలియాతో కోపంగా మాట్లాడటం స్టార్ట్ చేస్తుంది.
నిజానికి వీళ్ల జీవితాల్లో చాలానే రహస్యాలు ఉంటాయి. వాళ్ల చిన్నప్పుడు చేసిన కొన్ని పనులకు సంబంధించి సిస్సీని ఇబ్బంది పెడుతూ ఉంటారు.
నిజానికి ఆమె వాటి గురించి మాట్లాడాలి అనుకోదు. కానీ, ఫ్రెండ్స్ మాత్రం పదే పదే అదే విషయాలను గుర్తు చేస్తూ ఉంటారు. అక్కడి నుంచే అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది. సిసిలియా ప్రవర్తనలో మార్పు వస్తుంది. అసలు ఆమెకు ఎం జరిగింది అనే విషయం ఎవరికీ తెలియదు. చూడటానికి కాస్త వింతగా ప్రవర్తిస్తూ ఉంటుంది. వచ్చిన వాళ్లకు కూడా అది అర్థం కాదు. ఎంతో ప్రశాంతంగా ఉండే సిస్సీ అలా ఎందుకు మారిపోయిందో ఎవరికీ తెలియదు. తనను ఇన్వైట్ చేసిన ఫ్రెండ్ ని కట్టేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు చిన్నప్పుడు వీళ్లు ఏం చేశారు? సిసిలియా ఎలా మారిపోయింది? ఈ విషయాలు తెలియాలి అంటే మీరు ఈ ‘సిస్సీ’ అనే సినిమా చూడాల్సిందే. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో ఉంది. కానీ, ఇండియాలో స్ట్రీమింగ్ కావట్లేదు. కానీ, మీరు ది ఫ్లిక్సర్ అనే వెబ్ సైట్ లో ఈ మూవీని చూడచ్చు. ఈ మూవీని చూసేందుకు క్లిక్ చేయండి.