iDreamPost
android-app
ios-app

OTT లో బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఎగ్జామ్’.. క్లైమాక్స్ లో ట్విస్ట్ కోసం మూవీ చూడాల్సిందే

  • Published Aug 23, 2024 | 3:15 AM Updated Updated Aug 23, 2024 | 3:15 AM

OTT Best Suspense Thriller Exam: హర్రర్, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ ను ఎంత ఇంట్రెస్టింగ్ గా చూస్తారో... సస్పెన్స్ డ్రామాస్ ను కూడా అంతే ఇంట్రెస్టింగ్ గా చూస్తూ ఉంటారు. ఇప్పటివరకు ఎన్నో సస్పెన్స్ డ్రామాస్ ను చూసి ఉంటారు కానీ.. ఇలాంటి మూవీని మాత్రం చూసి ఉండరు. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేయండి.

OTT Best Suspense Thriller Exam: హర్రర్, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ ను ఎంత ఇంట్రెస్టింగ్ గా చూస్తారో... సస్పెన్స్ డ్రామాస్ ను కూడా అంతే ఇంట్రెస్టింగ్ గా చూస్తూ ఉంటారు. ఇప్పటివరకు ఎన్నో సస్పెన్స్ డ్రామాస్ ను చూసి ఉంటారు కానీ.. ఇలాంటి మూవీని మాత్రం చూసి ఉండరు. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేయండి.

  • Published Aug 23, 2024 | 3:15 AMUpdated Aug 23, 2024 | 3:15 AM
OTT లో బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఎగ్జామ్’.. క్లైమాక్స్ లో ట్విస్ట్ కోసం మూవీ చూడాల్సిందే

చూసే తీరిక ఉండాలే కానీ ఓటీటీ లో లెక్క పెట్టలేనన్ని సినిమాలు ఉన్నాయి. హర్రర్ , సస్పెన్స్ , ఇన్వెస్టిగేషన్ ఇలా రకరకాల జోనర్స్ లో ఎన్నో సినిమాలు .. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాయి. అయితే హర్రర్ , ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమాలను ప్రేక్షకులు ఎంత ఇంట్రెస్టింగ్ గా చూస్తారో.. సస్పెన్స్ డ్రామాస్ ను కూడా అంతే ఇంట్రెస్టింగ్ గా చూస్తూ ఉంటారు. ఇప్పటివరకు ఎన్నో సినిమాలను చూసి ఉంటారు కానీ ఇలాంటి సినిమాను మాత్రం చూసి ఉండరు. ఈ మూవీ కచ్చితంగా థ్రిల్లింగ్ ఎక్స్పీరియెన్స్ ఇస్తుంది. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాను మీరు చూశారా లేదా ఓసారి చెక్ చేసేయండి.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఈ మూవీలో 8 మంది వ్యక్తులు ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారు. వారంతా కూడా ఫైనల్ రౌండ్ కు క్వాలిఫై అవుతారు . అందరూ ఒక రూమ్ లోకి వెళ్తారు. అక్కడ 8 టేబుల్స్ ఉంటాయి. అలాగే వీరిని గమనించడానికి ఆ రూమ్ లో ఒక సీసీ కెమెరా కూడా ఉంచుతారు. వెంటనే ఓ గన్ మ్యాన్ కూడా వస్తాడు. దీనితో ఆ పరిస్థితులను చూసి వారంతా కాస్త నెర్వస్ ఫీల్ అవుతారు. ఇక ఆ తర్వాత ఒక ఇన్విజిలేటర్ అక్కడకు వచ్చి.. మీ 8 మంది మాత్రమే ఈ రౌండ్ వరకు క్వాలిఫై అయ్యారని.. ఇక్కడ మీకు కేవలం ఒకే ఒక్క ప్రశ్న ఉంటుందని.. దానికి 80 నిమిషాల సమయం మాత్రమే ఉంటుందని చెప్తాడు. అలాగే 3 రూల్స్ ను చెప్తాడు. అవేంటంటే గార్డ్ తో ఎవరు మాట్లాడుకోకూడదు, ప్రశ్న పాత్రలను పాడు చేయకూడదు, సమయం అయ్యేంత వరకు ఎవరు ఆ హాల్ నుంచి బయటకు వెళ్ళకూడదని చెప్పి బయటకు వెళ్ళిపోతాడు.

కట్ చేస్తే.. అందరూ ప్రశ్న పత్రాన్ని ఓపెన్ చేస్తారు. కానీ దానిలో ఒక ప్రశ్న కూడా ఉండదు. దీనితో అందరూ ఆశ్చర్య పోతారు. ఒక ప్రశ్న ఉంటుందన్నారు కదా ఇక్కడ ఏమి లేదని అనుకుంటూ ఉంటారు. ఒక అమ్మాయి ఆ పేపర్ మీద నేను ఈ జాబ్ కు తగిన దానిని అని రాస్తుంది. వెంటనే గార్డ్ ఆమెను బయటకు పంపించేస్తాడు. ఎందుకంటే ఆమె క్వశ్చన్ పేపర్ ను స్పాయిల్ చేసింది. దీనితో మిగిలిన వారంతా జాగ్రత్త పడతారు. అప్పుడు మిగిలిన వారు ఒకరితో ఒకరు కో ఆర్డినేట్ అయ్యి.. ముందు ప్రశ్న ఏంటో క్రాక్ చేద్దాం అని అనుకుంటారు. అందరూ మాట్లాడుకుంటూ ఉంటే.. ఒక వ్యక్తి మాత్రం సైలెంట్ గా కూర్చుంటాడు. అలా అందరూ ప్రశ్నను కనిపెట్టడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. కానీ కనిపెట్టలేకపోతారు. అసలు ఆ పేపర్ మీద ఉండే ప్రశ్న ఏంటి ? వారంతా ఆ ప్రశ్నను కనుకున్నారా లేదా? వారిలో ఎవరు క్వాలిఫై అయ్యారు ? అసలు ఆ ప్రశ్న ఏంటి ? ఆ తర్వాత ఏమైంది ? ఇవన్నీ తెలియాలంటే ‘ఎగ్జామ్’ అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం యాపిల్ టీవీ ప్లస్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే యూట్యూబ్ లో కూడా అందుబాటులో ఉంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ సినిమా చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.