iDreamPost
android-app
ios-app

కోవిడ్ ను 10ఏళ్ళ ముందే చూపించిన ‘కాంటాజియన్’ మూవీ.. OTT లో ఉంది చూశారా!

  • Published Aug 23, 2024 | 5:23 AM Updated Updated Aug 23, 2024 | 5:23 AM

OTT Suspense Drama Contagion: 2020 లో వచ్చిన కరోనా, లాక్ డౌన్ , క్వారంటైన్ ఇవన్నీ జీవితంలో ఎవరు మర్చిపోలేరు. అయితే ఆ సమయంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారో వాటి అన్నిటిని 2011 లోనే ఓ సినిమాలో చూపించారు. మరి ఈ సినిమా ఏంటో ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓసారి చెక్ చేసేయండి.

OTT Suspense Drama Contagion: 2020 లో వచ్చిన కరోనా, లాక్ డౌన్ , క్వారంటైన్ ఇవన్నీ జీవితంలో ఎవరు మర్చిపోలేరు. అయితే ఆ సమయంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారో వాటి అన్నిటిని 2011 లోనే ఓ సినిమాలో చూపించారు. మరి ఈ సినిమా ఏంటో ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓసారి చెక్ చేసేయండి.

  • Published Aug 23, 2024 | 5:23 AMUpdated Aug 23, 2024 | 5:23 AM
కోవిడ్ ను 10ఏళ్ళ ముందే చూపించిన ‘కాంటాజియన్’ మూవీ.. OTT లో ఉంది చూశారా!

కొన్ని సంఘటనలు జీవితంలో చాలా మంది అసలు మర్చిపోలేరు. అలాంటి వాటిలో ఒకటి కోవిడ్-19.. ఆ సమయంలో దేశంలోని ప్రజలంతా ఎంత ఇబ్బంది పడ్డారో ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే.. 2020 లో వచ్చిన ఈ వ్యాధి గురించి ఆల్రెడీ 2011 లోనే ఓ సినిమాలో చూపించారు. ఈ సినిమా చూస్తే కచ్చితంగా అందరికి లాక్ డౌన్ డేస్ గుర్తొస్తాయి. ఈ సినిమాను ఇప్పటి వరకు చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి . మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో.. ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓసారి చెక్ చేసేయండి .

ఈ సినిమా కథ విషయానికొస్తే.. సినిమా డే 2 నుంచి స్టార్ట్ అవుతుంది. డే 1 ఏం జరిగింది అనేది సస్పెన్స్. బెత్ తన హాంగ్ కాంగ్ ట్రిప్ ను ముగించుకుని.. తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ను మీట్ అయ్యి తిరిగి ఇంటికి వస్తుంది. రెండు రోజుల తర్వాత ఆమె తన ఇంట్లో మూర్ఛ వచ్చి పడిపోతుంది. తన హస్బెండ్ మిచ్ ఆమెను హాస్పిటల్ కు తీసుకువెళ్తాడు. కానీ ఆమె ఎదో తెలియని డిసీజ్ కారణంగా చనిపోయిందని డాక్టర్స్ చెప్తారు. మిచ్ ఇంటికి తిరిగి రాగానే అతని కొడుకు కూడా అదే విధంగా చనిపోయి ఉంటాడు. తనకు కూడా ఇన్ఫెక్షన్ సోకిందేమో అనే అనుమానంతో అతనిని ఐసోలేషన్ లో ఉంచుతారు. అలాగే దేశంలో అనేక చోట్ల ఇలాంటి లక్షణాలతోనే చాలా మంది చనిపోతూ ఉంటారు. డిపార్ట్మెంట్ అఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ దీనిపై స్పెషల్ ఫోకస్ పెడతారు. దీని గురించి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్ లో ఈ వ్యాధి బెత్ నుంచి స్టార్ట్ అయిందని కన్ఫర్మ్ చేస్తారు.

అంతే కాకుండా ఇది ఒకరి నుంచి ఒకరికి సోకుతుందని.. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని.. హెచ్చరిస్తారు. ఇక మిచ్ కు ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉండడంతో అతనిని హోమ్ క్వారంటైన్ లో ఉండమని చెప్తారు. అలాగే అక్కడ సిటీ మొత్తానికి లాక్ డౌన్ విధిస్తారు. ప్రజలంతా నితయవసర వస్తువుల కోసం చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అక్కడి గవర్నమెంట్ సాధ్యమైనంత వరకు అన్నిటిని సప్లై చేస్తూనే ఉంటుంది. ఇక ఆ వైరస్ పందులు , గబ్బిలాల జెనిటిక్ మెటీరియల్ మిక్స్ అని గుర్తిస్తారు. రోజులు గడుస్తున్న కొద్దీ ఆ వైరస్ వలన చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? దానికి వ్యాక్సిన్ కనిపెట్టారా లేదా అనేదే ఈ సినిమా కథ. ఈ సినిమా పేరు “కాంటాజియన్”. ఈ సినిమా ప్రస్తుతం జియో సినిమా ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటి వరకు ఈ సినిమాను చూడకపోతే.. వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ సినిమా చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.