Swetha
OTT Feel Good Emotional Drama : ఎమోషనల్ బ్యాక్డ్రాప్ లో వచ్చే మూవీస్ మంచి ఫీలింగ్ ను కలిగిస్తాయి. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా ఇలాంటిదే. ఇదొక డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ. ఈ మూవీ చూస్తే ఖచ్చితంగా ఎవరైనా సరే ఎమోషనల్ అవ్వాల్సిందే.
OTT Feel Good Emotional Drama : ఎమోషనల్ బ్యాక్డ్రాప్ లో వచ్చే మూవీస్ మంచి ఫీలింగ్ ను కలిగిస్తాయి. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా ఇలాంటిదే. ఇదొక డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ. ఈ మూవీ చూస్తే ఖచ్చితంగా ఎవరైనా సరే ఎమోషనల్ అవ్వాల్సిందే.
Swetha
కామెడీ , హర్రర్ , సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ తో పాటు ఎమోషనల్ మూవీస్ కు కూడా మంచి ఫాలోయింగ్ ఉంటుంది. ఈ క్రమంలో ఇప్పుడు చెప్పుకోబోయే మూవీని ఇప్పటివరకు ఎవరు చూసి ఉండరు. ఇదొక డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ. ఈ సినిమా చూసిన తర్వాత ఎవరైనా ఎమోషనల్ అవ్వాల్సిందే. ఎంత హర్రర్ సస్పెన్స్ సినిమాలు చూసిన కానీ.. అప్పుడప్పుడు ఇలాంటి మూవీస్ కూడా చూడాలని ప్రేక్షకులు సెర్చ్ చేస్తూ ఉంటారు అలాంటి వారికి ఈ మూవీ ఓ బెస్ట్ ఛాయిస్ అని చెప్పుకోవచ్చు . మరి ఈ మూవీ ఏంటి.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాను మీరు చూశారా లేదా.. అనే విషయాలను చూసేయండి.
ఈ సినిమా కథ విషయానికొస్తే.. మూవీ స్టార్టింగ్ లో స్వాతంత్రం ముందు సమయాన్ని చూపిస్తారు. అక్కడ హరి అనే ఓ బ్రాహ్మణ కుటుంబాన్ని చూపిస్తూ ఉంటారు. హరి తన తమ్ముడు మహాదేవ్ కు పెళ్లి చేయాలనీ అనుకుంటాడు. మహాదేవ్ కు పెళ్లి ఇష్టం లేకపోయినా సరే.. అన్న కోసం వదిన కోసం ఒప్పుకుంటాడు. ఈ క్రమంలో హరి , మహాదేవ్ దుర్గ అనే అమ్మాయిని చూడడానికి వెళ్తాడు. కానీ దుర్గ ఏమో హరిని పెళ్ళికొడుకు అనుకుంటుంది. కానీ తర్వాత మహాదేవ్ అని తెలుస్తుంది. వారికి పెళ్లి అయిపోతుంది. అయితే అప్పటికి దుర్గ వయసుకు రాకపోడంతో.. మహాదేవ్ దుర్గ దూరంగా ఉండాలని పెద్దలు నిర్ణయిస్తారు. అలా కొద్దీ రోజులు వారిద్దరూ దూరంగా ఉంటారు. కట్ చేస్తే కొద్దీ రోజుల తర్వాత.. దుర్గ వయసుకు వస్తుంది. అలాగే మహాదేవ్ కూడా చదువు పూర్తి చేసుకుని ఇంటికి వస్తాడు. ఇక మహాదేవ్ , దుర్గ కలిసి కొత్త జీవితం ప్రారంభిద్దాం అనుకునే లోపు.. అప్పటికే ఒంట్లో నలతగా ఉన్న మహాదేవ్ హఠాత్తుగా మరణిస్తాడు.
దీనితో వారి ఆచార వ్యవహారాల ప్రకారం క్రతువులు జరిపిస్తారు. కానీ దుర్గకు మాత్రం వింతంతు చర్యలు పూర్తిగా జరిపించరు. ఇక దుర్గ అదే ఇంట్లో ఉంటూ ఇంటి పనులు చేసుకుంటూ.. హరి భార్యకు తోడుగా ఉంటూ ఉంటుంది. అలా రోజులు గడిచిపోతాయి. కట్ చేస్తే.. కొద్దీ రోజులకు హరి భార్య ఆరోగ్యం చెడిపోతుంది. అయితే హరి భార్య.. హరికి దుర్గ కు మధ్య ఎదో నడుస్తుంది అని అనుకుంటుంది. కానీ అదంతా నిజం కాదు. అలాగే ఆమె తాను చనిపోయిన తర్వాత హరిని, దుర్గ ను పెళ్ళి చేసుకోమని చెప్తుంది. కానీ దానికి ఇద్దరు ఒప్పుకోరు. కొన్ని రోజులకు హరి భార్య చనిపోతుంది. ఆ తర్వాత హరి తన కొడుకు , కూతుళ్ళకు పెళ్లి చేస్తాడు. అయితే అప్పటినుంచి హరి , దుర్గ ను దారుణంగా చూస్తాడు. అసలు ఏం జరిగింది ? వీరిద్దరి మధ్య ఏమై ఉంటుంది ? హరి దుర్గ ను పెళ్లి చేసుకుంటాడా లేదా ? చివరికి కథ ఎలా ముగిసింది ? దుర్గ జీవితం ఎలా సాగుతుంది ? ఇవన్నీ తెలియాలంటే “కక్స్పర్ష్” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం జీ5 లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాను ఇప్పటివరకు చూడకపోతే వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఈ మూవీ చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.
ఇది కూడా చూడండి.. వీళ్లు ఆడవాళ్లు కాదు కిలేడీలు.. OTTలో క్రేజీ థ్రిల్లర్!