iDreamPost
android-app
ios-app

వీళ్లు ఆడవాళ్లు కాదు కిలేడీలు.. OTTలో క్రేజీ థ్రిల్లర్!

OTT Suggestions- Best Watch Alone Movie Hustlers: ఓటీటీలో మీకు చాలానే సినిమాలు కనిపిస్తాయి. కానీ, అన్నీ మీకు నచ్చకపోవచ్చు. కొన్ని సినిమాలు మాత్రం మైండ్ లో నుంచి పోవు. అలాంటిదే ఈ మూవీ కూడా.

OTT Suggestions- Best Watch Alone Movie Hustlers: ఓటీటీలో మీకు చాలానే సినిమాలు కనిపిస్తాయి. కానీ, అన్నీ మీకు నచ్చకపోవచ్చు. కొన్ని సినిమాలు మాత్రం మైండ్ లో నుంచి పోవు. అలాంటిదే ఈ మూవీ కూడా.

వీళ్లు ఆడవాళ్లు కాదు కిలేడీలు.. OTTలో క్రేజీ థ్రిల్లర్!

మీరు రియల్ లైఫ్ లో కొందరు ఆడవాళ్ల గురించి చాలానే వార్తలు విని ఉంటారు. ఆడవాళ్లు మోసం చేశారని.. డబ్బులు కాజేశారు అని.. అందం ఎరచూపి నిండా ముంచేశారు అని వార్తలు వినే ఉంటారు. అచ్చం అలాంటి వార్తలకు తగినట్లుగా సాగే కథే ఇప్పుడు చెప్పుకునే సినిమా. ఇందులో అందంతో ఎలా మోసం చేస్తారు? ఎంత మందిని కోట్లకు కొల్లగొడతారు.. ఎన్ని ఆర్థిక నేరాలు చేస్తారు అనే విషయాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. పైగా వాళ్లు తాము చేసే పనులను సమర్థించుకుంటారు కూడా. వాళ్లు ఒకరి దగ్గర దోచుకుంటే.. మేము వాళ్లని దోచుకున్నాం అంటూ సమర్థించుకోవడం గమనార్హం. అసలు ఆ సినిమా ఏది? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోందో చూద్దాం.

మీరు రియల్ లైఫ్ ఇలాంటి కిలేడీలను చూశారో లేదో గానీ.. సినిమాలో మాత్రం వాళ్లని చూస్తే నోరెళ్లబెట్టేస్తారు. మొదట వాళ్లు వారి కుటుంబ పోషణ కోసం పోల్ డ్యాన్సర్స్ గా తమ కెరీర్ ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత అది కాస్తా పురుషులకు సుఖా*న్ని పంచే వరకు వెళ్తుంది. అయితే వాళ్లు ఎంత కష్టపడ్డా కూడా వారికి దక్కే ఆదాయం చాలా తక్కువ. వారికి ఉపాధి కల్పించే క్లబ్ ఓనర్సే వచ్చిన మొత్తాన్ని లాగేసుకుంటారు. వీరికి రోజు కూలీ లెక్క ఇస్తారు. ఇదంతా చూసిన తర్వాత ఆ లేడీస్ కి ఒక ఆలోచన వస్తుంది.

అసలు వీళ్లు ఇచ్చే సొమ్ము కోసం ఆశ పడేది ఏంటి? మనమే సొమ్ము చేసుకుందాం అంటారు. ఈ సినిమా అంతా పోల్ డ్యాన్సర్స్ లైఫ్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. వారిపై కుటుంబ పోషణ భారం పడుతంది. ఎలా సంపాదిచాలో తెలియదు. ఎలాగైనా కుటుంబానికి తిండి పెట్టాలి. అలాంటి సమయంలో పోల్ డ్యాన్సర్స్ గా మారతారు. అయితే ఆ తర్వాత అక్కడకు వచ్చే బిగ్ షాట్స్ కి మందు తాగించి.. మైకంలోకి వెళ్లిన తర్వాత వారిని లూటీ చేస్తారు. వారి వద్దనున్న నగదు, ఖరీదైనా వస్తువులు మాత్రమే కాకుండా.. చెక్కుల మీద సంతకాలు తీసుకుని ఖాతాలు ఖాళీ చేస్తారు.

అలాంటి ఆడవాళ్లకు ఆ తర్వాత అసలు కష్టాలు స్టార్ట్ అవుతాయి. పోలీసులు వీరిని టార్గెట్ చేస్తారు. వీరిని అరెస్టు కూడా చేస్తారు. అలాంటి పరిస్థితుల నుంచి ఎలా తప్పించుకున్నారు? అసలు వాళ్లు ఎలా దొరికారు? వాళ్లు కాజేసిన కోట్లు మొత్తం ఏమయ్యాయి? ఇలాంటి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చాలానే ఉన్నాయి. ఈ సినిమా పేరు ‘హస్లెర్స్’. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ లైన్స్ గేట్ లో అందుబాటులో ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో రూ.69కు రెంట్ బేసిస్ మీద అందుబాటులో ఉంది. అయితే ఈ మూవీ కాస్త్ బో*ల్డ్ గా ఉంటుంది. కాబట్టి ఒంటరిగా చూస్తే చాలా బెటర్. ఈ మూవీ చూసేందుకు క్లిక్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి