iDreamPost
android-app
ios-app

OTT లో మహారాజ లాంటి బెస్ట్ సస్పెన్స్ డ్రామా ‘ఇంహెరిటెన్స్’.. చూశారా!

  • Published Aug 23, 2024 | 7:30 AM Updated Updated Aug 27, 2024 | 5:34 PM

OTT Best Suspense Thriller 'Inheritance' : సస్పెన్స్ డ్రామాలలో ఈ మధ్య కాలంలో ప్రేక్షకులను బాగా థ్రిల్ చేసిన సినిమా ఏదైనా ఉందంటే అది మహారాజ. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ దాదాపు అలానే ఉంటుంది. మరి ఈ మూవీ ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేయండి.

OTT Best Suspense Thriller 'Inheritance' : సస్పెన్స్ డ్రామాలలో ఈ మధ్య కాలంలో ప్రేక్షకులను బాగా థ్రిల్ చేసిన సినిమా ఏదైనా ఉందంటే అది మహారాజ. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ దాదాపు అలానే ఉంటుంది. మరి ఈ మూవీ ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేయండి.

  • Published Aug 23, 2024 | 7:30 AMUpdated Aug 27, 2024 | 5:34 PM
OTT లో మహారాజ లాంటి బెస్ట్ సస్పెన్స్ డ్రామా ‘ఇంహెరిటెన్స్’.. చూశారా!

సస్పెన్స్ డ్రామాస్ లో అనేక రకాల ప్లాట్స్ ఉంటూ ఉంటాయి. అందుకే ప్రేక్షకులు ఈ జోనర్ లో వచ్చే సినిమాలన్నిటిని చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తూ ఉంటారు . ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా ఇలాంటిదే. ఈ మూవీ స్టార్ట్ చేస్తే చివరి వరకు అసలు స్కిప్ చేయాకుండా చూస్తారు. ఈ మధ్య కాలంలో సస్పెన్స్ డ్రామాస్ లో ప్రేక్షకులను బాగా మెప్పించిన మూవీ.. మహారాజ. ఈ మూవీ కూడా దాదాపు అలానే ఉంటుంది. కాబట్టి ఈ సినిమాను అసలు మిస్ చేయకుండా చూసేయండి. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేయండి.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. హీరోయిన్ ఓ పెద్ద లాయర్. అంతే కాకుండా వాళ్ళ ఊరిలో ఉండే ఓ బిజినెస్ మ్యాన్ జనం దగ్గర డబ్బులు తీసుకున్నాడని చెప్పి.. జనం తరపున వాదించి ఆ బిజినెస్ మ్యాన్ ను జైల్లో పెట్టిస్తుంది. అలాగే తన తమ్ముడు పోలిటిక్స్ లో పోటీ చేస్తాడు. మీడియా ముందు ఈమె మాట్లాడుతూ… తన తమ్ముడును గెలిపించమని ప్రమోట్ చేస్తుంది. ఇంతలో ఓ రిపోర్టర్ మీ నాన్నగారు చనిపోయారట కదా దాని గురించి మీ స్పందన ఏంటి అని అడుగుతాడు. దీనితో ఆమె షాక్ అవుతుంది. ఎందుకంటే అప్పటివరకు ఆమెకు ఈ విషయం తెలియదు. దీనితో వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అసలు అతను ఎలా చనిపోయారంటే.. కాస్త ఒంట్లో నలతగా ఉండడంతో హాస్పిటల్ కు తనే కార్ డ్రైవ్ చేసుకుంటూ స్టార్ట్ అవుతాడు. కానీ దారిలోనే హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోతాడు. కానీ హీరోయిన్ కు వాళ్ళ తమ్ముడుకి మాత్రం ఈ విషయంలో చాలా అనుమానాలు ఉంటాయి.

కట్ చేస్తే హీరోయిన్ వాళ్ళ నాన్న.. అందరికి ఆస్తి డివైడ్ చేసి.. తన లాయర్ కు ముందే ఇస్తాడు . ఆ లాయర్ అతను చెప్పినట్టే ఎవరి డాక్యుమెంట్స్ వాళ్లకు ఇచ్చేస్తారు. అయితే తన కూతురుకి ఇవ్వమని ఒక పెన్ డ్రైవ్ , ఒక కీ ఇస్తాడు. ఆ లాయర్ అలానే చేస్తాడు. ఆ పెన్ డ్రైవ్ లో వాళ్ళ నాన్న చివరిసారిగా మాట్లాడిన వీడియో ఉంటుంది. నీకు తెలీకుండా ఒక నిజాన్ని దాచిపెట్టాను.. నీకు ఒక తాళం ఇచ్చాను .. దానితో ఆ నిజాన్ని కనుక్కో అని చెప్తాడు. దీనితో ఆమె అప్పటినుంచి ఆ సీక్రెట్ కనుక్కోవడం కోసం ప్రయత్నాలు మొదలు పెడుతుంది. దానికోసం పక్కనే ఉన్న ఫారెస్ట్ లోకి ఒక్కతే వెళ్తుంది. అక్కడ ఒక హౌస్ లో ఒక అతను ఒక్కడే కూర్చుని విచిత్రంగా ఉంటాడు. దీనితో ఆమె భయపడి ఇంటికి తిరిగి వచ్చేస్తుంది. అసలు ఆ సీక్రెట్ ఏంటి ? ఆమె ఆ సీక్రెట్ ను కనుక్కుందా లేదా ? తర్వాత ఏమైంది ? అనేదే తెలియలాంటే ‘ఇంహెరిటెన్స్’ అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో రెంటల్ బేసిస్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే యూట్యూబ్ లో కూడా అందుబాటులో ఉంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ సినిమా చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

Jojobet GirişMadridbetMadridbetmeritbetmeritbetzirvebetPradabet güncel girişjojobetgalabetHoliganbetJojobet Girişjojobetjojobetcasibomcasibompokerklas giriş