Tirupathi Rao
OTT Suggestions- Vicky Cristina Barcelona Movie: ఓటీటీలో ఒక అద్భుతమైన ప్రేమకథ చూడాలి అనుకుంటుంటే మాత్రం మీకు ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఈ మూవీలో బ్లాక్ విడోగా చేసిన స్కార్లెట్ జాన్సన్ కూడా ఉంటుంది. ఈ సినిమా స్టార్ట్ చేస్తే ఆపడం కష్టం అనే చెప్పాలి.
OTT Suggestions- Vicky Cristina Barcelona Movie: ఓటీటీలో ఒక అద్భుతమైన ప్రేమకథ చూడాలి అనుకుంటుంటే మాత్రం మీకు ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఈ మూవీలో బ్లాక్ విడోగా చేసిన స్కార్లెట్ జాన్సన్ కూడా ఉంటుంది. ఈ సినిమా స్టార్ట్ చేస్తే ఆపడం కష్టం అనే చెప్పాలి.
Tirupathi Rao
లవ్, కాదల్, ఇష్క్, ప్రేమ.. ఇలా భాష ఏదైనా కూడా ప్రేమ ఎంతో మధురమైన అనుభూతి అని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అలాగే సినిమాల్లో కూడా భాష ఏదైనా లవ్ స్టోరీలకు మంచి డిమాండ్, క్రేజ్ ఉంటుంది. అలాంటి లవ్ స్టోరీ లవర్స్ కోసం ఒక క్రేజీ లవ్ స్టోరీ తీసుకొచ్చాం. ఇది అలాంటి ఇలాంటి లవ్ స్టోరీ కాదండోయ్.. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కలిసి ఒకే అబ్బాయిని ఇష్ట పడతారు. అక్కడితో ఆగకుండా కాస్త హద్దులు కూడా దాటేస్తారు. ఇక్కడ ఇంకో బిగ్ ట్విస్ట్ కూడా ఉంటుంది. మరి.. ఆ మూవీ ఏది? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోందో చూద్దాం.
ఓటీటీల్లో ఒక మంచి లవ్ స్టోరీ చూడాలి అని మీరు వెయిట్ చేస్తుంటే మాత్రం మీకు ఇది బెస్ట్ ఛాయిస్ అవుతుంది. ఈ మూవీలో క్రిస్టీనా ఆమె బెస్ట్ ఫ్రెండ్ విక్కీ ఉంటారు. వాళ్లు సమ్మర్ వెకేషన్ కోసం వాళ్ల ఆంటీ ఉండే బార్సిలోనాకి వెళ్తారు. అక్కడ వారికి ఒక వ్యక్తి పరిచయం అవుతాడు. అతని జోలికి వెళ్లకండి అని వాళ్ల ఆంటీ చెబుతూనే ఉంటుంది. కానీ, వాళ్ల దగ్గరకే అతను వచ్చి పరిచయం చేసుకుంటాడు. ఆ తర్వాత ముగ్గురం కలిసి కొన్నాళ్లు ట్రావెల్ చేద్దాం అంటూ ఆఫర్ ఇస్తాడు. అతని మాటలు కాస్త వింతగా ఉన్నా కూడా.. కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయని క్రిస్టీనా, విక్కీ కంటిన్యూ అవుతారు. అతనితో కొన్ని రోజులు కలిసి ఉండేందుకు అంగీకరిస్తారు.
వీళ్లు ముగ్గురు ఒకే ఇంట్లో ఉండటం స్టార్ట్ చేస్తారు. అందరి అభిరుచులు, ఇష్టాఇష్టాలు కలుస్తూ వస్తాయి. అయితే క్రిస్టీనా, విక్కీల మధ్య కూడా కొన్ని అభిప్రాయ బేధాలు రావడం మొదలవుతుంది. ఎందుకంటే ఇద్దరూ అతడిని ఇష్టపడటం స్టార్ట్ చేస్తారు. ఎవరు అతడిని సొంతం చేసుకోవాలి అనేదే పాయింట్ ఇక్కడ. వాళ్లు ముగ్గురు హద్దులు కూడా దాటేస్తారు. ఇక్కడ అసలు ట్విస్టు రివీల్ అవుతుంది. అతని జీవితంలో ఇలాగే ఇంకో యువతి కూడా ఉంటుంది. ఆమె ఒక్కసారిగా వీళ్ల మధ్యకు వస్తుంది. ఇంకేముంది.. అసలు రచ్చ అప్పుడే స్టార్ట్ అవుతుంది.
ఆ మూడో యువతి హీరోతో తాను తప్పితే ఎవరూ ఉండకూడదు అని భావిస్తుంది. ఆఖరికి చంపడానికి కూడా వెనుకాడదు. గన్ తీసుకుని కాల్పులు కూడా చేస్తుంది. ఇలాంటి ట్విస్టులు ఇంకా చాలానే ఉంటాయి. ఈ మూవీ పేరు ‘విక్కీ క్రిస్టీనా బార్సిలోనా‘. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. అయితే ఇండియాలో ఈ మూవీ చూసేందుకు ఆస్కారం లేదు. కానీ, మీరు ది ఫ్లిక్సర్ అనే వెబ్ సైట్ ఈ మూవీ చూడచ్చు. కొన్ని అభ్యంతరకర సన్నివేశాలు ఉంటాయి. కాబట్టి ఒంటరిగా చూస్తే మంచిది. ఈ మూవీ చూసేందుకు క్లిక్ చేయండి.