Swetha
OTT Best Family Drama : ఓటీటీ లో రొమాంటిక్, హర్రర్ , సస్పెన్స్ థ్రిల్లర్స్ ఏ కాకుండా మంచి ఫ్యామిలీ డ్రామాస్ కూడా ఉన్నాయి. కాకపోతే ఈ మధ్య కాలంలో ఫ్యామిలీ డ్రామా మూవీస్ వచ్చి చాల కాలమే అయింది కాబట్టి ఓ మంచి ఫ్యామిలీ డ్రామా చూడాలంటే ఈ సినిమా చూడాల్సిందే. మరి ఈ సినిమా మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.
OTT Best Family Drama : ఓటీటీ లో రొమాంటిక్, హర్రర్ , సస్పెన్స్ థ్రిల్లర్స్ ఏ కాకుండా మంచి ఫ్యామిలీ డ్రామాస్ కూడా ఉన్నాయి. కాకపోతే ఈ మధ్య కాలంలో ఫ్యామిలీ డ్రామా మూవీస్ వచ్చి చాల కాలమే అయింది కాబట్టి ఓ మంచి ఫ్యామిలీ డ్రామా చూడాలంటే ఈ సినిమా చూడాల్సిందే. మరి ఈ సినిమా మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.
Swetha
ఈ మధ్య కాలంలో చాలా మంది హర్రర్, సస్పెన్స్ , ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమాలను చూడడానికి ఇష్టపడుతున్నారు. ఇంకా చెప్పాలంటే వాచ్ ఎలోన్ సినిమాలను చూడడానికి ఇంకాస్త ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీనితో ఈ మధ్య కాలంలో ఫ్యామిలీ డ్రామాస్ తగ్గిపోయాయి అని చెప్పి తీరాలి. ఇక అప్పుడప్పుడు ఫ్యామిలీ డ్రామాస్ ను కూడా చూస్తూ ఉంటేనే ఎమోషన్స్ తెలుస్తూ ఉంటాయి. మరి ఓ మంచి ఫ్యామిలీ డ్రామా చూడాలని సెర్చ్ చేస్తుంటే మాత్రం ఈ మూవీ సజెషన్ మీకోసమే.. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో. ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.
ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న హీరోస్ లో.. ఇప్పుడిప్పుడే సక్సెస్ ట్రాక్ లో పడుతున్న హీరో సుహాస్. న్యాచురల్ గా సినిమాలలో తన పాత్రలలో ఒదిగిపోతూ.. మంచి మంచి కథలను ఎంపిక చేసుకుంటూ.. సినిమాలను తీస్తూ ఉంటాడు. ఈ మధ్య కాలంలో వరుస హిట్స్ తో దూసుకుపోతున్న ఈ హీరో నటించిన సినిమా గురించే.. ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ఈ సినిమాలో సుహాస్ తో పాటు తేజ కాసరపు, పూజా కిరణ్, అనూష నూతుల, శ్రుతి మెహర్, సంజయ్ రథా లాటి వారు ముఖ్య పాత్రలలో నటించారు. మెహర్ తేజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇక ఫ్యామిలీ కథలకు సుహాస్ పెట్టింది పేరు. ఈ క్రమంలోనే సుహాస్ నటించిన సినిమా “ఫ్యామిలీ డ్రామా”. ఈ సినిమా ప్రస్తుతం సోని లివ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. సంజయ్ అనే వ్యక్తికీ రామ, లక్ష్మణ్ అనే ఇద్దరు కుమారులు. ఉద్యోగం లేకుండా ఖాళీగా తిరుగుతూ ఉండడంతో.. రామను ఇంటి నుంచి బయటకు గెంటేస్తాడు అతని తండ్రి. ఇక రెండో కొడుకు లక్ష్మణ్ , యామిని అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకుని ఇంట్లోకి తీసుకుని వస్తాడు. ఓ రోజు లక్ష్మణ్ వ్యాపారం చేసుకోవాలని తండ్రిని డబ్బులు అడిగితే.. తన తండ్రి ఇవ్వనని, ఏదైనా ఉద్యోగం చేసుకోమని, రెండు రోజుల్లో ఉద్యోగం తెచ్చుకోకపోతే.. భార్యాభర్తలు ఇద్దరిని బయటకు గెంటేస్తానని ఆ తండ్రి చెప్తాడు. ఈ క్రమంలో తన ఇంట్లో జరుగుతున్న గొడవలన్నిటిని.. రామ తెలుసుకుంటాడు. ఆ సమస్యలను తీర్చడానికి.. తన తమ్ముడితో కలిసి ఓ ప్లాన్ వేస్తాడు. మరీ రామ ఎలాంటి ప్లాన్ వేశాడు? దాని కోసం ఎవరి హెల్ప్ తీసుకున్నాడు ! ఎవరితో ఆ ఇంప్లిమెంట్ చేయించాడు? మరో వైపు ఊరిలో వరుస అనుమానాస్పద హత్యలు జరుగుతూ ఉంటాయి. వరుస హత్యలకు పాల్పడుతున్న సీరియల్ కిల్లర్స్ ఎవరు! వారికి వీరికి సంబంధం ఏమిటీ? చివరకు వీరి జీవితాల్లో ఎలాంటి మలుపులు తిరిగాయి ! ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమాను ఇప్పటివరకు చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.