iDreamPost
android-app
ios-app

స్టూడెంట్ కష్టాలపై వెబ్ సిరీస్.. ఏ OTTలో స్ట్రీమింగ్ కానుందంటే..?

కలర్ ఫోటోతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు సందీప్ రాజ్. వర్ణ వివక్షత మీద తీసిన ఈ మూవీ జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా నిలిచింది. ఇప్పుడు ర్యాంకుల కోసం స్టూడెంట్స్ పడుతున్న కష్టాలకు సంబంధించి ఓ వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది. దీనికి ఆయన ప్రజెంటర్ గా వ్యవహరిస్తున్నాడు. ఇంతకు ఏ ఓటీటీలోకి రాబోతుందంటే..?

కలర్ ఫోటోతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు సందీప్ రాజ్. వర్ణ వివక్షత మీద తీసిన ఈ మూవీ జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా నిలిచింది. ఇప్పుడు ర్యాంకుల కోసం స్టూడెంట్స్ పడుతున్న కష్టాలకు సంబంధించి ఓ వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది. దీనికి ఆయన ప్రజెంటర్ గా వ్యవహరిస్తున్నాడు. ఇంతకు ఏ ఓటీటీలోకి రాబోతుందంటే..?

స్టూడెంట్ కష్టాలపై వెబ్ సిరీస్.. ఏ OTTలో స్ట్రీమింగ్ కానుందంటే..?

తెలుగు ప్రేక్షకులు శాడ్ ఎండింగ్‌ను కోరుకోరు.. హ్యాపీ ఎండింగ్ మాత్రమే ఇష్టపడతారు. అందులోనూ హీరోలు చనిపోతే ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరు. అలాంటి చిత్రాలను డిజాస్టర్స్ చేస్తారు. కానీ ఓ కొత్త డైరెక్టర్ ఆ రిస్క్ చేసి హీరోను చంపి సినిమాను హిట్ చేయడంతో పాటు జాతీయ ఉత్తమ చిత్రంగా నిలిపాడు. అదే కలర్ ఫోటో. వర్ణ వివక్ష నేపథ్యంలో తెరకెక్కింది ఈ మూవీ. కరోనా సమయంలో నేరుగా ఓటీటీలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కన్విన్సుగా సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు సందీప్ రాజ్. సుహాస్, చాందినీ చౌదరి, దివ్య శ్రీపాద, సునీల్ కీలక పాత్రలు పోషించారు.  తొలి సినిమాతోనే హిట్ అందుకున్నాడు సందీప్. ఇప్పుడు ఇతడి నుండి ఓ కామెడీ వెబ్ సిరీస్ రాబోతుంది.

ఈ సినిమా ఫస్ట్ లుక్ ను బేబి మూవీ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ రిలీజ్ చేశాడు. ఇంతకు ఆ వెబ్ సిరీస్ ఏంటంటే.. ఏఐఆర్ (AIR- ఆల్ ఇండియా ర్యాంకర్స్ అన్నది ఉపశీర్షిక). త్వరలో ఓటీటీలోకి రానుంది. సందీప్ రాజ్ ప్రజెంటర్‌గా మాత్రమే వ్యవహరిస్తున్న ఈ వెబ్ సిరీస్‌లో హర్ష రోషన్, భాను ప్రతాప్, సింధూ రెడ్డి, జయతీర్థ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. జోసెఫ్ క్లింటన్ దర్శకుడు. దీన్ని బై పాకెట్ మనీ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇటీవల ఈ వెబ్ సిరీస్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. పోస్టర్ చాలా ఇంట్రస్టింగ్ క్రియేట్ చేస్తుంది. చించేసిన ఓఎంఆర్ షీట్ మధ్యలో ముగ్గురు కుర్రాళ్లను చూపించాడు డైరెక్టర్. మ్యాథ్స్ ఫార్ములా ఉండటం ఆసక్తిని పెంచుతోంది.

AIR web series

చూడబోతే ఈ ముగ్గురు చుట్టూనే సినిమా నడుస్తున్నట్లు తెలుస్తుంది. వినోదం, డ్రామాతో కథగా తెలుస్తుంది . ఈ వెబ్ సిరీస్ త్వరలో ఓటీటీలోకి రాబోతుంది. ఈటీవీ విన్‌లో ప్రసారం కానుంది. ఈ మేరకు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఈటీవీ విన్ తమ ఓటీటీలో షేర్ చేసింది. ‘చుక్కలు ఉన్న చదువు, చుక్కలు చూపించే చదువు, ఐఐటీ ప్రపంచానికి స్వాగతం’ అంటూ తన వెబ్ సిరీస్ గురించి పోస్టర్ పంచుకుంది. ఐఐటీలో సీటు కోసం, ర్యాంకుల కోసం పోటీ పడే స్టూడెంట్స్ సంఘర్షణే ఈ మూవీ అని తెలుస్తోంది. కామెడీతో పాటు అంతర్లీనంగా సోషల్ మెసేజ్ కూడా ప్లాన్ చేసినట్లున్నాడు దర్శకుడు. ఇక ఈ సిరీస్ డేట్‌పై కొద్ది రోజుల్లోనే క్లారిటీ ఇవ్వనుంది చిత్ర యూనిట్. సెప్టెంబర్, అక్టోబర్ లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి