Swetha
OTT Movie Suggesttion: ఇప్పుడు ఓటీటీ లో వెబ్ సిరీస్ లకు పెరుగుతున్న ఆదరణ అంతా ఇంతా కాదు. ఈ క్రమంలో ఇప్పటివరకు ఎన్నో వెబ్ సిరీస్ లను చూసిన ప్రేక్షకులు.. ఇప్పుడు చెప్పుకోబోయే వెబ్ సిరీస్ ను చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.
OTT Movie Suggesttion: ఇప్పుడు ఓటీటీ లో వెబ్ సిరీస్ లకు పెరుగుతున్న ఆదరణ అంతా ఇంతా కాదు. ఈ క్రమంలో ఇప్పటివరకు ఎన్నో వెబ్ సిరీస్ లను చూసిన ప్రేక్షకులు.. ఇప్పుడు చెప్పుకోబోయే వెబ్ సిరీస్ ను చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.
Swetha
సినిమాలు ఎంత ఫేమస్ అవుతున్నాయో.. వెబ్ సిరీస్ లు కూడా అంతే పేరు సంపాదించుకుంటున్నాయి. ఇక ఇప్పుడు వెబ్ సిరీస్ లకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని మేకర్స్ కూడా వారికి తగినట్టు ప్లాన్ చేస్తూ సరికొత్త కథనాలతో ముందుకు వస్తున్నారు. ఇక ఇప్పుడు కొత్తగా వస్తున్న వెబ్ సిరీస్ లను అయితే ప్రేక్షకులు మిస్ చేసే అవకాశం లేదు. కానీ.. ఓటీటీ లో ఆల్రెడీ ఉన్న వెబ్ సిరీస్ లను మిస్ చేయొచ్చు. ఎందుకంటే కొన్ని వేల సినిమాలు, సిరీస్ లు ఓటీటీ ప్రపంచంలో సందడి చేస్తున్నాయి, ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఓ వెబ్ సిరీస్ గురించే.. ఒకవేళ ఈ సిరీస్ ను కనుక మిస్ అయ్యి ఉంటే వెంటనే చూసేయండి. మరి ఈ సిరీస్ ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.
ఈ సిరీస్ కథేంటంటే.. ఓ అవార్డు ఫంక్షన్ కు వెళ్లిన ఓ బాలీవుడ్ హీరోయిన్ అనామిక.. ఆమె ఆ అవార్డు ఫంక్షన్ నుంచి తిరిగి వచ్చే క్రమంలో అనుకోకుండా మాయమైపోతుంది. ఆమె ఏమైపోతుంది అనేది ఎవరికీ అర్థంకాదు. ఆమెను ఎవరైనా కిడ్నాప్ చేశారా.. ఆమెపై ఏదైనా అఘాయిత్యం జరిగిందా.. అనేది ఎవరికీ అంతు చిక్కదు. దీనితో పోలీస్ ఆఫీసర్ శోభ ఈ కేసును సాల్వ్ చేయడానికి రంగంలోకి దిగుతుంది. ఆమెకు సెలెబ్రిటీలంటే మంచి ఉద్దేశాలు ఉండవు. ఆమె ఈ కేసును సాల్వ్ చేసే క్రమంలో.. అనామిక గురించి కొన్ని ఆసక్తికర విషయాల గురించి తెలుసుకుంటుంది. ఆమె పర్సనల్ లైఫ్ గురించి, వివాహ బంధం గురించి, ఆమె పిల్లలకు సంబంధించిన విషయాలు, ఆమె సమస్యలు ఇలా ఎన్నో విషయాలు ఆమె తెలుసుకుంటూ వస్తుంది. అసలు ఎవరు ఈ అనామిక ? ఆమెకు ఏం జరుగుతుంది ? అంత పాపులారిటీ ఉన్న ఈ సెలబ్రిటీ ఉన్నట్లుండి ఎందుకు మాయమవుతుంది ? పోలీస్ ఆఫీసర్ అనామిక గురించి తెలుసుకున్న విషయాలేంటి ? ఆమె ఈ కేసును ఎలా సాల్వ్ చేయగలిగింది ? ఈ క్రమంలో ఆమెకు ఎదురైన సమస్యలు ఏంటి ? ఇవన్నీ తెలియాలంటే “ది ఫేమ్ గేమ్” అనే ఈ సిరీస్ ను చూడాల్సిందే.
ఈ సిరీస్ మొత్తంగా ఎనిమిది ఎపిసోడ్స్ ఉంటుంది. ఒక్కో ఎపిసోడ్ నలభై ఐదు నిమిషాల సమయం ఉంటుంది. మరి వెబ్ సిరీస్ లంటే ఇష్టం ఉన్న వారికి ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మంచి సజ్జెషన్ అని చెప్పి తీరాలి. ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. పైగా తెలుగులో కూడా ఈ సిరీస్ అందుబాటులో ఉంది. కాబట్టి ఎంచక్కా చూసేయండి. ముఖ్యంగా ఈ సిరీస్ లో చెప్పుకోదగిన స్పెషల్ విషయం ఏంటంటే.. 80’s నుంచి 90’s వరకు ఎన్నో అద్భుతమైన చిత్రాలతో… ప్రేక్షకులను అలరించిన మాధురి దీక్షిత్ ఈ సిరీస్ లో మెయిన్ లీడ్ లో నటించింది. ఓ రకంగా ఇది కంప్లీట్ గా మాధురి దీక్షిత్ షో అని చెప్పి తీరాలి. బాలీవుడ్ స్టార్స్ పర్సనల్ లైఫ్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఈ సిరీస్ ను చూడాల్సిందే. ఈ సిరీస్ ను కనుక ఇప్పటివరకు ఎవరైనా మిస్ అయితే వెంటనే చూసేయండి. ఈ సిరీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.