Swetha
ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలన్నిటిని కూడా ప్రేక్షకులు మిస్ చేయకుండా చూస్తూనే ఉన్నారు. ఇలా ప్రతివారం చాలా సినిమాలు వస్తూనే ఉన్నాయి . ఈ క్రమంలో కొన్ని సినిమాలను మిస్ చేస్తూ ఉండడం సహజం. ఒకవేళ ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాను కనుక మిస్ చేసి ఉంటే వెంటనే చూసేయండి.
ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలన్నిటిని కూడా ప్రేక్షకులు మిస్ చేయకుండా చూస్తూనే ఉన్నారు. ఇలా ప్రతివారం చాలా సినిమాలు వస్తూనే ఉన్నాయి . ఈ క్రమంలో కొన్ని సినిమాలను మిస్ చేస్తూ ఉండడం సహజం. ఒకవేళ ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాను కనుక మిస్ చేసి ఉంటే వెంటనే చూసేయండి.
Swetha
ఓటీటీ వరల్డ్ లోకి కొత్త కంటెంట్ తో చాలా సినిమాలు వచ్చేస్తున్నాయి. ఎప్పటికప్పుడు వచ్చే సినిమాలన్నిటిని కూడా ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారు. ఇలా ప్రతివారం చాలా సినిమాలు వస్తూనే ఉన్నాయి . ఈ క్రమంలో కొన్ని సినిమాలను మిస్ చేస్తూ ఉండడం సహజం. వారి కోసమే ఈ మూవీ స్పెషల్ మూవీ సజ్జెషన్. ఓటీటీ లో ఉండే హర్రర్, సస్పెన్స్, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లెర్స్ ను ఇష్టపడే ప్రేక్షకులు ఈ సిరీస్ ను మాత్రం మిస్ చేసి ఉండరు. ఒకవేళ మిస్ చేస్తే మాత్రం ఓ మంచి సస్పెన్స్ థ్రిల్లర్ ను మిస్ చేసినట్లే. మరి ఈ సిరీస్ ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది.. ఎందుకు ఈ సిరీస్ ను మిస్ చేయకుండా చూడాలి అనే విషయాలను చూసేద్దాం.
ఈ సిరీస్ పేరు ఏంటో చూసేకంటే ముందు అసలు ఈ సిరీస్ కథేంటో చూసేద్దాం. ఈ సినిమా కథేంటంటే.. మహీం అనే ఓ రైల్వే స్టేషన్ టాయిలెట్ లో ఓ యువకుడిని దారుణంగా హత్య చేసి.. అతని కిడ్నీ తీసుకెళ్ళిపోతారు. ఈ కేసును సాల్వ్ చేయడానికి శివాజీ రావ్ జెండే అనే ఓ పోలీస్ ఆఫీసర్ రంగంలోకి దిగుతాడు. ఇతను ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టేలోపే మరొక రెండు మర్డర్స్ జరుగుతాయి. దీనితో ఆ పోలీస్ ఆఫీసర్ ఈ కేసును సాల్వ్ చేయడానికి.. ఓ రిటైర్ జర్నలిస్టు సహాయం తీసుకుంటాడు. అయితే వీరి విచారణలో భాగంగా కొన్ని ఆసక్తి కర విషయాలు బయటపడతాయి. ఈ హత్యలు చేస్తున్నది ఎవరు ? ఈ కేసు ఎలా ముందుకు సాగింది ? జర్నలిస్ట్ కు ఈ హత్యలతో సంబంధం ఏంటి ? చనిపోయిన వారంతా ఎవరు ? ఇవన్నీ తెలియాలంటే ఈ సిరీస్ ను చూడాల్సిందే. అసలు ట్విస్ట్ ఏంటి అనేది ఈ సిరీస్ చివరిలో రివీల్ చేస్తారు. చివరి వరకు కూడా ఎంగేజింగ్ గా ఈ సిరీస్ కొనసాగుతుంది.
ఇప్పటివరకు క్రైమ్ థ్రిల్లర్ తరహాలో ఎన్నో సినిమాలు, సిరీస్ లు వచ్చాయి కానీ.. ఈ సిరీస్ మాత్రం కాస్త డిఫ్ఫరెంట్.ఈ సిరీస్ లో.. విజయ్ రాజ్, అషుతోశ్ రాణా, శివానీ రఘువంశీ ఈ సిరీస్ లో ప్రధాన పాత్రలు పోషించారు. ఇంతకీ ఈ వెబ్ సిరీస్ పేరు ఏంటంటే “మర్డర్ ఇన్ మహిమ్” . ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం జియో సినిమా ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లో అందుబాటులో ఉంది. పైగా ఈ సిరీస్ తెలుగు, కన్నడ, తమిళం, బెంగాలి, మరాఠీ భాషల్లో అందుబాటులో ఉంది. ఇప్పటివరకు ఈ వెబ్ సిరీస్ ను ఎవరైనా మిస్ చేసి ఉంటే మాత్రం ఓ వర్త్ వాచింగ్ సిరీస్ ను మిస్ అయినట్లే. కాబట్టి ఈ సిరీస్ ను ఎవరైనా మిస్ చేసి ఉంటే మాత్రం వెంటనే చూసేయండి. మరి ఈ సిరీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.