Hi Nanna: హాయ్‌ నాన్న ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడు? ఎక్కడంటే..

హాయ్‌ నాన్న సినిమా రొమాంటిక్‌ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కింది. డిసెంబర్‌ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక, ఈ చిత్రానికి సంబంధించి ముందుగానే ఓటీటీ వేదిక ఖరారు అయింది..

హాయ్‌ నాన్న సినిమా రొమాంటిక్‌ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కింది. డిసెంబర్‌ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక, ఈ చిత్రానికి సంబంధించి ముందుగానే ఓటీటీ వేదిక ఖరారు అయింది..

దసరా సినిమాలో ఊర మాస్‌ లుక్‌లో అదరగొట్టారు న్యాచురల్‌ స్టార్‌ నాని. కొత్త దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. నాని నటనకు అన్ని వర్గాలనుంచి మంచి మార్కులు పడ్డాయి. దసరా తర్వాత నాని ఎలాంటి సినిమా తీయబోతున్నారా? అని ఆయన ఫ్యాన్స్‌తో పాటు సగటు సినీ ప్రేక్షకుడికి ఓ కుతూహలం ఉండింది. నాని మాత్రం తన పాత గూటికే చేరారు. రొమాంటిక్‌ ఫ్యామిలీ డ్రామా సినిమాను ఎంచుకున్నారు. కొత్త దర్శకుడు శౌర్యవ్‌తో ‘హాయ్‌ నాన్న’ మూవీ చేశారు.

 ఈ చిత్రంలో నానికి జంటగా మృణాల్‌ ఠాకూర్‌ నటించారు. ఈ రొమాంటిక్‌ ఫ్యామిలీ డ్రామా ‘ హాయ్‌ నాన్న’ డిసెంబర్‌ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా విడుదల అవ్వనుంది. ఇక, ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ పార్నర్‌ ముందుగానే ఫిక్స్‌ అయింది. చిత్ర స్ట్రీమింగ్‌ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకుంది. సినిమా ఎప్పటినుంచి స్ట్రీమింగ్‌ అవ్వనుందన్న దానిపై అధికారిక ప్రకటన లేదు. డిసెంబర్‌ చివరి వారంలో కానీ, జనవరి మొదటి వారంలో కానీ, సినిమా ఓటీటీలో సందడి చేయనుంది.

తెలుగుతో పాటు ఇతర భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. కాగా, హాయ్‌ నాన్న సినిమాలో  జయరామ్‌, అంగద్‌ బేడీ, ప్రియదర్శి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. చిత్ర బృందం షూటింగ్‌ మొదలైన నాటినుంచి ‍ప్రమోషన్లను చేస్తూ వచ్చింది. నాని, మృణాల్‌ ఠాకూర్‌ వీలు చిక్కినప్పుడల్లా సోషల్‌ మీడియా ముందుకు వచ్చారు. ఇక, హాయ్‌ నాన్నలోని పాటలకు ప్రేక్షకులనుంచి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి.

 హాయ్‌ నాన్న కథ ఏంటంటే.. 

విరాజ్‌ ( నాని) ఓ స్ట్రగ్లింగ్‌ ఫొటోగ్రాఫర్‌. ఓ ప్రముఖ ఫొటోగ్రాఫర్‌ దగ్గర అసిస్టెంట్‌గా పని చేస్తూ ఉంటాడు. ఓ రోజు అతడికి యశ్న( మృణాల్‌ ఠాకూర్‌) కనిపిస్తుంది. ఆమెను చూసిన తొలిచూపులోనే ప్రేమలో పడిపోతాడు. ఆమె వెంట తిరుగుతూ ఫొటోలు తీస్తూ ఉంటాడు. విరాజ్‌ తన వెంటపడుతున్న విషయం యశ్నకు తెలుస్తుంది. అతడ్ని పట్టుకుని కెమెరాలాక్కుంటుంది. ఆ సమయంలో విరాజ్‌ ఆమెకు ప్రపోజ్‌ చేస్తాడు. ప్రేమ, పెళ్లి, పిల్లలు అంటే ఇష్టం లేని యశ్న .. విరాజ్‌ ప్రేమను ఒప్పుకుంటుంది. ఈ పెళ్లి యశ్న తల్లికి ఇష్టం ఉండదు. అయినప్పటికి ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు.  పెళ్లి తర్వాత ఇద్దరి జీవితాలు ఎలా మారాయి అన్నదే మిగిలిన కథ. మరి, హాయ్‌ నాన్న ఓటీటీ స్ట్రీమింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments