iDreamPost
android-app
ios-app

నానితో ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా..? అక్కడ ఆమెకు యమ క్రేజ్..!

  • Published Sep 08, 2024 | 3:43 PM Updated Updated Sep 08, 2024 | 3:43 PM

నానితో ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా..? అక్కడ ఆమెకు యమ క్రేజ్. ఈమె నటనకు ఆడియన్స్ కూడా ఫిదా అయ్యారు. ఇంతకు ఆమె ఎవరంటే..?

నానితో ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా..? అక్కడ ఆమెకు యమ క్రేజ్. ఈమె నటనకు ఆడియన్స్ కూడా ఫిదా అయ్యారు. ఇంతకు ఆమె ఎవరంటే..?

  • Published Sep 08, 2024 | 3:43 PMUpdated Sep 08, 2024 | 3:43 PM
నానితో ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా..? అక్కడ ఆమెకు యమ క్రేజ్..!

ఈ మధ్య హీరోయిన్‌గా ఇండస్ట్రీలో అడుగుపెట్టాలంటే.. స్టూడియోలు, ప్రొడక్షన్ హౌస్ చుట్టూ ఫోటోలు పట్టుకుని తిరగనక్కర్లేదు. జస్ట్ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటే చాలు.. దర్మక నిర్మాతలు ప్రొఫైల్ చూసి తమ సినిమాల్లోకి తీసుకుంటున్నారు. కొత్తగా నటనలో అడుగులు పెట్టాలనుకున్న వారికి ఇది వరంగా మారిందని చెప్పొచ్చు. వారు చేయాల్సిందల్లా షార్ట్స్, రీల్స్ అంటూ వీడియోలతో ఫేమ్ తెచ్చుకోవడమే. ఒక్క వీడియో క్లిక్ అయితే చాలు.. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నుండి నటిగా ప్రొఫైల్ స్టేటస్ మార్చుకునే అద్భుతమైన అవకాశాన్ని కొల్లగొట్టేయొచ్చు. ఇదిగో ఈ అమ్మాయిలా. నాని పక్కన ఉన్న ఈమె ఎవరో తెలుసా..? సామాజిక మాధ్యమాల ద్వారానే ఫేమ్ తెచ్చుకుని ఇప్పుడు నటిగా మారింది.

నానితో ఉన్న ఈ బ్యూటీ ఒకప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ఇప్పుడు యాక్టర్. తెలుగులో ఈ నేచురల్ స్టార్ నానితో ఓ మూవీలో నటించింది. ఇది ఆ షూటింగ్ సమయంలో తీసుకున్న పిక్.. తన ఖాతాలో షేర్ చేసుకుంది. ఇంతకు ఆ బ్యూటీ ఎవరంటే దృష్టి తల్వార్. ఆమె ఢిల్లీ డాల్. 1998 ఆగస్టు 30న దేశ రాజధాని హస్తీనాలో పుట్టిన ఈమె.. తొలుత టిక్ టాక్ వీడియోలు చేసింది. మంచి కంటెంట్ క్రియేటర్‌గా ఫేమ్ తెచ్చుకుంది. దీంతో ఆమెకు విపరీతమైన ఫాలోవర్స్ పెరిగారు. టిక్ టాక్ ఇండియాలో బ్యాన్ అయిన తర్వాత యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్ వంటి వేదికల ద్వారా మరింత సక్సెస్ అయ్యింది. ఇది ఆమెను మోడల్ నుండి నటిగా మార్చింది. అలా ఆమెకు 2022లో సినిమాలో నటించే అవకాశం వచ్చింది.

దృష్టి పంజాబీ చిత్రం “చోబ్బర్”తో వెండితెరపైకి ప్రవేశించింది. ఓ వైపు సినిమాలు చేస్తూనే, సోషల్ మీడియాలో కూడా ఫాలోవర్స్ పెంచుకునేందుకు ప్రయత్నించింది. అలా ఆమెకు హాయ్ నాన్నలో నటించే అవకాశం కొల్లగొట్టింది. ఇందులో హీరో నానికి మరదలు క్యారెక్టర్ చేసింది. అంటే మృణాల్ ఠాకూర్ సోదరి నేహా పాత్రలో నటించింది. ఉన్నది కాసేపే అయినా.. తన నటనతో ఆకట్టుకుంది. వచ్చిన ఛాన్స్ సద్వినియోగ పర్చుకుంటూ.. మరో వైపు ప్రైవేట్ సాంగ్స్ చేస్తుంది. తాజాగా ఫ్లై అనే పంజాబీ పాటలో కనిపించింది ఈ ఢిల్లీ గుడియా. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటూ తన ఫోటోలు, వీడియోలను క్రమం తప్పకుండా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ యూట్యూబ్‌ వీడియోలతో ట్రెండింగ్‌లో నిలుస్తూ ఉంటుంది. త్వరలో మరిన్ని అవకాశాలు తెలుగులో రావాలని ఆశిద్దాం.. ఏమంటారు..?

 

View this post on Instagram

 

A post shared by 𝘿𝙧𝙞𝙨𝙝𝙩𝙮 𝙏𝙖𝙡𝙬𝙖𝙧 (@drishtytalwarr)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss