Venkateswarlu
రేపు ఒక్క రోజే ఓటీటీలో 17 సినిమాలు సందడి చేయనున్నాయి. వీటిలో థియేటర్లలో సూపర్ హిట్ సాధించిన ఎమోషనల్ మూవీస్ కూడా ఉన్నాయి...
రేపు ఒక్క రోజే ఓటీటీలో 17 సినిమాలు సందడి చేయనున్నాయి. వీటిలో థియేటర్లలో సూపర్ హిట్ సాధించిన ఎమోషనల్ మూవీస్ కూడా ఉన్నాయి...
Venkateswarlu
ఓటీటీలో ప్రతీ వారం కొత్త కొత్త సినిమాలు సందడి చేస్తున్నాయి. ఓ వారం దాదాపు 50 టు 60 సినిమాల దాకా రిలీజవుతూ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇక, శుక్రవారం ( నవంబర్ 17) ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 17 సినిమాలు సందడి చేయనున్నాయి. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌లో సూపర్ హిట్ సినిమాలు సైతం స్ట్రీమింగ్ అవ్వనున్నాయి. అయితే, వీటిలో తెలుగుతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు భాషలకు సంబంధించిన సినిమాలు కూడా ఉన్నాయి.
రేపు ఓటీటీలోనే కాదు.. థియేటర్లలో కూడా భారీ అంచనాలు ఉన్న సినిమాలు విడుదల అవుతున్నాయి. ప్రముఖ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్, ఆర్‌ఎక్స్ 100 సినిమా ఫేమ్ అజయ్ భూపతి కాంబోలో వస్తున్న ‘ మంగళవారం’ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. చిత్ర బృందం సైతం ‘మంగళవారం’ తప్పకుండా ప్రేక్షకులను మెప్పిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇక, ఇదే కోవలో కన్నడ డబ్బింగ్ సినిమా ‘ సప్తసాగరాలు దాటి :బీ సైడ్) కూడా విడుదల కానుంది. సప్తసాగరాలు దాటి సైడ్ ఏ గత అక్టోబర్ నెలలో తెలుగు ప్రేక్షకుల ముందకు వచ్చింది. సైడ్ ఏకు ప్రేక్షకులనుంచే కాక, విమర్శకుల నుంచికూడా మంచి రివ్యూలు వచ్చాయి. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రత్యేకంగా తెలుగు ఇండస్ట్రీపై దృష్టి పెట్టి ప్రమోషన్లు చేసింది. ఒకరకంగా చెప్పాలంటే సైడ్ బీపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఏ మాత్రం ప్రేక్షకులను అలరిస్తుందో వేచి చూడాలి.
వీటితో పాటు ‘‘స్పార్క్ లైప్’’ అనే చిన్న సినిమా కూడా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాలో విక్రాంత్ రెడ్డి, మెహ్రిన్ ఫిర్జాదా, రుక్షర్ దిల్షాన్‌లు హీరో, హీరోయిన్లుగా నటించారు. బ్రహ్మాజీ, వెన్నెలక ఇషోర్, శ్రీకాంత్ అయ్యంర్, తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. ఇక, ఈ చిత్రానికి విక్రాంత్ రెడ్డే దర్శకుడు కావటం విశేషం. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో మిన్నల్ మురళి ఫేమ్ గురు సోమ సుందరం విలన్‌గా చేశారు.
చిన్నా
కన్నుర్ స్క్వాడ్
అపూర్వ(సిరీస్)
ది రైల్వేమెన్(సిరీస్)
బిలీవర్2(కొరియన్)
క్రైమ్‌కోడ్(బ్రెజీలియన్)
సబరెటెర్నా(ఫ్రెంచ్)
రస్టిన్( ఇంగ్లీష్)
ఆల్ టైమ్ హై ( ఫ్రెంచ్)
బెస్ట్ క్రిస్టమస్ ఎవర్ ( ఇంగ్లీష్)
ఫీడ్‌బ్యాక్ సీజన్ 1 (పోలిస్)
ఇన్ లవ్ అండ్ డీప్ వాటర్ ( జపనీస్)
నథింగ్ టు సీ హియర్ ( స్పెయిన్)
క్రాషింగ్ ఈద్( సౌదీ)
తీపొరిబెన్నీ (మలయాళం)
జ్యోతీ
గోస్ట్ ( కొరియన్)