iDreamPost
android-app
ios-app

ఆ మీడియా : మంచి వినదు, మంచి మాట్లాడదు, మంచి చూడదు

  • Published May 05, 2020 | 5:15 PM Updated Updated May 05, 2020 | 5:15 PM
ఆ మీడియా : మంచి వినదు, మంచి మాట్లాడదు, మంచి చూడదు

ఆనాడు మహాత్మాగాంధి చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకన్న సూక్తికి హెచ్చరికగా మూడు కోతులను చెప్పేవారు. కానీ ఇపుడు రాష్ట్రంలో ప్రతిపక్షాలు, ఎల్లోమీడియా వ్యవహారం గాంధి సూక్తికి పూర్తి విరుద్దంగా జరుగుతోంది. వీళ్ళ తాజా సూక్తులేమిటంటే మంచి చూడకు, మంచి వినకు, మంచి మాట్లాడకు అన్నట్లుగా ఉంది వీళ్ళ వ్యవహారమంతా.

జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి గాంధి సూక్తికి రాష్ట్ర రాజకీయాలు పూర్తి విరుద్ధంగా నడుస్తున్న విషయం అందరూ చూస్తున్నదే. జగన్ చేస్తున్న మంచి పనుల గురించి ప్రతిపక్షాలు కానీ ఎల్లోమీడియా కాని ఎక్కడా మాట్లాడటం లేదు. సంక్షేమ పథకాల ద్వారా జనాలకు అందుతున్న మంచిని ప్రతిపక్షాలు, ఎల్లోమీడియా చూడటం లేదు. జగన్ పాలనపై ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు లేకపోతే ప్రముఖులు చేస్తున్న ప్రశంసలను ప్రతిపక్షాలు, ఎల్లోమీడియా వినటం లేదు.

నిజానికి రాజకీయాల్లో ప్రతిపక్షాలు అధికారపార్టీపై ఆరోపణలు చేయటం, విమర్శలు చేయటం మామూలే. ఎందుకంటే రాజకీయంగా లబ్దిపొందటానికే ఏ పార్టీ అయినా ప్రయత్నిస్తుంది కాబట్టి అధికారపార్టీకి వ్యతిరేకంగా నడుచుకోవటమే ప్రతిపక్షాలు చేసే పని. కానీ అధికారపార్టీ చేసే ప్రతి పనినీ వ్యతిరేకించేదాన్నే ప్రతిపక్షమంటారా ? అనే అనుమానం జనాల్లో వచ్చేస్తోంది. దక్షిణకొరియా నుండి వైరస్ నిర్ధారిత పరీక్షల కిట్లను తెప్పిస్తే ఒక్క పార్టీ కూడా జగన్ను అభినందించలేదు.

సరే ప్రతిపక్షాల విషాయాన్ని పక్కనపెట్టేస్తే మీడియా ఏమి చేస్తోంది ? నిజానికి మీడియా చెయాల్సిదేమిటంటే తప్పుని తప్పుగాను, ఒప్పుని ఒప్పుగానో చెప్పాలి. ప్రభుత్వం చేస్తున్న మంచినీ, చెడుని కూడా జనాలముందుంచటమే బాధ్యతాయుతమైన మీడియా చేయాల్సిన పని. దురదృష్టం ఏమిటంటే ఏపిలో మీడియా కులాల వారీగా, పార్టీల వారీగా చీలిపోయింది. గుజరాత్ నుండి సుమారు 4500 మంది వలసకార్మికులను ఏపికి తీసుకురావటంలో చొరవ చూపించిన జగన్ గురించి ఎల్లోమీడియాలో ఒక్క మంచి మాట కూడా కనబడకపోదటమే తాజా ఉదాహరణ. దేశం మొత్తం మీద ఎక్కువ పరీక్షలు నిర్వహించింది ఏపిలో మాత్రమే. అయినా ఒక్క మీడియాలో కూడా జగన్ కు సానుకూలంగా ఒక్క కథనం కూడా లేదు.

చంద్రబాబునాయుడుకు సొంత మీడియా లేదన్నది వాస్తవం. అయితే రాష్ట్రంలో మెజారిటి మీడియా చంద్రబాబు ప్రయోజనాల కోసమే పనిచేస్తోందన్న విషయం అంతకన్నా వాస్తవం. అందుకే చంద్రబాబు ప్రత్యేకంగా మీడియాను ఏర్పాటు చేసుకోలేదని అందరికీ తెలుసు. చంద్రబాబు కారణంగానే జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఎల్లోమీడియా చూడదు. పథకాల్లో లబ్దిపొందుతున్న జనాల గురించి మాట్లాడదు. ఇతర రాష్ట్రాల నేతలు జగన్ను అభినందిస్తుంటే వినలేకపోతోంది. మూడు కోతుల సూక్తికి అచ్చంగా వ్యతిరేకంగా తయారైపోయింది మీడియా వ్యవహారం.