విజయవాడలో ఈ నెల 26 నుంచి వారం రోజుల పాటు విజయవాడలో లాక్‌డౌన్ అమలు చేస్తున్నట్టు జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకుంటున్నట్టు కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ వెల్లడించారు.
లాక్‌డౌన్ సడలింపుల తర్వాత కృష్ణా జిల్లాలో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో అనంతపురం, ఒంగోలు, శ్రీకాకుళంలో లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. అదేబాటలో విజయవాడలో కూడా ఈ నెల 26 నుండి లాక్‌డౌన్ విధించనున్నట్లు నిత్యావసర సరుకులు ముందుగానే తెచ్చుకోవాలని కలెక్టర్ ఇంతియాజ్ సూచించారు. కాగా ఆ ఉత్తర్వులు వెనక్కి తీసుకుంటున్నట్లు తాజాగా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు విజయవాడలో అన్నీ యథాతథంగానే ఉంటాయని కలెక్టర్ వెల్లడించారు.
కాగా కృష్ణా జిల్లాలో ఇప్పటివరకూ1096 పాజిటివ్ కేసులు నిర్దారణ అయ్యాయి. వీరిలో 507 మందికి వ్యాధి నుండి కోలుకోగా 549 మంది చికిత్స పొందుతున్నారు. 40 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజులో 33 పాజిటివ్ కేసులు నిర్దారణ అయ్యాయి. దాంతో లాక్‌డౌన్ విధిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. తాజాగా ఆ ఉత్తర్వులు వెనక్కి తీసుకుంటున్నట్లు కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు.